మెగా 154 భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం

Published On: March 28, 2022   |   Posted By:

మెగా 154 భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం

Image

మెగాస్టార్ చిరంజీవి, బాబీ ,మైత్రి మూవీ మేకర్స్ – మెగా 154 భారీ యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం లో మెగా 154 (వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్నారు ,ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . ఈ చిత్రానికి సంబందించిన హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో షూట్ చేస్తున్నారు.

చిత్ర యూనిట్ ఈ షెడ్యూల్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు ఫైటర్స్ తో ఉత్కంఠ భరితమైన యాక్షన్ ఎపిసోడ్ ని ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్ లక్ష్మణ్ సారథ్యం లో చిత్రీకరిస్తున్నారు. ఇది అభిమానులకి మరియు మాస్ ఆడియన్స్ కి ఒక కిక్ ఇచ్చే లా ఉండబోతుంది. హీరోయిన్ శృతి హాసన్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

మెగా 154 చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపు దిద్దుకుంటుంది ఇందులో కమర్షియల్ అంశాలు సమపాళ్లలో లో ఉంటూ వింటేజ్ చిరంజీవి ని మళ్ళీ స్క్రీన్ మీద కి తీసుకు వచ్చే లాగా పవర్ ఫుల్ దర్శకుడు బాబీ సిద్ధం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి – బాబీ – శృతి హాసన్ కలయిక లో ఇదే మొదటి చిత్రం .

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో ఫాన్స్ కి పూనకాలు తెప్పించిన బాబీ ఈ చిత్రం లో తన ఫుల్ పొటెన్షియల్ తో మెగాస్టార్ చిరంజీవి ని ఒక సరికొత్త మాస్ పాత్ర లో చూపించనున్నారు

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జి కె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అగ్రశ్రేణి సాంకేతిక బృందం సహకరిస్తోంది, అయితే పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో భాగమయ్యారు.

మెగా154 కి చిరంజీవి కి అనేక చార్ట్ బస్టర్ ఆల్బమ్ లను అందించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఎడిటర్ గా నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైనర్ గా ఎఎస్ ప్రకాష్ పని చేస్తున్నారు. సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

బాబీ స్వయంగా కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ప్లే రాశారు. రైటింగ్ డిపార్ట్మెంట్ లో హరి మోహన కృష్ణ మరియు వినీత్ పొట్లూరి కూడా ఉన్నారు.

తారాగణం: చిరంజీవి, శృతి హాసన్,

నిర్మాతలు: నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
DOP: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
సహ నిర్మాతలు: GK మోహన్, ప్రవీణ్ M
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
అదనపు రచన: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి