సెల్ఫిష్ మూవీ హనుమాన్ జయంతి పోస్టర్‌ విడుదల

Published On: May 15, 2023   |   Posted By:

సెల్ఫిష్ మూవీ హనుమాన్ జయంతి పోస్టర్‌ విడుదల

ఆశిష్, కాశీ విశాల్, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ స్పెషల్ పోస్టర్‌తో హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన సెల్ఫిష్ టీమ్

తొలి చిత్రం రౌడీ బాయ్స్ తో ఆకట్టుకున్న యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ సెల్ఫిష్ తో వస్తున్నాడు.

అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆశిష్ హనుమంతుని విగ్రహం ముందు నమస్కరించి చేతులు చాచాడు. ఈ పోస్టర్ లో ఆశిష్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఫస్ట్ సింగల్ దిల్ ఖుష్ కు అద్భుతమైన స్పందనను పొందడంతో  బ్లాక్ బస్టర్ నోట్‌లో మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు.

ఈ చిత్రంలో ఆశిష్ సరసన ఇవానా కథానాయికగా నటిస్తోంది. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అశోక్ బండ్రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  ప్రవీణ్ పూడి ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

సెల్ఫిష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

తారాగణం
:

ఆశిష్, ఇవానా

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: కాశీ విశాల్
నిర్మాతలు: దిల్ రాజు-శిరీష్
సినిమాటోగ్రాఫర్: యువరాజ్ జె
సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్