మెకానిక్ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

Published On: December 1, 2023   |   Posted By:

మెకానిక్ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

అనిల్ రావిపూడి చేతుల మీదుగా “మెకానిక్”  మూవీ టీజర్  కాన్సెప్ట్ పోస్టర్ విడుదల
టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై   మణి సాయి తేజ,రేఖ నిరోషా జంటగా నటిస్తూ,నాగ  మునెయ్య(మున్నా) నిర్మాతగ ముని సహేకర దర్శకత్వం వహిస్తున్నా చిత్రమ్     “మెకానిక్”. ట్రబుల్ షూటర్… ట్యాగ్ లైన్.
ఇటీవలే  సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి    చేసుకొని  డిసెంబర్  15 న విడుదలకి సిద్ధమౌతోంది .
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఈ సినిమా టీజర్ కు సంబంధించిన పోస్టర్  ను లాంచ్ చేయడం జరిగింది.
ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన “నచ్చేసావే పిల్లా నచ్చేసావే  ” పాట  Instagram లో 100M+ views సాదిచగా …youtube లో 8M+ views సాదించి ట్రెండింగ్ లో ఉంది.ఇదే సినిమా నుంచి రిలీజ్ అయిన  To-let board ఉందీ – నీ ఇంటికి    అనే మరో పాట 1.6M+  views తో ముందుకు దూసుకు పోతోంది .
ఈ సినిమా నుండి కైలాష్ ఖేర్ పాడిన మరో ఎమోషనల్ సాంగ్ అతి త్వరలో మీ ముందుకు రాబోతోంది..
తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, సమ్మెట గాంధీ, కిరీటి, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, ,వీర శంకర్ ,జబర్దస్త్ దొరబాబు  సునీత మనోహర్, సంధ్య జనక్   తధితరులు నటిస్తుండగా, పుష్పా ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్  మాస్టర్ స్టంట్స్ అందించారు . నందిపాటి శ్రీధర్ రెడ్డి మరియూ కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మాతలుగా వ్యవహారించారు .
ఈ  సినిమా తెలుగుతో పాటు తమిళం,  కన్నడ, హిందీ  భాషల్లోను  వచ్చే డిసెంబర్ 15 న విడుదల చేయబోతున్నట్టు   దర్శక నిర్మాతలు వెల్లడించి  టీజర్ కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి గారికి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.