హరోం హర మూవీ ఉడిపి షెడ్యూల్ పూర్తి

Published On: July 21, 2023   |   Posted By:

హరోం హర మూవీ ఉడిపి షెడ్యూల్ పూర్తి

సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక, సుమంత్ జి నాయుడు, ఎస్ఎస్ సి పాన్ ఇండియా మూవీ హరోం హర ఉడిపి షెడ్యూల్ పూర్తి

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం హరోం హర. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ది రివోల్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. సుధీర్ బాబు బర్త్ డే కానుకగా విడుదలైన హరోం హర ఫస్ట్ ట్రిగ్గర్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా చిత్ర యూనిట్ ఉడిపిలో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. షెడ్యూల్‌ అనంతరం హీరో సుధీర్ బాబు శ్రీ కుక్కే సుబ్రమణ్య ఆయలయాన్ని దర్శించుకున్న ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.

ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, రవితేజ గిరిజాల ఎడిటర్ గా పని చేస్తున్నారు .

ఈ ఏడాది డిసెంబర్ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం :

సుధీర్ బాబు

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం – జ్ఞానసాగర్ ద్వారక
బ్యానర్ – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నిర్మాత – సుమంత్ జి నాయుడు
సంగీతం – చైతన్ భరద్వాజ్
డీవోపీ – అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్ – రవితేజ గిరిజాల