ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్

Published On: March 12, 2024   |   Posted By:

ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా జరిగిన “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” ప్రీ రిలీజ్ ఈవెంట్

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. “షరతులు వర్తిస్తాయి” సినిమా ఈ నెల 15న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హీరో ప్రియదర్శి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ – కామన్ మ్యాన్ కథతో సినిమా చేస్తే కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అసంతృప్తి పడేవాళ్లు, అడ్డంపడే వాళ్లు,  వీపు మీద, కడుపు మీద కొట్టేవాళ్లు ఉంటారు. అలాంటి వాళ్లందరూ బాగుండాలని కోరుకుంటున్నా. కరీంనగర్ నేపథ్యంగా సినిమా చేసేందుకు అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అడిషినల్ కలెక్టర్ శ్యామ్ లాల్ సార్ కు, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ నగునూరి శేఖర్ సార్ కు పాదాభివందనాలు. వాళ్ల సపోర్ట్ లేకుంటే నేను కరీంనగర్ లో సినిమా చేయడం సాధ్యమయ్యేది కాదు. మమ్మల్ని వెంటే ఉండి నడిపించిన మామిడి హరికృష్ణ గారికి, మధుర శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. సమాజంలో నీ చుట్టూ తెలివైన వారంటున్నారు జాగ్రత్తగా ఉండమని చెప్పిన మా నాన్న, ఏ పని చేసినా రీతి రివాజు, వాయి వరసలు ఉండాలని చెప్పిన మా అమ్మ, చిన్నూ నువ్వు సినిమాలు తీస్తే నా ట్యూషన్ కు వచ్చే చిన్న పిల్లలు కూడా చూడాలని చెప్పిన నాకు మరో అమ్మ లాంటి భాగ్యవ్వ , సినిమా అంటే పెద్ద మాధ్యమం, కళాత్మకమైంది, వ్యాపారంతో కూడుకున్నది, బాధ్యతతో చేయాల్సిందని నన్ను నమ్మే ఓ వ్యక్తి ..వీళ్లు నలుగురు చెప్పిన మాటలను పాటిస్తూ షరతులు వర్తిస్తాయి సినిమాను రూపొందించాను. మంచి సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రూవ్ అయ్యింది. మాకు ఈ సినిమా విషయంలో అదే నమ్మకం ఉంది. ఈ నెల 15న థియేటర్స్ కు వెళ్లి షరతులు వర్తిస్తాయి చూడండి, మీ డబ్బులు, టైమ్ వృథా కావు. అన్నారు.

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ – ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చాం. ఆ క్రమంలో మాకు మామిడి హరికృష్ణ గారు, మధుర శ్రీధర్ రెడ్డి గారు చాలా సపోర్ట్ చేసి అండగా నిలబడ్డారు. యంగ్ టాలెంట్, గుడ్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ మధుర శ్రీధర్ రెడ్డి గారు. వేణు ఊడుగుల అన్న కూడా మాకెంతో సపోర్టివ్ గా ఉంటున్నారు. ఇవాళ మా కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చాడు నా ఫ్రెండ్ ప్రియదర్శి. ఒక మంచి సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన ప్రియదర్శికి థ్యాంక్స్ చెబుతున్నా. మంచి సినిమా చేశామని మేము చెప్పడం కాదు మీరు ప్రూవ్ చేయాలి. ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ ఆడియెన్స్ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు. మంచి సినిమాను ఎంకరేజ్ చేయండి. ఇది మా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఇలాంటి మంచి సినిమాను  నాకు ఇచ్చిన దర్శకుడు కుమారస్వామికి రుణపడి ఉంటాను. నా క్యారెక్టర్ కు చిరంజీవి అనే పేరు పెట్టినప్పటి నుంచి భయమూ భక్తితో నటించాను. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్. ఈ నెల 15 షరతులు వర్తిస్తాయి థియేటర్స్ లో కలుద్దాం.  అన్నారు.

దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ – దర్శకుడు కుమారస్వామి నాకు పదేళ్లుగా తెలుసు. సెలయేరులా స్వచ్ఛమైన వ్యక్తిత్వం కలవాడు. మనల్ని చైనా వాడో, పాకిస్థాన్ వాడో మోసం చేయలేదు. మనం నమ్మిన స్నేహితులే మోసం చేశారని ఓ డైలాగ్ ఈ సినిమాలో ఉంది. ఇలా..మన జీవితాల్లో జరిగే ఘటనల నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించాడు. ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడ ఉన్నా వారి జీవితంలో జరిగిన సందర్భాలను ఈ కథతో రిలేట్ చేసుకుంటారు. ఇలాంటి మంచి సినిమాకు ఆదరణ దక్కాలి. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ కుదిరింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ చిత్రంలో నటించిన వారంతా నాకు బాగా తెలిసినవాళ్లు. షరతులు వర్తిస్తాయి లాంటి సినిమా చేసేందుకు ముందుకొచ్చిన నిర్మాతలకు కూడా అభినందనలు చెప్పాలి. ఈ చిత్రానికి మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్టర్ ప్రియదర్శి మాట్లాడుతూ – చైతన్య నాకు మంచి ఫ్రెండ్. కీడా కోలా లాంటి మూవీస్ చేస్తూ సాటి నటుడిగా ఈర్ష్య పడేలా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ప్రయోగాలన్నీ మధ్య తరగతి వారిపైనే జరుగుతుంటాయని, అయితే మంచి ఫలితాలు కూడా మధ్య తరగతి నుంచే వస్తాయి. దానికి నిదర్శనమే మీరంతా. మనం ఇవాళ తెరపై చాలా సూపర్ హీరోస్ ను చూస్తున్నాం. ఈ సినిమాలో ఓ మిడిల్ క్లాస్ వారియర్ చేసే పోరాటాన్ని చూపిస్తున్నారు. ఇలాంటి మంచి కథను రాసిన కుమార స్వామి అన్నకి థ్యాంక్స్. ఇవాళ ఆయన స్పీచ్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్స్ కు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నా. ఈ నెల 15న థియేటర్స్ లో షరతులు వర్తిస్తాయి చూడండి. మన గురించి చెప్పే మన సినిమాలను సపోర్ట్ చేయండి. అన్నారు.

హీరోయిన్ భూమి శెట్టి మాట్లాడుతూ – మా మూవీకి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరికీ థ్యాంక్స్. నాకు ఇలాంటి మంచి మూవీలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కుమారస్వామి గారికి కృతజ్ఞతలు. ఫాంటసీ మూవీ కాదు ఇది. మన జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. టాలీవుడ్ లో నేను ఈ మూవీతో అడుగుపెడుతున్నా. ఈ సినిమాకు విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

నిర్మాత డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు మాట్లాడుతూ – షరతులు వర్తిస్తాయి సినిమాతో మా టీమ్ అంతా ఒక మంచి ప్రయత్నం చేశాం. ఇలాంటి సినిమా నిర్మించినందుకు గర్వపడుతున్నాం. నాతో పాటు ప్రొడక్షన్ లో భాగమైన ప్రొడ్యూసర్స్ నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా గారికి కంగ్రాట్స్ చెబుతున్నా. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ మోడరన్ చాణక్యలా ఉంటుంది. చాణక్యుడిని, చంద్రగుప్తుడిని కలిపితే ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్ చైతన్య రావ్ చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంటుంది. షరతులు వర్తిస్తాయి ఇంత బాగా వచ్చేందుకు ప్రతి ఒక్క టీమ్ సభ్యుడు కష్టపడ్డారు. వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – షరతులు వర్తిస్తాయి సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ నాకు బాగా నచ్చాయి. ఈ కంటెంట్ చూస్తుంటే సినిమాను నిజాయితీగా తెరకెక్కించారని తెలుస్తోంది. చైతన్య, భూమి శెట్టి, అక్షర కుమార్ మిగతా టీమ్ అందరికీ అల్ ద బెస్ట్ చెబుతున్నా. ఈ నెల 15న షరతులు వర్తిస్తాయి చూసి ఆదరించండి. అన్నారు.

సినిమాటోగ్రఫీ శేఖర్ పోచంపల్లి మాట్లాడుతూ – షరతులు వర్తిస్తాయి సినిమాను కరీంనగర్ లో షూట్ చేశాం. సినిమా విజువల్ గా చాలా బాగా వచ్చింది. మా టీమ్ అంతా మంచి సపోర్ట్ ఇచ్చారు. మా సినిమాను మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ చిలువేరు మాట్లాడుతూ – డైరెక్టర్ అక్షర కుమార్ వల్లే ఈ ప్రాజెక్ట్ లోకి నేను వచ్చాను. గోరటి వెంకన్న లాంటి గొప్ప రైటర్ నా ట్యూన్ కు లిరిక్స్ ఇచ్చారు. నా ఫ్రెండ్ రామ్ మిర్యాల ఓ సాంగ్ పాడారు. పాటలు బాగా వచ్చాయన్న గుర్తింపు దక్కింది. ఈ క్రెడిట్ నా రైటర్స్, నా సింగర్స్ కు ఇస్తాను. మ్యూజిక్ లాగే షరతులు వర్తిస్తాయి సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ డైరెక్టర్ – గాంధీ నడికుడికర్
ఎడిటింగ్ – సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్
సినిమాటోగ్రఫీ – ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – ప్రిన్స్ హెన్రీ
మ్యూజిక్ – అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల)
డైలాగ్స్ – పెద్దింటి అశోక్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – రాజేశ్ స్వర్ణ, సంపత్ భీమారి, అశ్వత్థామ
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
బ్యానర్ – స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రొడ్యూసర్స్ – శ్రీలత, నాగార్జున సామల, శారద, శ్రీష్ కుమార్ గుండా, విజయ, డా.కృష్ణకాంత్ చిత్తజల్లు
రచన దర్శకత్వం – కుమారస్వామి (అక్షర)