మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ రివ్యూ

Published On: September 7, 2023   |   Posted By:

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

అన్విత( అనుష్క) లండన్ లో మాస్టర్ చెఫ్ గా వర్క్ చేస్తూ తన తల్లి (జయసుధ) తో జీవిస్తుంటుంది. అన్విత కి ప్రేమ,పెళ్లి మీద మంచి అభిప్రాయం ఉండదు పెళ్లి చేసుకోకుండానే IUI ద్వారా తల్లి కావాలనుకొంటుంది. ప్రెగ్నెన్సీ కోసం సిద్దు( నవీన్ పోలిశెట్టి) ని సెలెక్ట్ చేసుకొంటుంది. కానీ సిద్దు ఆమెతో లవ్ లో పడతాడు. తరువాత అన్విత తనకి ఏమి కావాలో చెప్పినపుడు షాక్ అవుతాడు. అయితే తల్లి కావాలి అనుకొనే అన్విత కి సిద్దు సహాయం చేశాడా? అసలు అన్విత IUI ద్వారా పిల్లలని ఎందుకు కనాలనుకోంది? అన్విత,సిద్దు ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ?

ఎనాలసిస్ :

IUI పద్ధతి ద్వారా బిడ్డలను కనే కథాంశం ఇది.

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ : 

అనుష్క శెట్టి నటన బాగుంది, స్టాండ్ అప్ కమెడియన్ నవీన్ పోలిశెట్టి బాగా రాణించాడు, మురళి శర్మ, జయ సుధ వాళ్ళ పాత్రలకు న్యాయం చేసారు

టెక్నికల్ గా :


మహేష్ బాబు. పి డైరెక్షన్ పర్వాలేదు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగా రాసుకొంటే బాగుండేది. గోపి సుందర్ BGM పర్వాలేదు. Radhan సాంగ్స్ పర్వాలేదు. నీరవ్ షా కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

చూడచ్చా :

చూడొచ్చు, కొత్త రకం స్టోరీ

ప్లస్ పాయింట్స్ :

స్టోరీ లైన్ బాగుంది. అనుష్క శెట్టి అన్విత పాత్రలో అద్భుతంగా నటించింది. స్క్రీన్ మీద చాలా అందంగా ఉంది. నవీన్ పోలిశెట్టి తనకి తగిన పాత్రలో బాగా నటించాడు. మురళీశర్మ , జయసుధ, మిగతా నటీనటులు తమ పాత్రలకి న్యాయం చేసారు.

మైనస్ పాయింట్స్ :

స్టోరీ ఆరంభం, నెమ్మదిగా సాగే కథనం

నటీనటులు:

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
బ్యానర్: యువి క్రియేషన్స్
విడుదల తేదీ : 07-09-2023
సెన్సార్ రేటింగ్: “ U/A “
కథ – దర్శకత్వం : మహేష్ బాబు పి
సంగీతం: రాధన్
సినిమాటోగ్రాఫర్: నీరవ్ షా
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: వంశీ, ప్రమోద్
రన్‌టైమ్: 151 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్