105 మినిట్స్ మూవీ మోషన్ పోస్టర్ విడుదల

Published On: December 29, 2023   |   Posted By:

105 మినిట్స్ మూవీ మోషన్ పోస్టర్ విడుదల

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదగా హన్సిక 105 మినిట్స్ మోషన్ పోస్టర్ రిలీజ్

హన్సిక హీరోయిన్ గా రాజు దుస్స దర్శకత్వంలో 105 మినిట్స్ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. రుద్రాంశ్ సెల్యులాయిడ్స్, మాంక్ ఫిలిమ్స్ సంయుక్తంగా బొమ్మ కె శివ నిర్మాతగా నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ మూవీ గా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. మోషన్ పోస్టర్లో రక్తపు గాయాలతో కుర్చీలో కూర్చున్న హన్సిక ఒక ఇంటెన్సిఫైడ్ లుక్ తో కనిపిస్తుంది. శ్యాం సి యస్ సంగీతాన్ని అందించారు. రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ మూవీ పైన అంచనాలను పెంచేస్తోంది.

హన్సిక ఇంతకుముందు ఎన్నడు కనిపించని గెటప్ లో చాలా కొత్తగా కనిపిస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ రోల్ అందులోనూ ఇలాంటి ఒక డిఫరెంట్ రోల్ చేయడం హన్సిక కి ఇదే మొదటిసారి. మాంక్ మరియు పనోరమ స్టూడియోస్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సాంకేతిక వర్గం :

ప్రొడక్షన్: రుద్రాంశ్ సెల్యులాయిడ్స్, మాంక్ ఫిలిమ్స్
నిర్మాత: బొమ్మ కె శివ
దర్శకుడు: రాజుదుస్సా
డి ఓ పి : కిషోర్ బోయిదాపు
సంగీతం: సామ్ సిఎస్