రావణాసుర మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

Published On: January 27, 2023   |   Posted By:

రావణాసుర మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ, ఆర్ టి టీమ్ వర్క్స్, అభిషేక్ పిక్చర్స్ రావణాసుర ఫస్ట్ గ్లింప్స్ విడుదల

ధమాకా, వాల్తేరు వీరయ్యలో రెండు విభిన్నమైన పాత్రల్లో అలరించిన మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న తన తాజా చిత్రం రావణాసుర లో యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ రవితేజ ఆర్ టి టీమ్‌వర్క్స్, అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో గ్రాండ్‌గా రూపొందుతోంది.

రవితేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మేకర్స్ ఈ చిత్రంలో రవితేజ పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ ని విడుదల చేశారు. రవితేజ డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించారు. లాయర్‌గా పవర్‌ఫుల్‌గా కనిపిస్తూనే మరో గెటప్‌లో స్టైలిష్‌గా ఆకట్టుకున్నారు. రెండు గెటప్‌లలో సిగార్ తాగుతూ కనిపించారు. ఓ అజ్ఞాత వ్యక్తి అమ్మాయిలను చంపడం కూడా వీడియోలో కనిపిస్తుంది. టీజర్ అవుట్ స్టాండింగ్ గా వుంది. రవితేజ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని సూచిస్తోంది.

సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.

సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు.

హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఏప్రిల్ 7, 2023న వేసవిలో రావణాసురు థియేటర్స్ లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం :

రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.

సాంకేతిక విభాగం :

దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాతలు: రవితేజ, అభిషేక్ నామా
బ్యానర్: ఆర్ టి టీమ్‌వర్క్స్, అభిషేక్ పిక్చర్స్
కథ, స్క్రీన్‌ప్లే & డైలాగ్స్ : శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: శ్రీకాంత్