హైవే మూవీ రివ్యూ

Published On: August 19, 2022   |   Posted By:

హైవే మూవీ రివ్యూ

ఆనంద్ దేవరకొండ  ‘హైవే’  మూవీ రివ్యూ

 Emotional Engagement Emoji (EEE) 

👍

తెలుగు ఓటిటి ఆహా ఈమ‌ధ్య‌ ఒరిజినల్ కంటెంట్ పై దృష్టి పెట్టింది. ఆ క్ర‌మంలోనే ఈ  సైకో థ్రిల్లర్
వచ్చింది.  విజయ్ దేవరకొండ తమ్ముడు నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ ఓటిటిలో మంచి హిట్
అవటం కూడా ఊతం ఇచ్చింది అలాగే పాతాల్ లోక్ సిరిస్ తో ఆకట్టుకున్న అభిషేక్ బెనర్జీ కూడా
వున్నాడు. వీళ్లందరికి తోడుగా సినిమాటోగ్రాఫ‌ర్‌గా చిరకాల అనుభ‌వం ఉన్న‌.. కెవి గుహ‌న్ డైరక్టర్
కావటంతో ఎదురేముంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో హిట్ గా నిలిచిన 118 లాంటి మంచి సినిమా
ఆయ‌న్నుంచే వ‌చ్చింది. ఈ నేపధ్యంలో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉంది…చూడదగ్గ

థ్రిల్లరేనా, కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

హైదరాబాద్ లో అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి చంపేస్తూంటాడు సైకో కిల్ల‌ర్ దాస్  (అభిషేక్ బెనర్జీ) . అతన్ని పట్టుకోవటానికి ఏ ఎస్పీ   ఆశా భరత్‌ (సైయామీ ఖేర్‌)  కృషి చేస్తూంటుంది. ఇదే టైమ్ లో  విశాఖపట్నం నుండి బెంగళూర్‌కు తన ప్రెండ్ సముద్రం(సత్య) తో  కలిసి   ప్రీ వెడ్డింగ్ షూట్ ఈవెంట్ కోసం బయలుదేరతాడు ఫోటోగ్రాఫర్ విష్ణు (ఆనంద్‌ దేవరకొండ). అతనికి దారిలో… మంగుళూరులోని తన తండ్రి దగ్గరకు బైలుదేరిన తుల‌సి (మానస రాధాకృష్ణన్) అనే అమాయకురాలు తారసపడుతుంది. ఆమెను మంగుళూరు బస్‌ ఎక్కించే బాధ్యతను తీసుకుంటాడు విష్ణు. కానీ విధి వేరే విధంగా తలుస్తుంది.  ఊహించని కారణాలతో ఆమె సైకో కిల్లర్ చేతికి చిక్కుతుంది. ఓ ప్రక్క  ఎఎస్పీ,  ఇటు ప్రక్క  విష్ణు సైకో కిల్లర్‌ను ఛేజ్‌ చేయడం మొదలు పెడతారు. చివరకు అతన్ని పట్టుకోగలిగారా…తులసిని రక్షించగలిగారా..తులసి ..సైకో కిల్లర్ చేతికి చిక్కటానికి గల కారణం ఏమిటి…సైకో కిల్లర్ ప్లాష్ భ్యాక్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథా,కథన విశ్లేషణ

దర్శకుడు గుహన్ ఈ చిత్రాన్ని కోయన్ బ్రదర్శ్…No Country for Old Men బేస్ చేసుకుని రాసానన్నారు. అయితే ఈ చిత్రానికి దీనికి ఏమీ సంభందం ఉండదు. జర్నీలో క్యారక్టర్స్ కు ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ వర్కవుట్ అవుతుందని ఆయన చెప్పారు.  సినిమా మెయిన్ గా మూడు ప్రధాన పాత్రల మీద నడుస్తుంది. హీరో ,హీరోయిన్ అలాగే కిల్లర్ పాత్రలు చుట్టూ తిరుగుతుంది. అంతవరకూ బాగానే ఉంది.  ఈ జర్నీలో విష్ణు, తులసి మధ్య ఏర్పడిన చిన్నపాటి అనుబంధం, ఒకరిని ఒకరు వదులుకోలేని నిస్సహాయస్థితి, అంతలోనే ఊహించని ప్రమాదంలో తులసి ఇరుక్కోవడం… వంటి అంశాలను దర్శకుడు కన్వెన్సింగ్ గానే తీశాడు.

అలాగే కేవలం క్యారక్టర్స్ తోనే నడపలేం కదా..సైకో చేతికి హీరోయిన్ చిక్కినప్పుడు ఏం జరుగుతుందనే చోటే కథ కాంప్లిక్ట్ లో పడుతుంది. కానీ అక్కడ నుంచే దారి తప్పారు. కథ లో ఏమీ జరగదు.  కేవలం హీరోయిన్ ని వెతుకుతూ అందరూ రోడ్లు మీద తిరుగుతూంటారు. మన దృష్టి అంతా సైకో ..ఆమెను ఏం చేస్తాడనే ఉంటుంది. వీళ్లు ఎలా రక్షిస్తారనే చూస్తాంటాం. కానీ అలాంటి యాంగిల్ తీసుకోలేదు. డైరక్టర్ క్యారక్టర్స్ గేమ్ ఆడదామనుకన్నారు. కానీ గేమ్ లోకి ఎంటర్ అవకముందే అవుట్ అయ్యి ఫీలింగ్ వచ్చేసింది. ఏదైమైనా సీట్‌ ఎడ్జ్‌లో కూర్చోపెట్టెంత గ్రిప్పింగ్‌గా మాత్రం స్క్రీన్ ప్లే  లేదు.  డైరక్టర్ ఎంచుకున్న …జనారణ్యంలోని మానవ మృగానికి అడవిలో పులితో  ఎలాంటి శిక్ష పడిందనే అంశం కాస్తంత థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది కానీ కన్వీన్స్ కాము.  రొటీన్ టెంప్లెట్ తోనే హైవే ప్రయాణం చేయడానికి మొగ్గు చూపడం కొంత నిరాశని కలిగిస్తుంది.ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి త‌ప్ప‌క బోరింగ్ క‌లిగిస్తుంది.

టెక్నికల్ గా…

ఇలాంటి సినిమాలు టెక్నికల్ గా చాలా సౌండ్ గా ఉండాలి. డైరక్టర్ ..గుహన్ కెమెరామెన్ కూడా కావటం తో ఖచ్చితంగా అది ఊహిస్తాము కూడా అయితే కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే బాగున్నాయి. మిగతావి డైరక్షన్, ఎడిటింగ్ వంటి కీలక విభాగాలు కూడా తేలిపోయాయి. పాటలు, మాటలు రెండూ దారుణమే. ప్రొడక్షన్ కూడా చాలా తక్కువలో చుట్టేసినట్లు అనిపించింది. సినిమా కాకుండా ఏదో షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ వచ్చింది.

ఎవరెలా చేసారు..

ఆనంద్ దేవరకొండ నటనలో చెప్పుకోదగ్గ ఇంప్రూవ్‌ మెంట్‌ కనిపిస్తోంది. సహజంగా సీన్స్ చేసుకుంటూ పోయారు.  మలయాళీ నటి మానసా రాధాకృష్ణన్ ఓకే అనిపించింది.  సైయామీ ఖేర్‌ గత యేడాది నాగార్జున ‘వైల్డ్ డాగ్’లో కీలక పాత్ర పోషించింది. ఇందులోనూ అదే తరహా పాత్రను చేసింది.  తమిళ నటుడు జాన్ విజయ్ చేసిందేమీ లేదు ‘మీర్జాపూర్‌’, ‘పాతాళ్‌ లోక్‌’ ఫేమ్ అభిషేక్‌ బెనర్జీ ఇందులో సైకో పాత్రను అదరకొట్టాడు. ఇతర ప్రధాన పాత్రల్లో సత్య, తులసీరామ్‌, నాగమహేశ్‌, సురేఖా వాణి, ఆంటోని, మిర్చి కిరణ్‌, రేష్మ పసుపులేటి, కళ్యాణీ నటరాజన్‌, ‘రచ్చ’ రవి పాత్రోచితంగా కనిపిస్తారు. ‘పూలరంగడు’ దర్శకుడు వీరభద్రమ్ చౌదరి ప్రీ క్లయిమాక్స్ లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు..కానీ కథకు కలిసి రాలేదు.

చూడచ్చా?
థ్రిల్లర్ జానర్ మూవీస్ ను ఇష్టపడే ‘హై వే’ మూవీ నచ్చుతుంది.

నటీనటులు : ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్, సయామీ ఖేర్, అభిషేక్ బెనర్జీ, రమ్య పసుపులేటి, ‘స్వామి రారా’ సత్య, జాన్ విజయ్ తదితరులు
మాటలు : మిర్చి కిరణ్, సాయి కిరణ్ సుంకోజు
స్క్రీన్ ప్లే : ఖైలాష్, సుధాకర్ కె.వి.
సంగీతం : సైమన్ కె. కింగ్
నిర్మాత : వెంకట్ తలారి
రైటర్, సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ : కె.వి. గుహన్
విడుదల తేదీ: ఆగస్టు 19, 2022
Run-Time: 122 Minutes
ఓటీటీ వేదిక : ఆహా