వీరసింహారెడ్డి మూవీ జనవరి 12న రిలీజ్

Published On: January 9, 2023   |   Posted By:

వీరసింహారెడ్డి మూవీ జనవరి 12న రిలీజ్

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి కి యూ/ఎ సర్టిఫికేట్ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వీరసింహారెడ్డి . ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి టీజర్, ట్రైలర్ సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వీరసింహారెడ్డి తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది.

బాలకృష్ణ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, గోపీచంద్ మలినేని టేకింగ్, సాయి మాధవ్ బుర్రా రాసిన ఇంటెన్స్ డైలాగ్స్, చార్ట్బస్టర్ ఆల్బమ్, ఎస్ థమన్ స్కోర్ చేసిన బీజియం, హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్, సెకండాఫ్లోని ఎమోషనల్ పార్ట్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. అన్ని హంగులతో పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీతో వస్తున్నందుకు సెన్సార్ అధికారులు కూడా టీమ్ని అభినందించారు.

బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చంద్రిక రవి ప్రత్యేక పాటలో సందడి చేయగా, హనీ రోజ్ కీలక పాత్ర పోషించింది.

సంక్రాంతి కానుకగా జనవరి 12న వీరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతుంది.

నటీనటులు :

నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్)

సాంకేతిక విభాగం :

కథ, స్క్రీన్ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: థమన్
డివోపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి