1134 చిత్రం డిసెంబర్ 15 విడుదల

Published On: December 7, 2023   |   Posted By:

1134 చిత్రం డిసెంబర్ 15 విడుదల

నో బడ్జెట్‌తో తీసిన ప్రయోగాత్మక చిత్రం ‘1134’ డిసెంబర్ 15న విడుదల

ప్రస్తుతం కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రాలకు ఆదరణ లభిస్తోంది. ఇలాంటి ఓ డిఫరెంట్ ప్రయోగమే ‘1134’ మూవీ. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు నూతన దర్శకుడు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి. శాన్వీ మీడియా బ్యానర్ మీద రాబోతోన్న ఈ మూవీకి భరత్ కుమార్ పాలకుర్తి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుందని ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్‌ను చూస్తూనే అర్థం అవుతోంది. 2 నిమిషాల 28 సెకనుల నిడివితో వచ్చిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. సొంతంగా తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్నివర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి.
తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 15న విడుదల చేయబోతోన్నట్టుగా యూనిట్ తెలిపింది.
రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా బ్యానర్‌‌లపై తెరకెక్కుతున్న ఈ 1134 చిత్రంలో కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందిస్తున్నారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
నటీనటులు:
 కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్
సాంకేతిక వర్గం:
డైరెక్టర్: శరత్ చంద్ర తడిమేటి
బ్యానర్: రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా
సహ నిర్మాత : భరత్ కుమార్ పాలకుర్తి
మ్యూజిక్: శ్రీ మురళీ కార్తికేయ
డీఓపీ: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి
డీఐ: గజ్జల రక్షిత్ కుమార్
పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు