విక్రమ్ చిత్రం  మొదటి  పాట విడుదల

Published On: January 2, 2021   |   Posted By:
విక్రమ్ చిత్రం  మొదటి  పాట విడుదల 
 
కోటి  చేతులమీదుగా  ‘విక్రమ్’  చిత్రం  మొదటి  పాట విడుదల 
 
నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ ‘విక్రమ్’ పేరుతో ఓ ప్రేమ కధా చిత్రాన్ని నిర్మిస్తోంది. హరిచందన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగవర్మ నిర్మిస్తున్నారు. హీరో నాగవర్మ సరసన దివ్యా రావు కథానాయికగా నటించింది.
 
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
 
కాగా ఈ చిత్రంలోని  “చుక్కలాంటి అమ్మాయి…” అంటూ  సాగే మొదటి పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి  హైదరాబాద్ లో  విడుదల చేశారు. .ఈ పాటను పృథ్వి చంద్ర ఆలపించగా సురేష్ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. సత్య మాస్టర్ నృత్యరీతులను సమకూర్చారు. 
 
పాటను విడుదల చేసిన అనంతరం కోటి  మాట్లాడుతూ, “ఈ చిత్రంలోని పాటలన్నీ నేను విన్నాను. చాలా బావున్నాయి. అలాగే చిత్రకథ కూడా ఎంతో బాగా ఆకట్టుకుంది. నేటి  యువతరం ఆలోచనా విధానానికి దగ్గరగా ఉంటుంది. హీరో నాగవర్మ ఈ చిత్రానికి నిర్మాత కూడా కావడాన్ని బట్టి ఆయన అభిరుచి ఏంటో అర్ధమవుతోంది. నా ప్రియ శిష్యుడు సురేష్ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది” అని అన్నారు. 
 
హీరో, నిర్మాత నాగవర్మ మాట్లాడుతూ “మా అభిమాన సంగీత దర్శకుడు కోటి చేతులమీదుగా మొదటి లిరికల్ సాంగ్ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఇక ఈ చిత్ర కద విషయానికి వస్తే ఓ సినిమా రైటర్ అన్నీ తననే నమ్మి తనతో ప్రేమలో పడితే తను మాట మార్చగా సమాజంలోని కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వస్తే వాళ్లకి కలిసే ఒక అవకాశం వస్తే ఎలా ఉంటుందనేది ప్రధాన ఇతివృత్తం. చిత్రం కమర్షియల్ హంగులతో చాలా బాగా వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం” అని చెప్పారు. 
 
దర్శకుడు హరిచందన్  మాట్లాడుతూ, “లవ్ థ్రిల్లర్ చిత్రమిది. ఓ సినిమా రచయిత ప్రేమకధ ఇది. తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ రచయిత ఏమి చేశాడన్నది ఆసక్తికరంగా చెప్పాం. ప్రేమకథా చిత్రాల్లో విభిన్నంగా ఉంటుంది”అని తెలిపారు.
 
నాగవర్మ, దివ్యా రావు జంటగా నటించిన ఈ చిత్రంలో   ఆదిత్య ఓం, పృథ్వి రాజ్, సురేష్, చలపతిరాజు, ఖయ్యుమ్, సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్, టార్జాన్, ఫిష్ వెంకట్, చిత్రం బాష, భూపాల్ రాజు, డాన్స్ సత్య, జయవాణి తదితరులు ఇతర ముఖ్యతారాగణం.
 
ఈ చిత్రానికి సంగీతం: సురేష్ ప్రసాద్, ఛాయాగ్రహణం: వేణు మురళీధర్, ఫైట్స్: శివప్రేమ్, ఎడిటర్ మేనగ శ్రీను, నిర్మాత: నాగవర్మ, దర్శకత్వం హరిచందన్.