సౌండ్ పార్టీ మూవీ ఆహా లో విడుదల

Published On: March 7, 2024   |   Posted By:

సౌండ్ పార్టీ మూవీ ఆహా లో విడుదల

ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సౌండ్ పార్టీ ఆహా లో విడుదల

మహా శివరాత్రి కానుకగా నేటి అర్థ రాత్రి నుంచి తెలుగు బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో స్ట్రీమింగ్ కానున్న సౌండ్ పార్టీ

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. జయ శంకర్ సమర్పణలో సంజ‌య్ శేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. గతేడాది నవంబర్ 24న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూత్ దగ్గర నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరించింది.

తాజాగా ఓటీటీలోనూ రీ సౌండ్ చేయడానికి ఈ సినిమా సిద్ధమయింది. తెలుగు బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా ఆహా లోకి సౌండ్ పార్టీ చిత్రం వచ్చేసింది. మహాశివరాత్రి కానుకగా నేటి అర్ధరాత్రి నుంచి సౌండ్ పార్టీ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. అమాయకులైన తండ్రి కొడుకుల మధ్య జరిగే ఫన్నీ డ్రామా ఇది. తప్పకుండా ఇంట్లో అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. వి జే సన్నీ, శివన్నారాయణ మధ్య ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని అన్నారు.

నటీనటులు :

వి.జే సన్నీ, హ్రితిక శ్రీనివాస్, శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, మిర్చి ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, జెమిని సురేష్, భువన్ సాలూరు, ఐ డ్రీమ్ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు.

టెక్నీషియన్స్ :

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి ;
ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ;
నిర్మాతలు : రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర
సమర్పణ : జ‌య‌శంక‌ర్‌ ; రచన  ద‌ర్శ‌కత్వం : సంజ‌య్ శేరి.