18 పేజెస్ మూవీ ట్రైలర్ డిసెంబర్ 17న

Published On: December 15, 2022   |   Posted By:

18 పేజెస్ మూవీ ట్రైలర్ డిసెంబర్ 17న

17న విడుదలకానున్న నిఖిల్, అనుపమ జంటగా నటించిన 18 పేజెస్ ట్రైలర్

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న జీఏ 2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 18 పేజిస్ నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ 18పేజిస్ ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు కుమారి 21ఎఫ్ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలే ఈ 18పేజిస్ టీజర్ కి, నన్నయ్య రాసిన అలానే టైం ఇవ్వు పిల్ల అనే పాటలతో పాటు రీసెంట్ గా రిలీజైన ఏడు రంగుల వాన అనే పాటకు కూడా అనూహ్య స్పందన లభించింది. ఈ చిత్ర ప్రొమోషనల్ కంటెంట్ సినిమాపై రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది. ఈ తరుణంలో ఈ చిత్ర యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను 17 వ తారీఖున రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.

ప్రొమోషన్స్ లో భాగంగా ఒక క్రేజి వీడియోతో ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు అనుపమ & నిఖిల్.

నటీ,నటులు

నిఖిల్ సిద్దార్థ & అనుపమ పరమేశ్వరన్

సాంకేతిక నిపుణులు

ప్రొడక్షన్: GA2 పిక్చర్స్ & సుకుమార్ రైటింగ్స్
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్
కథ: సుకుమార్
నిర్మాత: బన్నీ వాస్
నిర్మాతలు: శరణ్ రాపర్తి (గీతా ఆర్ట్స్), అశోక్ బండ్రెడ్డి
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: వసంత్
ఎడిటర్: నవీన్ నూలి
రచయిత: శ్రీకాంత్ విస్సా