లావణ్య త్రిపాఠి హ్యాపీ 340

Published On: June 22, 2022   |   Posted By:

లావణ్య త్రిపాఠి హ్యాపీ 340

మత్తు వదలరా చిత్రంతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం హ్యాపీ బర్త్‌డే.

ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. కాగా టీజర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రబృందం.. ఇటీవల చిత్రంలోని పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రచార చిత్రాలను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇందులో భాగంగా మంగళవారం కథానాయిక లావణ్య త్రిపాఠి పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో హ్యాపీ 340 గా లావణ్య కనిపించబోతుంది. ఆమె పాత్ర ఎవ్వరూ ఊహించని విధంగా, పూర్తి వినోదాత్మకంగా వుండబోతుందని చిత్ర బృందం తెలిపింది ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, డిఓపి: సురేష్ సారంగం, ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్, ఫైట్స్: శంకర్ ఉయ్యాల, కాస్ట్యూమ్ డిజైనర్: తేజ్ ఆర్, లైన్ ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాల సుబ్రహ్మణ్యం కేవీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కుమార్ కందుల, మార్కెటింగ్: ఫస్ట్‌షో, పీఆర్‌ఓ: శేఖర్-వంశీ, మడూరి మధు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: రితేష్ రానా.