లీల చిత్రం ఊర్వశి ఓటిటి ద్వారా విడుదల

Published On: January 12, 2021   |   Posted By:
లీల చిత్రం ఊర్వశి ఓటిటి ద్వారా విడుదల
 
అంతా దైవ ‘లీల’ అంటున్న హారర్ థ్రిల్లర్ ‘లీల’:కథానాయకి స్నేహా గణేష్
     
రాయల్ మూవీ క్రియేషన్స్ పతాకంపై బాల దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ గా ఏ.ఎం.భాషా నిర్మించిన ‘లీల’ ధియేటర్స్ లో విడుదలకు ముందే ‘ఊర్వశి ఓటిటి’ ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. 
     
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన స్నేహా గణేష్… “లీల” చిత్రం తనకు మంచి గుర్తింపునిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ‘లీల’లో నటించే అవకాశం రావడం దైవలీల’గా పేర్కొంది. ఈ చిత్రంలో తాను హీరోయిన్ మాత్రమే కాదని, సినిమాలోనూ సినిమా హీరోయిన్ గా నటించడం భలే గమ్మత్తుగా అనిపించిందని చెప్పింది. ఈ చిత్రం ఈనెల 14న “ఊర్వశి ఓటిటి” ద్వారా విడుదల కానుంది.
   
విజయ్, స్నేహ గిరీష్, సంధ్య  ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ దాసరి, ఎడిటింగ్: ఎం.ఎన్.ఆర్, సంగీతం: శ్రీమిత్ర, నిర్మాత: ఏ.ఎం.భాషా, రచన-దర్శకత్వం: బాల!!