సత్యమేవ జయతే 2(హిందీ) మూవీ రివ్యూ

Published On: November 29, 2021   |   Posted By:

 

 

సత్యమేవ జయతే 2(హిందీ) మూవీ రివ్యూ 

జాన్ అబ్రహం ‘ సత్యమేవ జయతే 2’ రివ్యూ  (హిందీ)  

Emotional Engagement Emoji (EEE) 

 
👎  

 

బాలీవుడ్‌ యాక్షన్‌  హీరో జాన్‌ అబ్రహం తన కొత్త చిత్రం ‘సత్యమేవ జయతే-2’లో మూడు పాత్రల్లో కనిపించారు. 2018లో వచ్చిన ‘సత్యమేవ జయతే’ చిత్రానికి కొనసాగింపు వస్తున్న చిత్రమే ఇది.. మిలాప్‌ జవేరి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై బాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది.  అలాగే  ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కాబట్టి హిట్ అవుతుందనే చాలా మంది నమ్మారు. వారి నమ్మకాలు,ఆశలు ఎంతవరకూ ఈ సినిమా రీచ్ అయ్యింది. ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద అద్భుతం చేస్తుందా.  ఈ సత్యమేవ జయతే సీక్వెల్ అందుకు తగ్గట్టు ఉందో లేదో రివ్యూ లో చూద్దాం

స్టోరీ లైన్

దాదాసాహెబ్ బలరాం అజాద్ (జాన్ అబ్రహం) కు ఇద్దరు కొడుకులు (వాళ్లు జాన్ అబ్రహంలే..అంటే ట్రిపుల్ రోల్ అన్నమాట). ఒకడు హోమ్ మినిస్టర్ సత్య కాగా మరొకడు ఏసీపి జయ్ అవుతాడు. ఈ కొడుకులిద్దరూ రైతు అయిన తమ తండ్రికి జరిగిన అన్యాయానికి, దేశంలో ఉన్న అవినీతి,అక్రమాలకి వ్యతిరేకంగా పోరాటం మొదలెడతారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక పిల్లలు చనిపోవడం, ఫ్లై ఓవర్ కూలిపోయి అమ్మాయి మరణించడం, ఒక రాజకీయనాయకుడి కొడుకు యువతిని మానభంగం చేయడం,నిర్బయ కేసు, రైతు సమస్యలు దాకా ఏకరవు పెడతారు. వాటిన్నటికి తమ యాక్షన్స్ తో  డైలాగులతో ఎలా పరిష్కారం సాధించారనే దిశగా కథ జరుగుతుంది.

ఎలా ఉంది

బాలీవుడ్ మళ్లీ ఉత్సాహం తెచ్చుకుని సినిమాలు రిలీజ్ చేస్తోంది.  సూర్యవంశీ కలెక్షన్ల బాగుండటంతో  బాలీవుడ్ నిర్మాతలు  తమ సినిమాలను థియేటర్లలోకి వదులుతున్నారు. అందులో భాగంగానే తాజాగా జాన్ అబ్రహం సత్యమేవ జయతే 2 విడుదలయ్యింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో, హిందీ బాక్సాఫీస్ ఏ స్దాయిలో వర్కవుట్ అవుతుందో అని ట్రేడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  అయితే అంత సీన్ లేదు అని ఈ సినిమా చూస్తే అర్దమవుతుంది.

ఈ సినిమా ఓ రకంగా ఆ రోజుల్లో అంటే ఎనభైల్లో వచ్చే యాక్షన్ హిందీ సినిమాలు రెండు మూడు కలిపి చూసినట్లుంది. అప్పట్లో ఇలాంటి సినిమాలు అమితాబ్, వినోద్ ఖన్నా తెగ చేసేసారు. వాటి నకలు ఇది. అయితే మూడు పాత్రలు జాన్ అబ్రహం చేయటం మాత్రం ఆరాచకం. ఈ సినిమాలో చెప్పుకోవటానికి కథ గానీ, గుర్తుపెట్టుకునే డైలాగు కానీ ఏమీ ఉండదు. ఎవరూ మామూలుగా మాట్లాడరు. అరిచి చెప్తూంటారు. అలాగే యాక్షన్ అంటే ఎగిరి ఎదుటివాడి మీద దూకటమే. మరీ కష్టం అనిపిస్తే చొక్కా విప్పి రెచ్చిపోవటమే. బి,సి సెంటర్లను టార్గెట్ చేసుకుని తీసిన సినిమా ఇది. అయితే వాళ్లు కూడా ఇలాంటి సినిమాలు చూస్తున్నారా అనే సందేహం వస్తూంటుంది.

డైరక్షన్ కూడా ఏమీ ఉండదు. అంతా యాక్షన్ డైరక్టరే చూసుకున్నట్లున్నారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ అనటానికి కూడా లేదు. ఎక్కడా చెప్పుకోదగ్గ థ్రిల్లింగ్ ఉండదు. ఆ మధ్యన వచ్చిన సూర్య చిత్రాలు సింగం సీరిస్ ని గుర్తు చేస్తాయి. అయితే వాటిలో సూర్య ఒక్కడే హీరో. ఇక్కడ ముగ్గురు మూడు రకాలుగా చెలరేగిపోతూంటారు.ఈ సినిమాలో ట్విస్ట్ ఏదైనా ఉందీ అంటే అది ఏకంగా హీరో ట్రిపుల్ రోల్ చేయడమే. న్యూస్ పేపర్లు చూసి, పాత సినిమాలు చూసి రాసుకున్నట్లు ఉన్న ఈ కథ …ఆ కాలంలో ఆగిపోయిన వాళ్లకు నచ్చుతుందేమో కానీ ఇప్పుడు కష్టం. దానికి తోడు తెర మొత్తం ఎప్పుడూ రక్తంతో మునిగి తేలుతున్నట్లు అనిపిస్తుంది. ముంబై సాగతో మొదలుపెట్టి జాన్ అబ్రహం..యాక్షన్ చేస్తున్నట్లుగా ఉండటం లేదు.  ఓవర్ యాక్షన్ అనిపిస్తోంది.

టెక్నికల్ గా ..

ఈ సినిమా కెమెరా వర్క్ బాగుంది. సాంగ్స్ రాంగ్ ప్లేస్ మెంట్ కానీ బాగున్నాయి. రైతు, ఇద్దరు బిడ్డల తండ్రి, పోలీసు అధికారి.. ఇలా మూడు పాత్రల్లో నటించడం చాలా కష్టం. అయితే జాన్ అబ్రహం ఈజీగా చక్కటి ఈజ్ తో చేసేసారు.  ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశం ఏమైనా ఉందీ అంటే అది  కుసు కుసు పాట మాత్రమే. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరోసారి తనదైనా డ్యాన్స్ మూవ్‏మెంట్స్‏తో కుర్రకార మతి పొగొడుతుంది. తన స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నోరా.
 

చూడచ్చా…

ఈ మధ్యన మరీ యాక్షన్ సినిమాలు తగ్గిపోయాయి అని  ఫీలయేవాళ్లకి నచ్చచ్చు.ఫస్ట్ ఫార్ట్ కు, దీనికి ఏ మాత్రం పోలిక లేదు

ఎవరెవరు..
బ్యానర్:  టీ సిరీస్, ఎమ్మే ఎంటర్టైన్మెంట్
నటీనటులు: జాన్‌ అబ్రహాం,  దివ్య కోస్లా కుమార్‌, నోరా ఫతేహి తదితరులు
సినిమాటోగ్రాఫర్: డూడ్లే
ఎడిటర్: మాహిర్ జవేరి
సంగీతం: సంజయ్ చౌదరి
విడుదల తేదీ: 25 నవంబర్ 2021
రన్ టైమ్: 142 నిముషాలు
దర్శకత్వం:  మిలాప్‌ జావేరి
నిర్మాతలు: భూషణ్ కుమార్, కిషన్ కుమార్, మోనీషా అద్వానీ, నిఖిల్ అద్వానీ