స్పై మూవీ రివ్యూ

Published On: June 29, 2023   |   Posted By:

స్పై మూవీ రివ్యూ

Image

నిఖిల్  ‘స్పై’రివ్యూ

Emotional Engagement Emoji

👎

 

రీసెంట్ గా  కార్తికేయ2 సినిమాతో హిట్ కొట్టిన నిఖిల్ స్పై మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టకుంటోంది. అందులోనూ ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ మృతికి చెందిన మిస్టరీ చుట్టూ తిరిగే కథ అని తెలియటంలో సినిమాకు భారీ బజ్ ఏర్పడింది. అయితే ఆ బజ్ కు తగ్గ స్దాయిలో సినిమా ఉందా..సినిమా కథ ఏమిటి… సుభాష్ చంద్రబోస్ మిస్టరీ ఈ కాలం కథలో ఎలా కలపారు అనేది చూద్దాం.

కథ:

రా ఏజెంట్  జే (నిఖిల్ ) దేశభక్తుడు. దేశ రక్షణ కోసం ఎంతదూరమైనా వెళ్తాడు.ప్రాణాలైనా పణంగా పెడ్తాడు. అతని మనస్సులో ఓ బాధ..తన అన్న సుభాష్ వర్ధన్(ఆర్యన్ రాజేష్ ) ని చంపేసిన వాళ్లను పట్టుకోలేకపోయానే అని. తన అన్న కూడా రా ఏజెంట్ గా చేసేవాడు.తన ప్రొపిషన్ లో భాగంగా దేశాలు తిరుగతూ తన అన్నని చంపేసిన వాళ్ల కోసం వెతుకుతూంటాడు. ఈ లోగా జై కు ఓ ఆపరేషన్ అప్పచెప్తారు. చనిపోయాడనుకున్న  గ్లోబల్ టెర్రరిస్ట్ ఖదీర్ ఖాన్‌(నితిన్ మెహతా) బ్రతికి వచ్చాడు..అదెలా సాధ్యమని. ఆ పని మీద ఉండగా.. రా హెడ్ క్వార్ట్రర్స్ నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఫైల్ మిస్ అయ్యిందని తెలుస్తుంది. ఆ ఫైల్స్ ఎవరు ఎత్తుకు వెళ్లారు…తన అన్నను చంపిన వారిపై పగ తీర్చుకున్నాడా… చనిపోయాడనుకున్న  ఖదీర్ ఖాన్‌ మళ్లీ ఎలా తిరిగి వచ్చాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్:

పైనే చెప్పుకున్నట్లు ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయ్యిందే సుభాష్ చంద్రబోస్ మిస్టరీ ఎలిమెంట్ వల్ల. అయితే అంతగా పబ్లిసిటీ చేసిన ఆ విషయం సినిమాలో పెద్దగా కనపడదు. ఉందంటే ఉంది..లేదు అంటే లేదు అన్నట్లు ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ మీద సినిమా  ఏమో అని ఇంటర్వెల్ దాకా చూస్తాము ఎక్కడా అది టచ్ కాదు.సెకండాఫ్ లో ఓ చిన్న పాయింట్ గా వస్తుంది. క్లైమాక్స్ లీడ్ కోసం ..దాంతో ఇది సుభాష్ చంద్రబోస్ పై సినిమా కాదు అని తెలిసాక పెద్ద నిట్టూర్పు వస్తుంది. తప్పించి అంతకు మించి ఏమీ అనిపించదు. అలాగే మరో విషయం …ఈ సినిమా  టీజర్, ట్రైలర్ చూసి ఇదో మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ అనుకుంటాము. కానీ అలాంటిదేమీ ఎక్కడా ఉండదు. ఇంటెన్స్ అనే మాటకు అర్దం ఈ సినిమాలో మనకు అసలు దొరకదు. యాక్షన్ సీన్స్ బాగా తీసారు కానీ..ఆ సీన్స్ కు తగ్గ ప్రిమైజ్ అయితే సినిమాలో సెట్ చేయలేదన్నది మాత్రం నిజం. దాంతో అవి వస్తూంటాయి. వెళ్తూంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సినిమా కథలో ట్విస్ట్ లు, టర్న్ లు ఉంటాయి కానీ అవేమీ పేలక మనకు ప్లాట్ గా నడుస్తున్నట్లు ఉంటుంది. అలా స్క్రిప్టు లెవిల్ లోనే ఈ సినిమా పడుకుంది.  అందుకే చాలా భాగం బోరింగ్  అనిపిస్తుంది.

ఆర్టిస్ట్ లు ఫెరఫార్మెన్స్ వైజ్ చూస్తే..

నిఖిల్ చాలా భాగం కష్టపడ్డాడు. స్పై గా కనిపించటానికి . అయితే అతనికి స్క్రిప్టు సహకరించలేదు. డైలాగులు సోసోగా ఉండటంతో అవీ పేలలేదు. ఎంతసేపు ఓ రివాల్వర్ పట్టుకుని తిరగటమే పనిగా నడిచింది. హీరోయిన్ ని  మాత్రం కేవలం పాటలకు పరిమితం చేయకుండా కొన్ని సీన్స్ ఇచ్చారు..అది హ్యాపీ . ఇక మిగతా ఆర్టిస్ట్ లులో ఎక్కువ మంది గెస్ట్ లే కావటం విశేషం.రానాతో సహా గెస్ట్ ఆర్టిస్టే.

టెక్నికల్ గా…

సినిమా లో ఒక్క పాటా సరైంది కనపించదు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అయితే ఇలాంటి కథలకు  పాట‌లూ ప్ల‌స్ అయితే.. బాగుండేదేమో. కెమెరా వ‌ర్క్ డీసెంట్ గా నీట్ గా ఉంది. ఎడిటింగ్  చాలా చోట్ల ల్యాగ్ లు లేవు. మరింత  షార్ప్‌గా ఉండాలి. డైలాగ్స్ కూడా సోసో.  డైరక్టర్ మాత్రం స్పై  జానర్ కు కావాల్సిన మేకింగ్ మాత్రం చేయలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడెక్కడి కొత్త లొకేషన్స్ చూపించారు. విఎఫ్ ఎక్స్ మాత్రం తేలిపోయింది.

బాగున్నవి :
బ్యాగ్రౌండ్ స్కోర్
యాక్షన్ సీక్వెన్స్

బాగోలేనివి :
సినిమాటెక్ లిబర్టీ
ప్లాట్ గా నడిచే కథనం
డైరక్షన్

చూడచ్చా
నిఖిల్ అభిమాని అయ్యుంటే తప్పించి వేరే వాళ్లు చూడటం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది.

బ్యానర్: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యమీనన్, రానా దగ్గుబాటి, అభినవ్ గోమటం, ఆర్యన్ రాజేష్, సన్య థాకూర్, మక్రంద్ దేశ్ పాండే, జిస్సు సేన్ గుప్తా, నితిన్ మెహ్తా, రవి వర్మ, కృష్ణ తేజ, ప్రిష సింగ్, సోనియా నరేష్, తదితరులు.
డీఓపీ:  వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
రచయిత: అనిరుధ్ కృష్ణమూర్తి
సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్
ఆర్ట్: అర్జున్ సూరిశెట్టి
దర్శకుడు & ఎడిటర్: గ్యారీ బీహెచ్
కథ & నిర్మాత: కే రాజశేఖర్ రెడ్డి
నిడివి: 2h 15m
విడుదల తేదీ:  29-06-2023