సొంత చాన‌ల్‌ను ప్రారంభించిన మంజుల ఘ‌ట్ట‌మ‌నేని

Published On: June 8, 2020   |   Posted By:

సొంత వెబ్‌సైట్‌, యూట్యూబ్ చాన‌ల్‌ను ప్రారంభించిన మంజుల ఘ‌ట్ట‌మ‌నేని

‘షో’ మూవీతో న‌టిగా, నిర్మాత‌గా ఇటు ప్రేక్ష‌కుల‌ను, అటు ఇండ‌స్ట్రీ వారినంద‌రినీ అబ్బుర‌ప‌రిచారు మంజుల ఘ‌ట్ట‌మ‌నేని. ‘మ‌న‌సుకు న‌చ్చింది’ చిత్రంతో ద‌ర్శ‌కురాలిగానూ మారారు. కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న అభిప్రాయాల‌ను, ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటూ వ‌స్తున్న ఆమె ఇప్పుడు సొంత వెబ్‌సైట్‌, యూట్యూబ్ చాన‌ళ్ల‌ను ప్రారంభించారు.

సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు manjulaghattamaneni.com పేరుతో వెబ్‌సైట్‌ను, ManjulaGhattamaneni‬ పేరుతో యూట్యూబ్ చానల్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా, “నా భావాల‌ను, నా భావోద్వేగాలతో పాటు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌నూ నా వెబ్‌సైట్‌లో, నా యూట్యూబ్ చాన‌ల్‌లో అందించేందుకు సిద్ధ‌మ‌వుతున్నందుకు సూప‌ర్‌గా ఎగ్జ‌యిట్ అవుతున్నా.  మీరంద‌రూ ఆద‌రిస్తార‌నీ, స‌బ్‌స్క్రైబ్ అవుతార‌నీ ఆశిస్తున్నా” అని ఆమె చెప్పారు