రానా తేజ కాంబినేషన్ లో మరో భారీ చిత్రానికి శ్రీకారం

Published On: May 25, 2023   |   Posted By:

రానా తేజ కాంబినేషన్ లో మరో భారీ చిత్రానికి శ్రీకారం

రానా తేజ కాంబినేషన్ లో మరో భారీ చిత్రానికి శ్రీకారం

హీరో రానా డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో వచ్చిన నేనేరాజు నేనే మంత్రి సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. వీరి కలయికలో రాబోతున్న సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

నేనేరాజు నెనేమంత్రి సినిమాలో రానా చేసిన జోగేంద్ర పాత్రకు మరింత బలంగా ఈ సినిమాలో రానా క్యారెక్టరైజేషన్ ఉండబోతోంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నారు దర్శకుడు తేజ.

నందమూరి బాలకృష్ణ హీరోగా టాప్ హీరో, దేవుడు, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో జంబలకిడి పంబ, రాజేంద్రప్రసాద్ హీరోగా ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ సినిమాలను నిర్మించిన గోపినాథ్ ఆచంట రానా & తేజ కాంబినేషన్ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో మలయాళం స్టార్ హీరో నటించబోతున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.