శేఖర్ మూవీ రివ్యూ

Published On: May 20, 2022   |   Posted By:

శేఖర్ మూవీ రివ్యూ

Shekar:రాజశేఖర్ ‘శేఖర్’ రివ్యూ & రేటింగ్

Emotional Engagement Emoji (EEE)

👍

ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ గా వెలిగిన రాజశేఖర్ కు గత కొంతకాలంగా హిట్ అనేది లేదు. ఏదో ‘PSV గరుడవేగ’ కాస్త లేపింది కానీ మళ్లీ ఆ ఊసే లేదన్నట్లు అయ్యింది. దాంతో తను థ్రిల్లర్ సినిమాలకే పనికొస్తాను అనుకున్నారో ఏమో కానీ అటువంటి సినిమాలకే మ్రొగ్గుచూపుతున్నాడు. దానికి తోడు రాజశేఖర్ కు రీమేక్ లు అంటే మోజు. ఆ క్రమంలో మళయాళంలో వర్కవుట్ అయిన జోసెఫ్ ని తెలుగులోకి తెచ్చారు. అయితే మళయాళ సినిమాలు ఓటిటిలో చూడటానికి అలవాటు పడిన జనం ఈ సినిమాని థియోటర్ లో చూస్తారా…ఏమో…అసలు ఈ చిత్రం కథేంటో చూద్దాం.

Story line:

శేఖ‌ర్ (రాజ‌శేఖ‌ర్‌) రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్. మర్డర్ కేసుల్లో కేవలం క్రైమ్ సీన్‌ను చూసి.. క్రిమిమల్ ఎవరో ఇట్టే క‌నిపెట్ట‌ేయగలగటంలో అతను మాస్టర్. అలాంటి శేఖర్ కు తన జీవితంలో తన భార్య ఇందు (ఆత్మీయ రాజ‌న్‌), కూతురు గీత (శివానీ) కేసులే డీల్ చేయాల్సిన పరిస్దితి వస్తుంది. అందుకు కారణం వారిద్దరూ వేర్వేరు యాక్సిడెంట్స్ లో మరణించటం. అందరూ అవి యాక్సిడెంట్సే అనుకుంటారు. అయితే అవి మర్డర్స్ అని అర్దం చేసుకుంటాడు. కానీ నిరూపించటానికి సరైన ఆధారాలు లేవు. దాంతో ఆ కేసుని మెల్లిగా తవ్వటం మొదలెడతాడు. ఆ క్రమంలో భయంకరమైన నిజాలు కొన్ని బయిటపడతాయి. ఈ కేసులో వెనుక పెద్ద మెడికల్ మాఫియానే రన్ అవుతోందని అర్దం చేసుకుంటాడు. బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తుల అవ‌య‌వాల‌ను.. జీవ‌న్‌దాన్ వ్య‌వ‌స్థ ద్వారా వైద్య రంగంలోకి కొంద‌రు వ్య‌క్తులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అర్దం చేసుకుంటాడు. దాంతో ఆ కేసుని డీల్ చేయటం కోసం తానే మాఫియా పర్శన్స్ కు తనను తానే ఎరగా వేసుకుని, టార్గెట్ గా మారతాడు. ఈ క్రమంలో ఏం జరిగింది. శేఖర్ ఆ మాఫియా ని ఛేదించగలిగారా వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Screenplay Analysis:

మళయాలంలో చాలా సహజమైన సన్నివేశాలతో ఓ థ్రిల్లర్ గా రూపొందించారు. చివరి ఇరవై నిముషాల జనాలకు బాగా పట్టి పెద్ద హిట్టైంది. తెలుగుకు వచ్చేసరికి యాజటీజ్ మళయాళ కథ,కథనం ఫాలో అయ్యిపోయారు. ఏవో కొద్ది పాటి మార్పులు తప్పిస్తే సినిమా యాజటీజ్ దింపేసారు. అయితే మళయాళ జనాలకు స్లోగా సాగే థ్రిల్లర్స్ అలవాటే కాబట్టి ఈ సినిమా వర్కవుట్ అయ్యిపోయింది. తెలుగుకు వచ్చేసరికి అదే పెద్ద అడ్డంకిగా మారింది. ఫస్టాఫ్ చాలా దారుణంగా పరీక్ష పెడుతుంది. టీవి సీరియల్ కన్నా దారుణంగా స్లో గా నడుస్తుంది. పెద్దగా సంఘటనలు కథలో జరగవు. కేవలం శేఖర్ కు తన మాజీ భార్యతో, తన కుమార్తెతో ఉన్న రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేస్తాడు అంతే. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. దాంతో అప్పటిదాకా ఏమీ జరిగినట్లు అనిపించదు. అయితే సెకండాఫ్ ఇన్విస్టిగేషన్, శేఖర్ తీసుకునే స్టెప్స్, క్లైమాక్స్ ట్విస్ట్ ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాయి. అదే సినిమాని ఉన్నంతలో చూడగలిగేలా చేసింది. కొన్ని ఇంట్రస్టింగ్ క్యారక్టర్స్, ట్విస్ట్ లు సినిమాపై ఆసక్తి కలగచేసాయి. మళయాళంలో కథ,కథనం కన్నా జోసెఫ్ గా చేసిన జోజూ జార్జి చేసిన నటన చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. బేసిక్ ప్లాట్ జెన్యూన్ గా ఉండటంతో అక్కడ బాగా వర్కవుట్ అయ్యింది. తెలుగులో ఆ మ్యాజిక్ మిస్సైంది. సినిమా డల్లైంది.

Analysis of its technical content:

చెప్పుకోదగిన టెక్నికల్ స్టాండర్డ్స్ ఈ సినిమాలో లేవు. పాటలు జస్ట్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కష్టమే. అనూప్ థీమ్ మ్యూజిక్ బాగుంది. డైరక్టర్ గా…ఒరిజనల్ లోని సీన్స్ ని షాట్ డివిజ‌న్ తో స‌హా.. ఫాలో అయిపోయారు జీవిత‌. స్క్రీన్ ప్లే లోనూ పెద్ద‌గా మార్పులూ చేర్పులూ చేయలేదు.

నటినటుల్లో … శేఖర్ పాత్రలో రాజశేఖర్ బాగాసెటిల్డ్ గా చేసారు. ఆయన సరసన నటించిన ఇద్దరూ ఆయనకంటే ముదర్లులాగ కనిపించారు. శివానీ రాజశేఖర్‌ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. ముస్కాన్ కుబ్చంధాని, అభినవ్ గోమతం, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవివర్మ, శ్రవణ్ రాఘవేంద్ర ఇలా ఎవరికి వారు తమ పరిధిమేరకు బాగానే నటించారు.

బాగున్నవి:

రాజ‌శేఖ‌ర్ డిఫెరెంట్ లుక్
క్లైమాక్స్

బాగోలేనివి:
మళయాళంని యాజటీజ్ ఫాలో అవటం
ఫస్టాఫ్ సీన్స్
స్లో న‌రేష‌న్

CONCLUSION:
అంత అర్జెంట్ గా చూడాల్సిన సినిమా కాదు..ఓటిటిలో వచ్చేదాకే వెయిట్ చెయ్యచ్చు అనిపిస్తుంది.

Movie Cast & Crew

సినిమా: శేఖర్‌ నటీనటులు: రాజశేఖర్‌, ఆత్మీయ రాజన్‌, ముస్కాన్‌, శివానీ రాజశేఖర్‌, సమీర్‌, కిశోర్‌, ప్రకాష్‌రాజ్‌, అభినవ్‌ గోమటం, తుమ్మల ప్రసన్నకుమార్‌, కవిత తదితరులు దర్శకత్వం: జీవితా రాజశేఖర్‌
నిర్మాత: బీరం సుధాకర రెడ్డి
సమర్పణ: వంకాయలపాటి మురళీకృష్ణ
మాటలు: లక్ష్మీభూపాల
ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్‌
సంగీతం: అనూప్‌ రూబెన్స్
రన్ టైమ్: 2 గంటల పది నిముషాలు
విడుదల: 20.05.2022