రంగబలి మూవీ రివ్యూ

Published On: July 7, 2023   |   Posted By:

రంగబలి మూవీ రివ్యూ

 

Emotional Engagement Emoji

స్టొరీ లైన్ :

శౌర్య (నాగశౌర్య) కి తన సొంత ఊరంటే ఇష్టం, ఏం చేసినా సొంత ఊరిలోనే సెటిల్ అవ్వాలని అనుకొనే వ్యక్తి. నాన్న (గోపరాజు రమణ) ఊరులో 25ఏళ్లుగా ఒక మెడికల్ షాప్ నడుపుతుంటాడు. శౌర్య బి ఫార్మసీ చదివినా మెడిసిన్ పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి, ఫాదర్ మాత్రం అతనికి మెడికల్ షాప్ అప్పజెప్పి రిలాక్స్ అవుదామనుకుంటాడు. మెడికల్ ట్రైనింగ్ కోసం వైజాగ్ పంపిస్తాడు. అక్కడ శౌర్య ,సహజ ఒక డాక్టర్ (యుక్తి తరేజ )తో ప్రేమలో పడతాడు. సహజ, శౌర్య ని పెళ్ళిచేసుకోవాలని తండ్రి మురళీ శర్మ దగ్గరకి పంపిస్తుంది. మురళి శర్మ ముందు ఒప్పుకున్నా, తర్వాత శౌర్య ఊరు రాజవరం ఆని తెలిసి పెళ్లికి నిరాకరిస్తాడు.

ఎందుకంటే ఆ ఊరికి తనకి బ్యాక్ స్టోరీ ఉంటుంది. రాజంపేటలోని రంగబలి సెంటర్ లో 20 ఏళ్ల క్రితం మురళి శర్మ ఫాదర్ రంగా రెడ్డి (శరత్ కుమార్)ని తల నరికేస్తారు. అప్పటినుండి గుర్రం బొమ్మ సెంటర్ పిలుస్తున్న ఆ సెంటర్ కి రంగబలి గా అందరూ పిలవడం మొదలు పెడతారు. రంగారెడ్డి ఆ ఊర్లో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ముందుండి పరిష్కారం చేసేవాడు. ఎంతోమందికి సాయం చేసి వాళ్ళ జీవితాలు బాగు చేస్తుంటాడు. ఆ విధంగా అందరూ అతన్ని దేవుడిలా చూస్తుంటారు. అతని గొప్పతనాన్ని, అతనికి ప్రజల్లో వున్న ఇమేజ్ ని ఆ ఊరి ఎమ్మెల్యే తట్టుకోలేక అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సమయం చూసి రంగారెడ్డి ని హత్య చేయిస్తాడు. ఆ ఊరికోసం ప్రజలకోసం ఎంత మంచి చేసినా చివరకి ఊరంతా రంగా రెడ్డి చనిపోయిన తర్వాత ఆ సెంటర్ కి రంగ బలి ఆని పిలవడం మురళీ శర్మకి నచ్చక ఆ ఊరి నుండి వైజాగ్ వచ్చి సెటిల్ అవుతాడు. ఆ విషయం తెలుసుకున్న శౌర్య మురళీ శర్మ తో మీ నాన్న గారి గొప్పతనం ఉరి జనాలకు చెప్పి రంగబలి సెంటర్ పేరు మార్చి మిమ్ముల్ని మీ పుట్టిన ఊరు కి తీసికెళ్ళి మీ కూతురిని పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. హీరో శౌర్య ఆ సెంటర్ పేరు ను ఎలా మార్చాడు …. అలాగే సహజ (హీరోయిన్) ని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది థియేటర్ లో చూడండి …..

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

హీరో, హీరోయిన్ పెర్ఫార్మన్స్ అవేరేజ్
కమెడియన్ సత్య కామెడీ టైమింగ్ బాగుంది

ప్లస్ లు :

సినిమాటోగ్రఫీ బాగుంది

మైనస్ లు :

స్క్రీన్ ప్లే సరిగ్గాలేదు

నటీనటులు :

నాగ శౌర్య, యుక్తి తరేజ, సత్య, బ్రహ్మాజీ

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్: రంగబలి
బ్యానర్: SLV సినిమాస్
కథ – దర్శకత్వం : పవన్ బాసంశెట్టి
సంగీతం: పవన్ సి.హెచ్
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్.ఆర్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రన్ టైమ్ : 137 నిమిషాలు
విడుదల తేదీ : జులై 7, 2023