రంగమార్తాండ మూవీ రివ్యూ

Published On: March 23, 2023   |   Posted By:

రంగమార్తాండ మూవీ రివ్యూ

కృష్ణవంశీ  ‘రంగమార్తాండ’ రివ్యూ

Emotional Engagement Emoji

ఉగాది బరిలో వచ్చిన మరో సినిమా రంగమార్తాండ. ఒకప్పుడు వరుసబెట్టి క్లాసిక్స్ అందించిన సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ నుంచి వచ్చిన చిత్రమిది. చాలా ఏళ్లుగా సరైన విజయం లేని ఈ క్రియేటివ్ జీనియస్ ఈసారి చాలా ఇష్టపడి, కష్టపడి మరాఠీ మూవీ నటసామ్రాట్ను రీమేక్ చేశాడు. ఎన్నో అవాంతరాలను దాటి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్స్, టీజర్స్ చూస్తే ఇది ఎమోషన్లు, సెంటిమెంట్‌తో ముడిపడ్డ గాఢమైన సినిమాలా అనిపిస్తోంది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఆడతాయా లేదా అనేది ఎవరికి అర్దం కాని విషయంగా మారింది. రిలీజ్ కు ముందే స్పెషల్ ప్రివ్యూల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ అభిరుచి ఉన్న ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. మరి ఈ చిత్రం ఎంతమేర మెప్పిస్తుంది. వేసవి సీజన్‌కు ఆరంభాన్నిస్తుందా లేదా అన్నది చూద్దాం.

స్టోరీ లైన్:

ప్రకాష్ రాజ్(రాఘవరావు ఒక నాటక కళాకారుడు. ఎక్కడ చూసినా ఆయన పేరు ప్రతిష్టలు, దాని వెనక డబ్బు. అలాగే రంగమార్తాండ అనే బిరుదు. కానీ ఆ బిరుదు ప్రధాన సమయంలో తను రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. ఇక తన జీవితం కుటుంబానికం అంకితం అంటాడు. అలాగే అన్నట్లుగానే తన ఆస్తులను పిల్లలకు పంచి ఇస్తాడు. ఇక కొడుకు రంగారావు (ఆదర్శ్), కోడలు గీత (అనసూయ) లకు ఇంటిని, కూతురు శ్రీ (శివాత్మిక) కు పిక్స్ డిపాజిట్ చేసిన సొమ్మును,బంగారు నగలను ఇచ్చేస్తాడు. అంతేకాకుండా ఆమె ప్రేమించిన వ్యక్తి రాహుల్ సిప్లిగంజ్ తో పెళ్లి కూడా చేయిస్తాడు. ఇక అన్ని భాధ్యతలు తీరాయని తన భార్య రమ్యకృష్ణతో సంతోషంగా గడపాలని అనుకుంటాడు. కానీ చివరికి తను అనుకున్నట్లుగా తన జీవితం సాగితే అందులో కథేముంది. అన్ని రివర్స్ అవుతాయి. తన అనుకున్న పిల్లలతో తాను ఎడ్జెస్ట్ కాలేకపోతాడు. కొడుకు దగ్గర నుంచి కూతురుకు వెళ్తాడు. అక్కడా ఆనందంగా గడపలేకపోతాడు. దాంతో రాఘవరావు ఓ నిర్ణయం తీసుకుంటాడు. అదేమిటి. అలాగే తన ప్రాణ మిత్రుడు చక్రపాణి( బ్రహ్మానందం)కు జీవితంలో చేసిన ఓ సాయం ఏమిటిదాని పరిణామాలుఅది చెయ్యాల్సిన పరిస్దితి ఏమొచ్చింది అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:

నిజానికి ఒరిజనల్ నట సామ్రాట్ చిత్రంలో సోల్ ఉంది. కాకపోతే మారిన కాలమాన పరిస్తితుల్లో ఓటిటికి పనికొచ్చే కంటెంట్ అనిపిస్తుంది. కానీ దానికి తెరపై చూపించాలంటే చాలా హోమ్ వర్క్ జరగాలి. కృష్ణవంశీ చాలా వరకూ చేసారు . కానీ అంతకు మించి కావాలనే జనరేష్ లో తాను ఉన్నాననే విషయం మర్చిపోయారు. అలాగే స్టార్ పవర్, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం కూడా చాలా మందిని దూరం పెడుతుంది ఏదైమైనా మానవ సంబంధాలు , అనుబంధాలు మధ్య తిరిగే మధ్యతరగతి కథలు ఈ మధ్యన తెలుగు తెరకు అరుదైపోయాయి. అలాంటి ఓ కథ ను అందించాలని కృష్ణవంశీ (Krishna Vamsi) ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చానని చెప్పారు. ఇప్పటిదాకా అది హిట్టైనా, ప్లాఫైనా తన ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులకు ఏదో ఒక మంచి చెప్పడానికి, సందేశం ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆయన సినిమాలకు సమాజమే ఈ కథావస్తువు గా చెప్పారు. ఆ క్రమంలోనే మరాఠీ సినిమా నటసామ్రాట్ను తెలుగులో రీమేక్ చేశారు. అయితే అక్కడకి ఇక్కడికి తేడా ఏమిటంటే. మనకు డ్రామా నటులు, స్టేజి కల్చర్ ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితమే అంతరించింది. దాంతో ఈ సినిమా చూస్తున్నప్పుడు కనెక్ట్ కావటం కష్టమే అనిపిస్తుంది.

ఇంకా ఈ రోజుల్లో నాటకాల్లో కోట్లు సంపాదించిన జనరేషన్ ఉందా, ఇంకా బంగారు కంకణాలు తొడిగించుకునే స్టేజి ఆర్టిస్ట్ లు ఉన్నారా అనే సందేహం వస్తుంది. అయినా ఏమో ఉన్నారేమో అని ఎడ్జెస్ట్ అయ్యి సినిమా చూస్తుంటే ఇది కూతురు, కొడుకు నిరాదరణకు లోనైన ఓ జంట పడే ఇబ్బందులు కథ అని అర్దమవుతుంది. దాంతో ఇలాంటివి టీవిల్లోనే కాకుండా తెరపైన కూడా వస్తున్నాయా అనే సందేహం మళ్లీ కలుగుతుంది. అయితే ఆనందం. రెండు విషాదాల మధ్య విరామం వంటి కొన్ని అంశాలు సినిమాను తన వైపుకు తిప్పుకునే లా చేస్తాయి. అలాగే ఇంగ్లీష్ భాష మీద మోజుతో మాతృభాషను తక్కువ చేసి చూడటం, ఇంట్లో పెద్దలు చాదస్తం పేరుతో తమకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని పిల్లలు భావించడం, డబ్బు విషయానికి వచ్చేసరికి కన్న తల్లితండ్రులను సైతం అనుమానించడంవంటివి నిజమే కదా అనిపిస్తాయి. రంగస్థలంపై నటించిన మనిషి, నిజ జీవితంలో నటించలేక సతమతమయ్యే సన్నివేశాలు, ఆ మనోవేదన మనసుకు హత్తుకుంటుంది. అంతే.

నటీనటుల్లో :

బ్రహ్మానందం చక్రపాణి పాత్రలో అద్బుతమే చేసారు. ఆయన చనిపోయే సన్నివేశం అయితే కన్నీరు పెట్టకుండా ఉండలేము. ఇక ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని సీన్స్ మనసుల్ని హత్తుకుంటాయి.అలాగే కొన్నిసార్లు అతిగాను అనిపిస్తుంది. రమ్యకృష్ణ నటిగా మరోసారి మెప్పిస్తారు. శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, ఆదర్శ్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.

టెక్నికల్ గా :

ఇది రీమేక్ కాబట్టి స్క్రిప్టు గురించి పెద్దగా మాట్లాడేమీ లేదు. ఇక కెమెరా వర్క్, ఎడిటింగ్ , డైరక్షన్ కు తగ్గట్లుగానే సాగాయి. డైలాగులు చాలా బాగున్నాయి.సంగీత దర్శకుడు ఇళయరాజా ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఇలాంటి సబ్జెక్టుకి హెవీ సౌండ్ అక్కర్లేదు. కానీ పాటులు అనుకున్న స్దాయిలో లేవు. ఇక నిర్మాతలు ఖర్చు విషయంలో పెద్దగా రిస్క్ తీసుకోలేదు. వీలైనంత తక్కువలోనే తీశారు కానీ క్వాలిటీ బాగుంది.

చూడచ్చా :

కృష్ణవంశీ సినిమాలు అభిమాని అయితే ఖచ్చితంగా చూడదగ్గ సినిమా

నటీనటులు :

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, సత్యానంద్ తదితరులు

సాంకేతికవర్గం :

మాటలు : ఆకెళ్ళ శివప్రసాద్
ఛాయాగ్రహణం : రాజ్ కె. నల్లి
సంగీతం : ఇళయరాజా
నిర్మాత‌లు : కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం : కృష్ణవంశీ
రన్ టైమ్: 152 నిముషాలు
విడుదల తేదీ : మార్చి 22, 2023