సూర్యాస్త‌మ‌యం చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి

Published On: December 10, 2018   |   Posted By:

సూర్యాస్త‌మ‌యం చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి

`సూర్యాస్త‌మ‌యం` సినిమాలో11 శాఖ‌లు నిర్వ‌హించిసంచ‌ల‌నం సృష్టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌బండి స‌రోజ్ కుమార్‌.

సినిమా అంటేనే 24 శాఖ‌ల స‌మ్మేళ‌నం. ఒక సినిమా త‌యారు కావాలంటే ఎంతో మంది వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకే వ్య‌క్తి ఎక్కువ శాఖ‌లు నిర్వ‌హించి సినిమా చేయ‌డ‌మ‌నేది సినిమా చ‌రిత్ర‌లో చాలా అరుదుగా మాత్ర‌మే జ‌రుగుతూ ఉంటుంది. తాజాగా అలాంటి అరుదైన ఫీట్ చేశారు బండి స‌రోజ్ కుమార్‌.

`సూర్యాస్త‌మ‌యం` అనే చిత్రం కోసం ఆయ‌న 11 శాఖ‌లు నిర్వ‌హించారు. ఆ చిత్రానికి ఆయ‌నే స్టోరీ రైట‌ర్‌, స్క్రీన్ ప్లే రైట‌ర్‌, డైలాగ్ రైట‌ర్‌, లిరిక్ రైటర్ , ఎడిటర్ , మ్యూజిక్ డైరెక్టర్ , స్టంట్ మాస్ట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్ మ‌రియు డైర‌క్ట‌ర్‌. అంతే కాదు ఆ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ధారి కూడా. ఓజో మీడియా ప‌తాకంపై ర‌ఘు పిల్లుట్ల‌, ర‌వికుమార్ సుద‌ర్శి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫ‌స్ట్ కాపీ కూడా సిద్ధ‌మైంది.

ఈ సంద‌ర్భంగా బండి స‌రోజ్‌కుమార్ మాట్లాడుతూ “2010లో త‌మిళంలో `పొర్ కాల‌మ్‌` అనే సినిమా చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. చాలా స‌హ‌జ‌సిద్ధ‌మైన లొకేష‌న్ల‌లో ఆర్టిస్టుల‌కు ఎలాంటి మేక‌ప్ ఉప‌యోగించ‌కుండా, చాలా నేచుర‌ల్‌గా   `సూర్యాస్త‌మ‌యం` సినిమా తీశాం. ఇది నేచుర‌ల్ యాక్ష‌న్ మూవీ. ఒక పోలీస్‌కీ, గ్యాంగ్‌స్ట‌ర్‌కీ మ‌ధ్య జ‌రిగే అంత‌ర్యుద్ధం ఈ సినిమా ప్ర‌ధాన క‌థాంశం. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌లో నేను, గ్యాంగ్‌స్ట‌ర్‌గా త్రిశూల్ రుద్ర యాక్ట్ చేశాం. త‌మిళ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ కీల‌క‌మైన పాత్ర పోషించారు. హైద‌రాబాద్‌, వికారాబాద్‌, న‌ల్గొండ‌, రామోజీ ఫిల్మ్ సిటీ, క‌డ‌ప‌, క‌ర్ణాట‌క‌ల్లో చిత్రీక‌ర‌ణ జ‌రిపాం. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ని, చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అని తెలిపారు.

త్రిశూల్ రుద్ర‌, హిమాన్సీ కాట్ర‌గ‌డ్డ‌, బండి సరోజ్ కుమార్, కావ్యా సురేష్‌, డేనియ‌ల్ బాలాజీ, మాస్ట‌ర్ అక్షిత్‌, మాస్ట‌ర్ చ‌ర‌ణ్ సాయికిర‌ణ్‌, బేబీ శ‌ర్వాణీ, మోహ‌న్ సేనాప‌తి, వివేక్ ఠాకూర్‌, సాయిచంద్‌, కేకే బినోజీ, ప్రేమ్‌కుమార్ పాట్రా, షానీ, వంశీ ప‌స‌ల‌పూడి, శ‌ర‌త్‌కుమార్ త‌దిత‌రులు ఈ చిత్ర ప్ర‌ధాన తారాగ‌ణం.

ఈ చిత్రానికి డీటీయ‌స్ మిక్సింగ్‌:  వాసుదేవ‌న్‌, డీ ఐ క‌ల‌రిస్ట్:  ఎం. మురుగ‌న్‌.