విక్టర్ ది నెక్స్ట్ గాడ్ మూవీ టైటిల్ లోగో విడుదల

Published On: December 21, 2023   |   Posted By:

విక్టర్ ది నెక్స్ట్ గాడ్ మూవీ టైటిల్ లోగో విడుదల

సీనియర్ నటుడు సుమన్ చే విక్టర్ ది నెక్స్ట్ గాడ్ టైటిల్ లోగో లాంచ్

అమేజింగ్ గ్లోబల్ మూవీ మేకర్స్ పతాకంపై విక్టర్ ది నెక్స్ట్ గాడ్ టైటిల్ లోగో లాంచ్ కార్యక్రమం గురువారం ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్సటైల్ సీనియర్ నటుడు సుమన్ విచ్చేసి విక్టర్ ది నెక్స్ట్ గాడ్ మూవీ టైటిల్ ను లాంచ్ చేసారు.

డైరెక్టర్ ప్రీతమ్ మాట్లాడుతూ. ఇదొక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ప్రపంచం లోనే మొదటి స్థానం లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. 4.కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రానుంది.

7. కంట్రీ లో షూట్ జరగనుంది. అన్నీ కంట్రీ నటులను కలుపు కొని దాదాపు 200. మందిని ఈ సినిమాలో తీసుకోవ డం జరుగుతోంది. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.

ప్రొడ్యూసర్ వడ్లపట్ల చౌదరి మాట్లాడుతూ
ప్రీతమ్ ను నేనే ఇంట్రడ్యూస్ చేశా సింగిల్ లైన్ స్టోరీ నచ్చి చాలా మంది రియల్టర్స్ సపోర్టుగా వచ్చి సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాతో ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు
ప్రీతమ్ అని తెలిపారు.

లయన్ వెంకట్ మాట్లాడుతూ ఎంతో సీనియర్ నటుడైనా ఇలా ప్రమోషన్స్ లో పాల్గొనడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. యంగ్ స్టర్స్ ఇండస్ట్రీ కు రావాల్సిన అవసరం ఉంది. కొత్తదనం తో కలిపిన మంచి సబ్జెక్ట్ ఉంటే డెఫినెట్ గా ఆదరిస్తారని అన్నారు.

చిగోటి ప్రవీణ్ మాట్లాడుతూ విక్టర్ అనే టైటిల్ లోనే ఉంది కనుక విక్టర్ కొట్టాలని ఆశిస్తున్నా అలాగే చిన్న సినిమాలకు కావాల్సిన సహాయ సహకారాలు నా వంతుగా చేస్తానని మాటిస్తూ అలాగే నా ఫార్మ్ హౌజ్ ను ఉచితంగా షూటింగ్ కోసం కూడా ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నానని తెలియ చేస్తున్నా అన్నారు.

వేణుగోపాలా చారి మాట్లాడుతూ ప్రీతమ్ విక్టర్ అనే టైటిల్ ను పెట్టుకొని ముందుకొస్తున్నారు పాన్ ఇండియా లెవెల్ లో విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

నటుడు సుమన్ మాట్లాడుతూ. మీ అందరి సహకారం తోనే 40.ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండగలిగాను ఇక ఈ సినిమా ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే హిట్ అయితే పెద్ద సినిమా .ఫట్ అయితే చిన్న సినిమా అంతే కానీ పెద్ద చిన్న సినిమాలనేవి ఉండవు. ఈ సినిమాలో 200 మందికి అవకాశం ఉందన్నారు. చాలా సంతోషం. నూతన టెక్నీషియన్స్ కు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నా సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని మరిన్ని సినిమాలు ఈ కాంబినేషన్ లో రావాలని నా విషెస్ తెలియచేస్తున్నా అన్నారు.

ముఖ్య అతిథి సుమన్, వేణుగోపాలాచారి, పద్మిని నాగుల పల్లి, అనిత, లయన్ సాయి వెంకట్, ప్రియాంక గోయల్, చిగోటి ప్రవీణ్, మా మెంబర్ మాణిక్ తేజ, ప్రొడ్యూసర్ డా. విశ్వనాథ్, ఎన్ ఆర్ ఐ గ్రూప్ ఆఫ్ నంద, భవాని , చలపతి, తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక వర్గం :

డి ఓ పి: జాకీ
మ్యూజిక్: రమేష్ ముక్కెర
సినిమాటోగ్రఫీ: రవి
ఎక్జిక్యూటి ప్రొడ్యూసర్: బి. ఏ వర్మ