మీకు బాగా కావాల్సినవాడిని సినిమా చివరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో

Published On: June 11, 2022   |   Posted By:

మీకు బాగా కావాల్సినవాడిని సినిమా చివరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో

యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని.

కొత్త దర్శకుడు కార్తిక్ శంక‌ర్ ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు. రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు.

ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో చిత్ర షూటింగ్ పూర్తి కానున్న ట్లు తెలిపారు దర్శక నిర్మాతలు.

కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

న‌టీన‌టులు –

కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సంజ‌న ఆనంద్‌, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహ‌రిక‌, ప్ర‌మోదిని, భరత్ రొంగలి త‌దిత‌రులు

టెక్నికల్ టీమ్:

స‌మ‌ర్ప‌ణ‌.. కోడి రామ‌కృష్ణ‌
బ్యాన‌ర్‌.. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
లిరిక్స్‌.. భాస్క‌ర్ భ‌ట్ల
ఎడిట‌ర్‌.. ప్ర‌వీన్ పూడి
ఆర్ట్ డైర‌క్ట‌ర్‌.. ఉపేంద్ర రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ .. భ‌ర‌త్ రొంగలి
సినిమాటోగ్ర‌ఫి.. రాజ్ నల్లి
సంగీతం.. మ‌ణిశ‌ర్మ‌
కో-ప్రోడ్యూస‌ర్‌.. న‌రేష్ రెడ్ది మూలే
ప్రోడ్యూస‌ర్‌.. కోడి దివ్య దీప్తి
డైర‌క్ట‌ర్‌.. కార్తిక్ శంక‌ర్‌