వాలిమై మూవీ రివ్యూ

Published On: February 24, 2022   |   Posted By:

వాలిమై మూవీ రివ్యూ

అజిత్  ‘వలిమై’ రివ్యూ

👍

ప్రేమలేఖ సినిమా అప్పట్లో సూపర్ హిట్. అజిత్ ని తెలుగు వారికి పరిచయం చేసింది. అప్పటి నుంచీ అజిత్ తెలుగులో తన సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. కానీ కొత్తదనం లేక, ఇక్కడ చెప్పుకోదగ్గ రీతిలో  ఫ్యాన్ ఫాలోయింగ్  లేక అవి భాక్సాఫీస్ దగ్గర బావురుమంటున్నాయి. అయినా అజిత్ దండయాత్ర మానలేదు. తన ప్రతీ సినిమాని ఇక్కడ డబ్బింగ్ చేసి అదే రోజు వదులుతున్నాడు. ఉన్నంతలో బాగానే ప్రమోషన్ చేస్తున్నాడు. అజిత్ వి యాక్షన్ సినిమాలు కావటంతో ఇక్కడ బాగానే రిలీజ్ అవుతున్నాయి. అయితే కాన్సెప్టులు బాగా రొటీన్ గా ఉండటం,యాక్షన్ పై ఆధారపడటంతో అవి ఇక్కడ వర్కవుట్ కావటంలేదు. తాజాగా మరో సారి తన కొత్త చిత్రంతో తెలుగు మార్కెట్ పైకి యుద్దానికి వచ్చాడు. ఈ సారినా అతని   ‘వలిమై’ (బలం) సరిపోతుందా లేదా చూద్దాం.

Storyline:నరేన్‌(కార్తికేయ) టెక్నికల్ ఎక్సపర్ట్. మహా తెలివైనవాడు. అయితే తన తెలివిని వక్రమార్గంలో వాడుతూ.. క్రైమ్స్  చేస్తూంటాడు. వైజాగ్ లో ఉండే యూత్ ని  ‘సైతాన్‌ స్లేవ్స్‌’అనే  పేరుతో డ్రగ్స్‌ బానిసలుగా మార్చేసి, చైన్‌ స్నాచింగ్‌, మర్డర్స్ చేయిస్తూంటాడు.  తన తెలివితో పోలీస్ లను ముప్పు తిప్పలు పెట్టి తప్పించుకుంటూంటాడు. అతన్ని, అతని గ్యాంగ్ అంతు తేల్చటానికి ఏసీపి అర్జున్‌(అజిత్‌) రంగంలోకి దూకుతాడు. నరేన్ ని పట్టుకోవటానికి ఓప్లాన్ చేస్తాడు. కానీ రివర్స్ లో అర్జున్ నే అతను ఇరికిస్తాడు. అక్కడ నుంచి ఇధ్దరి మధ్యా వార్ మొదలవుతుంది. చివరకు అర్జున్ …నరేన్ ని ఎలా పట్టుకున్నాడు. సైతాన్ గ్యాంగ్ ఏర్పాటు చేయటం వెనక నరేన్ ఉద్దేశ్యం ఏమిటి…చివరకు‘సైతాన్‌ స్లేవ్స్‌’ఏమైంది?అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Screenplay Analysis:

అప్పట్లో వచ్చిన జాకీ ఛాన్ New Police Story చూసిన  వాళ్లకు ఇదేమీ కొత్తగా అనిపించదు. అదే స్టోరీ లైన్ కు తమదైన యాక్షన్ ని కలిపి ఈ సినిమా కథ చేసుకున్నారు. రెండు స్ట్రాంగ్ క్యారక్టర్స్, కథకు తగ్గ ప్రిమైజ్ చేసారు కానీ అందులో కూర్చునే సరైన కథను డవలప్ చేయలేకపోయారు. ఎంతసేపూ హీరోని లేపటానికే తన స్క్రీన్ టైమ్, స్కిల్ ని వాడాడు దర్శకుడు. ఈ కథకు తీసుకున్న ప్రిమైజ్,థీమ్…ఈజీగా మార్కెట్ అయ్యేదే. విజువల్ గా గ్రాండియర్ గా తెరపై కనపించేదే. అయితే స్టోరీ లాజికల్ గా లేకపోవటం, కథలో బిల్డ్ అవ్వాల్సిన డ్రామా రాకపోవటం..విసుగించే తల్లి సెంటిమెంట్ కథనాన్ని దెబ్బ కొట్టాయి. ఎంతసేపూ అజిత్ ఇంట్రో సీన్స్ వేయటం..మాటి మాటికి భారీ యాక్షన్‌ సీన్స్‌ని, బైక్‌ రేసింగ్‌ ని చూపించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమాకు ప్రధాన బలం అజిత్‌…అయితే అదే బలహీనతగా మారింది.  కార్తికేయ, అజిత్ మధ్య వచ్చే బైక్‌ ఛేజ్‌ సీన్స్‌, యాక్షన్‌ సన్నివేశాలు హాలీవుడ్ స్దాయిలో ఉన్నాయి . అయితే ఎమోషన్స్ ఉండవు. అడుగడుక్కీ వచ్చి పోతూంటాయి. యాక్షన్‌ స్టంట్స్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయో లేవో కానీ విసిగిస్తాయి. అయితే సినిమాలో కొత్తదనం ఉండి, మూడు గంటలు లెంగ్త్ ఉండకుండా ఉంటే కొంతలో కొంత భరించగలిగేవాళ్లం. ఇక క్లైమాక్స్ అయితే దారుణం   ఓ పాడుబడ్డ ఫ్యాక్టరీలో హీరో ఫ్యామిలీని విలన్‌ కిడ్నాప్ చేసి బంధించి ఉంచడం.. హీరో వచ్చి ఫైట్‌ చేసి వారిని విడిపించడం.. ఇలాంటి సీన్స్ ఎంత గొప్పగా తీసినా కంటెంట్ నాశిగా ఉండటంతో తేలిపోయింది.

Analysis of its technical content

డైరక్టర్ గా హెచ్ వినోద్ మంచి స్టఫ్ ఉన్నోడే. ఫామ్ లో ఉన్నవాడే. గతంలో అతను తీసిన సతురంగ వేట్టై, తీరం అధిగారం ఒండ్రు (తెలుగులో ఖాకీ), అజిత్ తో తీసిన నేర్వొండ పార్వాయ్ బాగా ఆడాయి. దాంతో ఈ సినిమాని కూడా అదే స్దాయిలో ఆశిస్తాము. కాకపోతే ఆ స్దాయి పనితనం కనపడలేదు. అజిత్ ని మాస్ గా చూపెట్టాలనే మోహంలో తన  బలాలు తనే మర్చిపోయాడు. ఎమోషనల్ సీన్స్ కు ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి జనాల మూడ్ పాడు చేసాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. యువన్ శంకర్ రాజా అందించిన BGM సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా ఈ సినిమాని నెక్ట్స్ లెవిల్ కి తీసుకెళ్ళాడు. ఎడిటింగ్ జస్ట్ ఓకే.

నటీనటుల్లో…

అజిత్‌ మంచి బైక్‌ రేసర్‌ కావడంతో యాక్షన్స్‌ సీన్స్‌ మామూలుగా లేవు. ప్రీ ఇంటర్వెల్‌   యాక్షన్‌ సీన్స్‌లో అయితే కేక.  కార్తికేయ.. విలన్‌గా  అజిత్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. నార్కొటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ హెడ్‌ సోఫియా పాత్రలో హ్యుమా ఖురేషి పాత్రోచితం అనిపించింది.

చూడచ్చా

అజిత్ వీరాభిమానులు, యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు బాగా నచ్చుతుంది.

ఎవరెవరు..
నటీనటులు: అజిత్, కార్తికేయ గుమ్మకొండ, హ్యూమా ఖురేషి తదితరులు
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
నేపథ్య సంగీతం: జిబ్రాన్
స్వరాలు: యువన్ శంకర్ రాజా
నిర్మాత: బోనీ కపూర్
దర్శకత్వం: హెచ్. వినోద్
తెలుగులో విడుదల: ఐవీవై ప్రొడ‌క్ష‌న్స్ (గోపీచంద్ ఇనుమూరి)
Runtime: 2 గంటల 55 నిముషాలు
విడుదల తేదీ: ఫిబ్రవరి 24, 2022