మెగాస్టార్ సాయానికి ఫిలింక్రిటిక్స్ కృత‌జ్ఞ‌త‌లు

Published On: April 19, 2020   |   Posted By:
మెగాస్టార్ సాయానికి ఫిలింక్రిటిక్స్ కృత‌జ్ఞ‌త‌లు
 
మెగాస్టార్ ఆధ్వ‌ర్యంలో సీసీసీ సాయానికి ఫిలింక్రిటిక్స్ కృత‌జ్ఞ‌త‌లు
 
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన `క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)- మ‌న‌కోసం`  సినీప‌రిశ్ర‌మ 24 శాఖ‌ల్లోని వారికి నిత్యావ‌స‌ర వ‌స్తువుల్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. సినీ పాత్రికేయుల‌కు ఈ సాయం అందాల‌న్న మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతిపాదనకు సీసీసీ క‌మిటీ ఏకీభ‌వించి సినిమా జ‌ర్న‌లిస్టుల‌కు ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ (ఎఫ్‌.సీ.ఏ) త‌ర‌పున గ‌త మూడు రోజులుగా నిత్యావ‌స‌ర స‌రుకుల్ని పంపిణీ చేశాం. ఈ సంద‌ర్భంగా ఎఫ్‌.సీ.ఏ కుటుంబ స‌భ్యులు త‌మ‌ ఆనందం వ్య‌క్తం చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి గారికి మరియు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ , ఎన్.శంక‌ర్, మెహర్ రమేష్  ఇత‌ర సీసీసీ క‌మిటీ సభ్యులకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.