వర్జిన్ స్టోరీ మూవీ రివ్యూ

Published On: February 24, 2022   |   Posted By:

వర్జిన్ స్టోరీ మూవీ రివ్యూ

లగడపాటి ‘వర్జిన్ స్టోరీ’ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👎

యూత్‌ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేయటం కొత్తేమి కాదు. అయితే అందుకు దర్శక,నిర్మాతలు రకరకాల మార్గాలు అనుసరిస్తూంటారు. కొందరు లవ్ స్టోరీలతో సరిపెడితే మరికొందరు ఇదిగో ఇలా అడల్ట్ కథలతో కుదిరేద్దామనుకుంటారు. కుర్రాళ్ళ అంటే కాస్తంత అదేదో ఎక్సెపెక్ట్ చేస్తారని… ‘వర్జిన్ స్టోరీ’ అని టైటిల్ పెట్టి మరీ ఈ  కళాఖండాన్ని రూపొందించారు ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్‌. ఈ చిత్రంలో శ్రీధర్ పుత్రరత్నం ‌ విక్రమ్ సహిదేవ్‌ని హీరోగా పెట్టారు. ఇక హీరోయిన్‌గా సౌమిక పాండియన్‌ను తీసుకున్నారు. ఈ సినిమా ఎలా ఉంది…టార్గెట్ చేసిన యూత్ కు ఈ సినిమా పట్టిందా లేదా..?స్టోరీ లైన్పీ అలియాస్ పియాన్షూ (సౌమిక పాండియన్)ని ఆమె బోయ్ ప్రెండ్ మోసం చేసారు. దాంతో ఆమె రగిలిపోతుంది. అతనికి బుద్ది చెప్పటానికి, తన లవర్ ని మర్చిపోవటానికి ఆమెను వన్ నైట్ స్టాండ్ కు ప్రెండ్ ఒప్పిస్తుంది. దాంతో తనతో వన్ నైట్ గడిపే కుర్రాడు కోసం వెతికితే ఆ రాత్రి  పబ్ లో విక్రమ్ (విక్రమ్ సహిదేవ్) పరిచయం అవుతాడు. అతన్ని చూసి ముచ్చటపడి అతనితో ఆ రాత్రి గడపాలని పీ అనుకుంటుంది. సేమ్ టు సేమ్ విక్రమ్ కూడా తన గర్ల్ ప్రెండ్ అని భావించే అమ్మాయి మోసం చేయటంతో బాధలో ఉంటాడు. దాంతో ఆమెతో ఆ నైట్ స్పెండ్ చేయటానికి ఓకే అంటారు. అలా వీళ్లిద్దరు కలిసి ఆ నైట్ స్పెండ్ చేయటానికి సరైన ప్లేస్ కోసం వెతకటం మొదలెడతారు. ఆ క్రమంలో ఏం జరిగింది…చివరకు ఏమైంది అనేది మిగతా కథ.విశ్లేషణ

లవ్ బ్రేకప్, ఎక్స్ లవర్  ఇవి మన తెలుగు సినిమాల్లో కామనే కానీ,  వన్ నైట్ స్టాండ్ వరకూ ఎవ్వరూ ధైర్యం చేయలేదు. అయితే ఈ దర్శకుడు,నిర్మాత కలిసి చేసారు. అయితే ఆ చేసేది కాస్తంత కన్వీన్స్ అయ్యేలేకపోయారు. స్క్రిప్టు లో సెటప్ లో ఉండదు.క్యారక్టర్స్ లో క్యారక్టరైజేషన్ ఉండదు. ఏదో వచ్చాము వెళ్లాము అన్నట్లు ఉంటాయి పాత్రలు. ఏ పాత్రనీ నిజాయితీ గా డైరక్టర్ తీర్చిదిద్దలేదు. దాంతో కథ చాలా ప్లాట్ గా మారిపోయింది. అలాగే సినిమా అంతా వాళ్లిద్దరూ తాము గడపటానికి ప్లేస్ వెతుక్కోవటంలోనే సరిపోతుంది. ఇలాంటి కథతో గతంలో జంధ్యాల గారు శ్రీవారి శోభనం అనే సినిమా తీసారు. అలాగే హాలీవుడ్ లోనూ ఇలాంటి ఎక్స్ రేటెడ్ సినిమాలకు లోటు లేదు. వాటిన్నటినీ కలిపి రుబ్బేసి…యూత్ కోసం మసాలా అన్నట్లు వడ్డించేసారు. అయితే చూసినోడిదే పాపం అన్నంత దారుణంగా సినిమా తయారైంది. మెయిన్ క్యారక్టర్స్ లో ఎక్కడా ఎమోషన్, ప్రేమ, బ్రేకప్ అయ్యారు   పై కొంచెం కూడా సింపతీ కలగదు. అంత దారుణంగా స్క్రిప్టు రెడీ చేసి తెరకెక్కించారు. ఆ తెరకెక్కిన విధానం కూడా ఏదో చుట్టేసినట్లు ఉంటుంది కానీ ఎక్కడా కన్విక్షన్ తో నడపలేదు.  అయితే ఉన్నంతలో టీనేజర్ల ఆలోచనా విధానాన్ని డైరక్టర్  వివిధ సందర్భాల్లో చాలా చక్కగా చూపించటం బాగుంది. అంతకు మించి ఏమీ లేదు.ఏదైమైనా  స్క్రిప్ట్‌ పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే వర్జిన్ స్టోరీ మంచి సినిమా అయ్యేది.

టెక్నికల్ గా …
పాటలు సోసోగా ఉన్నాయి.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్  బాగుంది. వఅనీష్ తరుణ్ కుమార్ కెమెరా పనితనం జస్ట్ ఓకే.  గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ బాగుంది. లవ్ కు సంబంధించిన కొన్ని డైలాగులు బాగున్నాయి. టెక్నికల్ గా, ఈ చిత్రంకు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కానీ అవేమీ సినిమాకు ప్లస్ కాలేదు.

నటీనటుల గురించి మాట్లాడకోవటానికి ఏమీ లేదు…వాళ్లలో ఎవరికీ నటన రాదనే విషయం తేలిపోయిన సీన్స్ ని చూస్తే అర్దమవుతుంది. ఏదో హాలీవుడ్ డీ గ్రేడ్ సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది.

చూడచ్చా

టైటిల్ చూసి టెమ్ట్ అయితే అంతకు తగ్గ ఫలితం అనుభవించాలి.

ఎవరెవరు…

నటీనటులు: విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండ్యన్, రిషికా ఖన్నా, రఘు కుమార్ కారుమంచి, రాకెట్ రాఘవ, ఆర్.కె. అమ్మ తదితరులు.

దర్శకత్వం : ప్రదీప్ బి.అట్లూరి

నిర్మాతలు: శిరీష లగడపాటి, శ్రీధర్ లగడపాటి

సంగీత దర్శకుడు: అచ్చు రాజమణి

సినిమాటోగ్రఫీ: అనీష్ తరుణ్ కుమార్

ఎడిటర్ : గ్యారీ బి హెచ్

రన్ టైమ్ :2h 19m

విడుదల తేదీ:శుక్రవారం 18, పిభ్రవరి 2022