లాస్ట్ గాడ్ ఫాదర్ సినిమా ప్రారంభo

Published On: September 1, 2020   |   Posted By:

లాస్ట్ గాడ్ ఫాదర్ సినిమా ప్రారంభo

స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన షకలక శంకర్, గాంధీ మోహన్ రెడ్డి కాంబినేషన్ లో “లాస్ట్ గాడ్ ఫాదర్”

చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై షకలక శంకర్ ప్రధాన పాత్రలో, గాంధీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో, వెలం పల్లి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం *లాస్ట్ గాడ్ ఫాదర్*ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నల్లమలుపు బుజ్జి కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. 
 
ముహూర్తపు సన్నివేశానికి వివి వినాయక్ క్లాప్ నివ్వగా, కెమెరా స్విచ్ ఆన్ నిర్మాత మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి ఇచ్చారు.డైరెక్టర్ డాలి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
.ఈ సందర్భంగా షకలక శంకర్ మాట్లాడుతూ: నా కెరీర్ ఈ బ్యానర్ లోనే స్టార్ట్ అయ్యింది. నోట్ బుక్ సినిమాలో నాకు మొదట అవకాశమిచ్చారు ప్రసాద్ గారు. మళ్లీ ఇప్పుడు ఈ బ్యానర్ లో నటిస్తున్నాను వినాయక్ గారు నాసినిమా కి క్లాప్ నిచ్చి ఆశీర్వదించారు. నిజంగా ఈ రోజు నాకు గొప్ప పండుగ రోజు తప్పకుండా ఈ సినిమా నా కెరీర్ లో మంచి సినిమా అవుతుంది అన్నారు 
 
దర్శకుడు మల్లిడి  గాంధీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ: అందరికీ నచ్చే అన్ని అంశాలు కలబోసిన మంచి సబ్జెక్ట్ లాస్ట్ గాడ్ ఫాదర్. షకలక శంకర్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. మిగతా నటీనటులను త్వరలో ఎనౌన్స్ చేస్తాము. సంగీతం సాయికార్తీక్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ గరుడ వేగ అంజి, మాటలు దుర్గా ప్రసాద్. ఇలా అందరూ అత్యుత్తమ టెక్నీషియన్స్ తో నే సినిమా చేస్తున్నాము. ఇంతకు ముందు నేను చేసిన సినిమా విషయంలో వచ్చిన అనుభవాలతో ఈ సినిమాని ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్ది తాను అని అన్నారు 
 
నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ: ఒక మంచి టీమ్ తో మంచి సినిమాను నిర్మిస్తున్నాం.మేము పిలవగానే వచ్చి మా ప్రయత్నాన్ని ఆశీర్వదించిన వి వి వినాయక్ గారు, డాలి గారి కి, నల్లమలుపు బుజ్జి గార్లకు ధన్యవాదాలు అని అన్నారు 
 
షకలక శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గరుడ వేగ అంజి, మ్యూజిక్ : సాయి కార్తీక్, ఎడిటర్: గౌతం రాజు, లిరిసిస్ట్: రెహమాన్, మాటలు: దుర్గ ప్రసాద్ వి వడ్లాని నిర్మాత: ప్రసాద్ వెలంపల్లి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ: మల్లిడి గాంధీ మోహన్ రెడ్డి