రాజమండ్రి రోజ్ మిల్క్ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల

Published On: May 31, 2022   |   Posted By:

రాజమండ్రి రోజ్ మిల్క్ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల

వేసవికాలం వేడిలో రాజమండ్రి రోజ్ మిల్క్ కూల్ ఫస్ట్‌లుక్!

జై జాస్తి, అనంతిక, జంటగా వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రణీత పట్నాయక్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం రాజమండ్రి రోజ్ మిల్క్.

నాని బండ్రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి ఇంట్రూప్ నిర్మాణ సంస్థ ఈరాజమండ్రి రోజ్ మిల్క్ కూల్ ఫస్ట్‌లుక్ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు.

ఇప్పటి వరకు ఈ చిత్రంలో నటించే నూతన హీరో, హీరోయిన్స్ ప్రచార చిత్రాలను గోప్యంగా వుంచిన చిత్రం బృందం నేడు విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో ఈ చిత్రం హీరో, హీరోయిన్ లను రివీల్ చేసింది.

ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ రోజు సాయంత్రం తన సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. దర్శకుడు నాని చిత్ర విశేషాలను తెలియజేస్తూ పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అందరికి కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ జూన్ 10 నుంచి రెండవ షెడ్యూల్‌ను రాజమ్రండి, వైజాగ్‌లో చిత్రీకరిస్తాం. సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్ డీఓపీ: ముఖేష్.జి, శక్తి అరవింద్, సాహిత్యం: చంద్రబోస్, అనంత్‌శ్రీరామ్, శ్రీమణి