రంగ్ దే చిత్రం మార్చి విడుదల

Published On: January 2, 2021   |   Posted By:

రంగ్ దే చిత్రం మార్చి విడుదల

యూత్ స్టార్ ‘నితిన్, కీర్తి సురేష్‘ ల ‘రంగ్ దే’ చిత్రం మార్చి 26 న విడుదల
‘రంగ్ దే’ ధియేటర్ ల లోనే విడుదల

యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ’ సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ ‘రంగ్ దే’. ‘ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

2021 ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. దీనికి మ్యూజిక్ తో కూడిన  ఓ వీడియో రూపకల్పన చేశారు. ఇందులో  నితిన్, కీర్తిసురేష్ ల నృత్యాభినయం, సంగీతం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 2021 మార్చి 26 న ధియేటర్ ల లోనే చిత్రం విడుదల అవుతుందని తెలిపారు. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీనికి రూపకల్పన చేశారు దర్శకుడు ‘వెంకీ అట్లూరి’.యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుంది. ఇటీవల ‘రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన దృశ్యాలతో కూడిన వీడియో, అలాగే ఓ గీతం బహుళ ప్రేక్షకాదరణ పొందిన విషయం విదితమే.

‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కధా చిత్రం ఈ  ‘రంగ్ దే’. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా  ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్). సమర్పణ:పి.డి.వి.ప్రసాద్. నిర్మాత:సూర్యదేవర నాగవంశీ. రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి