రావ‌ణ లంక చిత్రo ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల

Published On: August 22, 2020   |   Posted By:
 
రావ‌ణ లంక చిత్రo ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల 
 
యాక్ష‌‌న్ థ్రిల్ల‌ర్ “రావ‌ణ లంక” ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల 
 
ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ – సింగ‌ర్ రాహుల్ సిప్లీగంజ్
 
కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై క్రిష్ బండిప‌ల్లి నిర్మాత‌గా బి.ఎన్.ఎస్ రాజు ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ రావ‌ణలంక‌. ఈ సినిమాలో క్రిష్, అశ్విత, త్రిష జంట‌గా న‌టిస్తున్న‌ ఈ సినిమాలో ముర‌ళి శ‌ర్మ‌, దేవ్ గిల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇటీవ‌లే రావ‌ణ‌లంక  బృందం విడుద‌ల చేసిన మోష‌న్ పోస్ట‌ర్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో రావ‌ణ‌లంక టీమ్ తాజాగా ఈ సినిమా అల్బ‌మ్ లో ఉన్న మొద‌టి పాట‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాతో పాటు యూత్ లో ఫుల్ ఫాలోయింగా తెచ్చుకున్న  సుజ‌‌నా తిన్నావారా అనే వాయిస్ మెసేజ్ కీల‌కంగా సాగుతోంది. ఈ పాట‌ను ప్ర‌ముఖ సింగర్, బిగ్ బాస్ సీజ‌న్ 3 విన్న‌ర్ రాహుల్ సిప్లీగంజ్ త‌న‌దైన శైలిలో అల‌పించార‌ని రావ‌ణ లంక టీమ్ చెబుతోంది. ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు రావ‌ణ లంక ఆడియో రైట్స్ ద‌క్కించుకోవ‌డం విశేషం. ఆదిత్య మ్యూజిక్ వారికి చెందిన వివిధ మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా రావ‌ణ‌లంక ఆడియోలోని ఫ‌స్ట్ సింగిల్ విడుదలైంది.