రైఫిల్  మూవీ ఆడియో లాంచ్

Published On: September 26, 2019   |   Posted By:
వి.ఎస్.ఆర్ ప్రొడక్షన్స్ రైఫిల్  మూవీ ఆడియో లాంచ్
 
వి.ఎస్. ఆర్.ప్రొడక్షన్స్ “రైఫిల్ ”  మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమం ఫిల్మ్ చాంబర్ లో జరిగింది.  సుమన్ ముఖ్య  అతిథిగా విచ్చేశారు. భాను చందర్ ప్రధాన పాత్రలో కిరణ్, సిరి చందన కృష్ణన్  హీరో హీరోయిన్ లుగా నటించిన  ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్బంగా సుమన్ మాట్లాడుతూ..
 
అందరికి నమస్కారం, నాకు భాను చందర్ నాకు మద్రాసులో పరిచయం. మేము ఎప్పటినుండో మంచి మిత్రులం. దేవుడిచ్చిన గొప్ప ఫ్రెండ్ భాను. నేను భాను కష్టపడి పైకి వచ్చాము. నిర్మాతను దృష్టిలో పెట్టుకొని సినిమా చేస్తాడు భాను. నాతో సినిమా నిర్మించి నిర్మాత నష్టపోతే నేను చాలా బాధపడతాను. అమ్మ, నాన్న తరువాత నాకు దేవుళ్ళు నా అభిమానులే, వారందరికీ నా పాదాభివందనం. మళ్లీ జన్మంటూ ఉంటే నేను భాను చందర్ ఫ్రెండ్స్ గానే పుట్టాలని కోరుకుంటున్న. సినిమా ఎవ్వరైనా తీస్తారు కానీ ప్రేక్షకులను ఏడ్పించిన వాడే నిజమైన దర్శకుడు. రైఫిల్ చిత్రం పెద్ద విజయం కావాలని కోరుకుందాం అన్నారు.
 
భాను చందర్ మాట్లాడుతూ..
మీడియా మిత్రులకు .నా అభిమానులకు నమస్కారాలు. రైఫిల్ సినిమాలో నాది మిలిటరీ పాత్ర అనగానే వెంటనే ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. నా ఫ్రెండ్ సుమన్ కు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం కలిగి ఉంది, అది తన అదృష్టం. ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసాడు.  నా సినిమాను ప్రమోట్ చెయ్యడానికి వచ్చిన సుమన్ కు ధన్యవాదాలు. దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.
 
హీరోయిన్ సిరి చందన కృష్ణన్ మాట్లాడుతూ..
 
నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి దన్యవాదాలు. సుమన్ గారి సినిమాలు చూసి పెరిగిన నాకు ఆయన పక్కన నిలబడి మాట్లాడే అవకాశం వస్తుందని అనుకోలేదు. భాను చందర్ గారితో నటించడం మర్చిపోలేని అనుభూతి.
 
హీరో కిరణ్ మాట్లాడుతూ..
 
నాకు ఈ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సుమన్ గారు మా సినిమా ఆడియోకు రావడం సంతోషం. షూటింగ్ సమయంలో భాను చందర్ గారు నన్ను ఎంకరేజ్ చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది అన్నారు.
 
నటీనటులు:
భానుచందర్, కిరణ్, సిరి చందన, రేఖ, జయ నాయుడు, మారుతి, చమ్మక్ చంద్ర, వీరభద్రం
 
సాంకేతిక నిపుణులు:
సంగీతం: విజయ సల్వాది
కెమెరా: సుధాకర్ నాయుడు
ఎడిటింగ్: స్వామి చిత్రాల
వి.ఎఫ్.ఎక్స్: ప్రభు రాజ్
పాటలు: సంస్కృతి, శ్రీకాంత్
ఫైట్స్: సిద్ధార్థ రామళ్ల
డాన్స్: వి.ఎస్.వెంకట్, లారెన్స్ ఉపేంద్ర
మాటలు: వెంకట్ రామళ్ల, నాగేశ్వర్ రావ్ గుడిపాటి
సహా నిర్మాత: స్వరూప రాణి
నిర్మాత: అనిల్ కుమార్
కథ- మాటలు- స్క్రీన్ ప్లే – దర్శకత్వం: వెంకట్ రామళ్ల