సార్ మూవీ రివ్యూ

Published On: February 17, 2023   |   Posted By:

సార్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji 

తొలిప్రేమతో సాలిడ్ హిట్‌ సినిమాని అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్‌ దే చిత్రాలతో మెప్పించలేకపోయాడు. అయితే ఈ సారి ఆయన ఓ సందేశాత్మక చిత్రంతో మన ముందుకు వచ్చాడు. అందుకు తోడుగా తమిళ హీరో ధనుష్ ని తెచ్చుకున్నాడు. పెద్ద బ్యానర్ నేటి విద్యా వ్యవస్ద పై సినిమా కావటం, ప్రీ పెయిడ్ ప్రీమియర్ షోలు సినిమాకు హైప్ క్రియేట్ చేసాయి. ఇంతకీ సినిమా కథ ఏమిటి మనని దర్శకుడు ఈ సారి మెప్పించగలిగాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

అది 1998-2000 మధ్య కాలం. దేశం అంతటా విద్యా వ్యవస్దలో మార్పులు వస్తున్నాయి. ప్రెవీటీకరణవైపు ప్రభుత్వాలు మ్రొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో విద్యను వ్యాపారం చేయాలని చాలా మంది ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో ఒకడు త్రిపాఠీ విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్‌ త్రిపాఠి(సముద్రఖని). అతను ప్రైవేట్ కాలేజీల అసోసియేష‌న్ ప్రెసిడెంట్. అతను లక్ష్యం ప్రభుత్వ కాలేజీలను పడతోసి ఆ పిల్లలను తన వైపుకు తిప్పుకోవాలని. దాంతో ప్ర‌భుత్వ కాలేజీల్లో ప‌నిచేసే లెక్చరర్స్ కి ఎక్కువ జీతాల్ని ఆశ‌ పెట్టి తన కాలేజీకు లాక్కొచ్చేస్తాడు. దాంతో చాలా ప్రభుత్వ కాలేజీలు లెక్చరర్స్ లేక మూతపడతాయి. జనాలకు తప్పని సరిగా ప్రెవేట్ కాలేజీకు వెళ్లి వేలల్లో ఫీజు కట్టి చదువుకోవాల్సిన పరిస్దితి ఏర్పడుతుంది. అయితే ఈ విషయమై అన్ని చోట్ల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇది గమనించి మరో స్కెచ్ వేస్తాడు త్రిపాఠి.

తమ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్స్ ని గవర్నమెంట్ కాలేజీలకు ఉచితంగా పంపించి చదువు చెప్పిస్తానంటాడు. ఆ కాలేజీలను తనే దత్తత తీసుకుంటానంటాడు. ఆ క్రమంలో జూనియర్ లెక్చరర్స్ ని ప్రభుత్వ కాలేజీలకు పంపుతూంటాడు. వాళ్లు అనుభవ లేమితో ప్రభుత్వ కాలేజీలని మరోసారి దెబ్బ కొడతాడని భావిస్తాడు. అయితే అది జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ బాల‌గంగాధ‌ర తిల‌క్ అలియాస్ బాలు సార్ (ధ‌నుష్‌) వల్ల దెబ్బ తింటుంది. కడప సిరిపురం కాలేజీకి చదువు చెప్పటానికి వెళ్లిన బాలుఅక్కడ వంద శాతం రిజ‌ల్ట్ తీసుకొస్తాన‌ని మాట ఇస్తాడు. ఆ దిసగా ప్రయత్నాలు మొదలెడతాడు. అప్పుడు త్రిపాఠి వైపు నుంచి బాలు సార్‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? తను చదువు చెప్పిన 45 మంది విద్యార్థులు ఎంసెట్‌ పరీక్షల్లో రాణించారా? బ‌యాల‌జీ లెక్చ‌ర‌ర్ మీనాక్షి (సంయుక్త‌) ఆయ‌న‌కి ఎలా సాయం చేసిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉంది?

ఇలాంటి సందేశాత్మక చిత్రాలకు ధనుష్ వంటి స్టార్ తోడవటం కమర్షియల్ గా మంచి ఆపర్చునిటీనే. అయితే ఈ సినిమాకు అనుకున్న స్దాయిలో బజ్ రాలేదు. మౌత్ టాక్ తో సినిమాకు మ్యాజిక్ జరిగాలి. కానీ ఈ సినిమాలో చర్చించిన విషయం సమకాలీన అంశమే అయినా పరమ రొటీన్ గా అనిపిస్తుంది. అలాగే నేరేషన్ లో కూడా మ్యాజిక్ చేయలేకపోయారు. మధ్య తరగతి ఆశలుఎడ్యుకేషన్ బిజినెస్ లో పడి ఎలా నలిగిపోతున్నాయనేది చెప్పటానికి అసహజంగా అనిపించే కథనం ఎంచుకున్నారు. ప్రభుత్వ కాలేజీలను దత్తత తీసుకుని , అందులోకి అనుభవం లేని జూనియర్ కాలేజీ లెక్చరర్స్ ని పంపటం అనే విలన్ స్కెచ్ వినటానికి బాగున్నా తెరమీదకు వచ్చేసరికి చాలా అసజంగా అనిపించింది. కథకు తీసుకున్న సమస్య నిజమైనప్పుడు దాన్ని డీల్ చేసే విధానం కూడా అంతే వాస్తవికంగా చెయ్యల్సింది. అలా చేయలేకపోవటంతో బిలీవబులిటీ దెబ్బతింది. దానికి తోడు డైరక్టర్ హీరోని ఎలివేట్ చేయటానికి చాలా సీక్వెన్స్ లు పక్తు కమర్షియల్ సినిమాను గుర్తు చేస్తాయి. ఎక్కడా ట్విస్ట్ లు, టర్న్ లు ఉండవు. సాదా సీదాగా నడుస్తుంది. అలాగే తమిళ ఆడియన్స్ ని మెప్పించటానికి ఏమో కానీ కాస్తంత బరువైన సన్నివేశాలు పెట్టుకున్నారు. అయితే ఈ రోజుల్లో ఇలాంటి కథని ఎత్తుకోవటం మాత్రం గొప్ప విషయమే. విద్య వ్యాపారం, మధ్య తరగతికు బరువు అయ్యిపోయింది అని చెప్పాలనుకుని సీన్స్ రాసుకుని సినిమా తీయటమూ సాహమే. అందుకు నిర్మాతలను అభినందించాలి. అయితే సినిమాలో ఉన్న ఐడియాలన్నీ అక్కడక్కడే ఆగిపోయాయి. విస్తరణ జరగలేదు. ఓవరాల్ గా ఓకే అనిపిస్తుంది కానీ అనుకున్న స్దాయిలో కనెక్ట్ అయ్యి చూసే సినిమాలా అనిపించదు.

హైలెట్స్

ధనుష్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ లు

ఫార్ములా నేరేషన్
దొరినప్పుడుల్లా స్పీచ్ లు లు ఇవ్వటం
ఊహించగలిగే కథనం
రిలీఫ్ లేకపోవటం

చూడచ్చా

ధనుష్ సహజమైన నటన కోసం ఓ సారి చూడచ్చు,

టెక్నికల్ గా

డైరక్టర్ రొటీన్ పాయింట్ ని ఎంచుకుని అందుకు క్లాస్ లు పీకే నేరేషన్ ని ఎంచుకోవటం తో శ్రమ వృధా అయ్యింది. డైలాగులు చాలా నేచురల్ గా బాగున్నాయి. జే యువరాజ్‌ సినిమాటోగ్రఫీ క్వాలిటీగా బాగుంది. జీవీ ప్రకాష్‌ కుమార్ మ్యాజిక్లో పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు ప్లస్ అయ్యాయి. మాస్టారు మాస్లారు ఇప్పటికే పెద్ద హిట్దాన్ని చాలా బాగుంది. ఎడిటింగ్‌ ఓకే. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, త్రివిక్రమ్‌కి చెందిన ఫార్చ్యూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థల నిర్మాణ విలువలకు పేరు పెట్టే అవసరం లేదు.

నటీనటుల్లో

ధనుష్ కు ప్రత్యేకంగా ఇవాళ బాగా చేసాడని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎప్పటి నుంచి ఆయన అదే పనిలో ఉన్నాడు పండిపోయాడు. ఇక సంయుక్త మీనన్, సముద్ర ఖని నచ్చుబాటుగా చేసారు. హైపర్ ఆది కొంత అతి అయ్యిందనిపించింది.

నటీనటులు :

ధనుష్, సంయుక్త మీనన్, సముద్ర ఖని, హైపర్‌ ఆది.

సాంకేతికవర్గం :

నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: వెంకీ అట్లూరి
సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌
సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్
ఎడిట‌ర్: న‌వీన్ నూలి
రన్ టైమ్: 140 మినిట్స్
విడుదల తేది: ఫిబ్రవరి 17, 2023