హద్దు లేదురా చిత్రం ఫస్ట్ లుక్  విడుద‌ల‌

Published On: December 11, 2023   |   Posted By:

హద్దు లేదురా చిత్రం ఫస్ట్ లుక్  విడుద‌ల‌

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ లాంచ్ చేసిన ‘హద్దు లేదురా’ ఫస్ట్ లుక్

టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వర్ణ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన నూతన చిత్రానికి  ”హద్దు లేదురా..” అనే టైటిల్ని ఖరారు చేశారు. వీరేష్ గాజుల బళ్లారి నిర్మాతగా, రావి మోహన్ రావు సహా నిర్మాతగా, యువ దర్శకుడు రాజశేఖర్ రావి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆశిష్ గాంధీ, అశోక్ హీరోలుగా వర్ష, హ్రితిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్  ‘హద్దు లేదురా’.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్  చేశారు

టైటిల్ విడుదల సందర్భంగా డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ.. హద్దు లేదురా.. టైటిల్ చాలా బాగా వుందని, ఫస్ట్ లుక్ & సినిమా థీమ్  వైవిధ్యంగా ఉందని, తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందని అన్నారు.

డైరెక్టర్ రాజశేఖర్ రావి మాట్లాడుతూ.. అలనాటి కృష్ణార్జునులు స్నేహితులు అయితే ఎలా ఉంటారో తెలిపే కథ ,కథనం హైలైట్ గా నిలుస్తాయని, ఫైట్స్, పాటలు సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ముఖ్యంగా క్లైమాక్స్ తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుందని తెలిపారు.

నిర్మాత గాజుల వీరేశ్ మాట్లాడుతూ.. రుద్రాంగి చిత్రంలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న హీరో ఆశిష్ గాంధీ సీన్స్, డైరెక్టర్ రావి రాజశేఖర్ కథని తీర్చిదిద్దిన విధానం, సంభాషణలు ఈ చిత్రనికి  హైలెట్ గా నిలుస్తాయని, త్వరలో టీజర్ , ఆడియో వేడుకను నిర్వహించి, జనవరి చివరలో మీ ముందుకు తీసుకువస్తామని తెలిపారు.

హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ.. అర్జున్, కృష్ణ మధ్య వచ్చే ఫ్రెండ్షిప్  సీన్స్ అన్ని ఈ జనరేషన్ కి,  యూత్ బాగా కనెక్ట్ అవుతాయని, చాలా సంవత్సరాల తర్వాత ఫ్రెండ్షిప్ నేపద్యంలో వచ్చే ఈ సినిమా నాకు, దర్శకనిర్మాతలకు మంచిపేరు తీసుకొస్తుందని తెలిపారు.