18 పేజెస్ మూవీ రివ్యూ

Published On: December 24, 2022   |   Posted By:

18 పేజెస్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

సుకుమార్ కు కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ ప్రేమ కథలు అందించే దర్శకుడుగా పేరుంది. దాంతో ఆయన రైటింగ్ లో వచ్చిన 18పేజెస్‌ అనగానే ఓ విధమైన క్యూరియాసిటీ కలిగింది. ఈ కథ వెరీటీగా ఉంటుందని, అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయని ఈ ప్రేమకథ ప్రేక్షకులకు షాకివ్వడంతో పాటు సర్‌ప్రైజ్‌ చేస్తుందని నిఖిల్‌ ప్రమోషన్స్ లో చెప్పారు. నిఖిల్ మాటలు నిజమేనా సుకుమార్ ఈ సారి ఎంచుకున్న డిఫరెంట్ పాయింట్ ఏమిటి అసలు ఈ సినిమాకు 18 పేజీలు అని పెట్టడం వెనక కీలకం ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

చాలా సింపుల్ లైన్ ఇది యాప్స్ డవలప్ చేసే సిద్ధు( నిఖిల్) ఓ ఈ కాలం యూత్ కు ప్రతినిధి. ప్రీతీ అనే అమ్మాయిని ప్రేమలో ఉండి తర్వాత తాను మోసపోయానని తెలుసుకుంటాడు. ఆ బాధలో బ్రేకప్ లో పాటలు పాడుకుంటూండా అనుకోకుండా సిద్దుకు రోడ్డు పక్కన ఒక రోజు డైరీ దొరుకుతుంది. ఆసక్తిగా దాన్ని తిరగేస్తే అది నందిని (అనుపమ పరమేశ్వరన్‌) రాసింది అని తెలుస్తుంది. ఆ డైరీలోని ఒక్కోపేజీ చదువుకుంటూ వెళుతూ, ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అంతేకాదు ఆమె ప్రతి అలవాటునూ తనదిగా మార్చేసుకుంటాడు. రెండేళ్ళ క్రితం ఆ డైరీలో జరిగిన ఇన్సిడెంట్స్ ను ప్రస్తుత కాలానికి అన్వయించుకుంటూ ఇబ్బందిపడుతుంటాడు. అయితే 2019 నాటి ఆ డైరీలో 18 పేజీల తర్వాత ఆగిపోవటం చూసి అవాక్కవుతాడు నందినిని వెతుక్కుంటూ ఆమె గ్రామానికి బయిలుదేరతాడు.

అక్కడ రెండేళ్ళ క్రితం ఆమె హైదరాబాద్ లో యాక్సిడెంట్ లో చనిపోయిందని నాయనమ్మ చెప్తుంది. తాతగారిచ్చిన కవరు హైదరాబాద్ లో వెంకట్రావుకి అందజేయడానికి వెళ్ళి మరణించింది. దీంతో తన ప్రేమ బలంతో ఆమె బ్రతికే వుందని నమ్మిన సిద్ధార్థ్ ఆమెని వెతకడం ప్రారంభిస్తాడు. ఆమె చేసిన మంచి పనులను కొనసాగిస్తూ ముందుకు వెళ్తాడు ఆ క్రమంలో నందిని గురించి మరిన్ని విషయాలు రివీల్ అవుతాయి. అవేమిటి సిద్ధార్థ్‌ నమ్మినట్టు నందిని బ్రతికే ఉందా? బ్రతికి ఉంటే ఆమెను అతను కలిగాడా?ఆ డైరీలో అసలు ఏముంది? సిద్ధు నందినిని లైవ్ లో కలిసి ప్రపోజ్ చేసాడా? సిద్ధు ప్రేమ ఫలిచిందా ? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్

మొదటి నిఖిల్ క్యారక్టరే ఆశ్చర్యంగా ఉంటుంది ఈ జనరేషన్ యూత్ కోసం రిలేషన్ షిప్ యాప్ డెవలపర్ అతను  కానీ వేరే ఎవరో తెలియని వారి ఓ డైరీ దొరికితే అది చదివేస్తాడు రిలేషన్ షిప్ మర్యాదవదిలేసి అలాగే డైరీ చదివి ప్రేమలో పడిపోవడం కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది అతనేమీ భావుకుడు కాదు కదా.

ఇదేమీ తెలుగు తెరకు కొత్త కథ ఏమి కాదు ఒకరినొకరు చూసుకోకుండా లేఖల ద్వారానో ఇలా డైరీల ద్వారానో హీరో,హీరోయిన్స్ ప్రేమలో పడటం అనే సినిమాలు మనవాళ్లు చాలా చూసేసారు. తరుణ్, స్నేహ కాంబినేషన్ లో వచ్చిన ప్రియమైన నీకు లో కూడా ఇలా ఓ డైరీ హీరోకు దొరకటం అది చదివి హీరో ఆమె కోసం వెతకటం ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో అలాంటి కథలు ఎవరూ తెరకెక్కించటం లేదు అలాగే ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమలో పడటం అనే కాన్సెప్టు అప్పట్లో వచ్చిన అజిత్ ప్రేమలేఖలో సూపర్ హిట్. ఆ సినిమా లాంటి సున్నితమైన భావోద్వేగాలతో, అందమైన ప్రేమ కథ మళ్లీ రాలేదు. అయితే ఇంతకాలానికి మళ్లీ ఒకరినొకరు చూసుకోకుండా ఈ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా మనకు 2014 వచ్చిన ధాయ్ ఫిల్మ్ The Teacher s Diary గుర్తు చేస్తుంది ఆ సినిమాలో ఓ మారుమూల స్కూల్ కు టీచర్ గా వెళ్లిన హీరోకు అక్కడ ఓ డైరీ దొరుకుతుంది.

ఆ డైరీ అంతకు ముందు అక్కడ పనిచేసిన టీచర్ ది ఆ డైరీ చదివి ప్రేమలో పడిన అతను ఆమెను వెతుక్కుంటూ వెళ్లటం కథ దాదాపు ఈ సినిమా ఇలాంటిదే అంత గొప్ప సినిమా ని గుర్తు చేసే ఈ సినిమా కూడా అదే స్దాయిలో ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తాము అయితే ఆ స్దాయిలో ఉండదు. 2021/22 లో ఓ అమ్మాయి డైరీ చదివి ప్రేమలో పడటం అనేది ఎందుకనో నమ్మబుద్ది కాదు. అలాగే ఆ అమ్మాయి కూడా ఎంత సోషల్ మీడియాకు దూరంగా ఉండే అమ్మాయి అయినా మొబైల్ ఫోన్ కూడా లేకపోవటం కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ హీరోయిన్ పాత్రను ప్రేక్షకులు మెచ్చేలా ఓ కొత్త కోణంలో తెరపై చూపించిన తీరు అందులో ఇమిడ్చిన మలుపులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.

ఈ కథలో తను హైదరాబాద్ కు ఓ వెంకట్రావు అనే వ్యక్తిని కలవటానికి వస్తుంది అతను కోసం వెయిట్ చేస్తుంది. అంతేకానీ తన దగ్గర ఫోన్ లేకపోయినా వేరే వాళ్ల దగ్గర అయినా ఫోన్ తీసుకుని చెయ్యదు అలాంటి లాజిక్స్ ప్రక్కన పెడితే సినిమా బాగుందనిపిస్తుంది అయితే ఇందులో బ్యూటీగా అనిపించే ఎలిమెంట్ ఏమిటంటే హీరో మొదటి నుంచి టెక్నాలిజీకు ఎడిక్ట్ అయ్యిపోయి ఉంటాడు అతను చుట్టూ వాళ్లను కూడా ఆ మోజులో పడి పట్టించుకోడు. అయితే హీరోయిన్ డైరీ చదివి ప్రేమలో పడ్డాక అతనిలో మెల్లిగా మార్పు రావటం ,చివరకు ఓ కొత్త మనిషిగా మారటం ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది ఇప్పుడు యూత్ చాలా మంది టెక్నాలిజీ ప్రేమికులు బానిసలు. ఇలాంటి వారిని కొంతవరకూ ఆలోచనలో పడేస్తుంది ఈ చిత్రం. అక్కడదాకా ఈ సినిమా గొప్పదే అయితే నేరేషన్ లో ఓ లవ్ స్టోరీగా మొదలై థ్రిల్లర్ గా ముగియటం మాత్రం ఇబ్బంది కరం.

టెక్నికల్ గా

ట్రీట్మెంట్ ప్రక్కన పెడితే స్టోరీ లైన్ దాగా ఇంట్రస్టింగ్ ఈ చిత్రం కొత్త పాయింట్ తో మొదలవుతుంది హీరోయిన్ నందిని డైరీ చదవడం ప్రారంభించాకే కథలోకి పరుగు మొదలవుతుంది. అలాగే నందిని క్యారక్టర్ ని ఇంట్రస్టింగ్ గా తీర్చిదిద్దారు ఈ రోజుల్లో అలా బ్రతకటం కష్టమే కానీ బావుండని పిస్తుంది. అయితే ఈ క్రమంలో కొన్ని చోట్ల మనకు మెసేజ్ ఇచ్చినట్లు అనిపిస్తుంది ఇక ఇలాంటి ఫీల్ గుడ్ కథలకు సంగీతం ప్రాణం ఈ క్రమంలో గోపీసుందర్ పాటలు, బీజీఎం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్‌ సుకుమార్ కథకు న్యాయం చేశాడనే చెప్పాలి. డైలాగులు అక్కడక్కడా బాగున్నాయి. వసంత్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నాయి. జీఏ2 పిక్చర్స్, సుకుమార్‌ రైటింగ్స్ బ్యానర్స్ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

నటీనటుల్లో

నిఖిల్ లవర్ బాయ్ గా ఈ కాలం యూత్ కి ప్రతినిధిగా స్టయిలీష్ గా కనిపించాడు. అనుపమ పరమేశ్వరన్ కి భావుకత్వంతో సాగే పాత్ర దొరికింది. సరయు తెలంగాణ యాసలో బాగుంది. పోసాని కృష్ణమురళి, డాక్టర్‌ సందీప్‌గా దినేశ్ తేజ్, కండక్టర్‌ పాత్రలో రమణ, విలన్‌ పాత్రలో అజయ్ పాత్రలకు న్యాయం చేశారు.

నచ్చినవి

సుకుమార్ బ్రాండింగ్
లీడ్ పెయిర్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నచ్చనవి

స్క్రీన్ ప్లే నేరేషన్ .
క్లైమాక్స్ ని బాగా లాగటం
సాగిన సెకండాఫ్

చూడచ్చా

కొత్త తరహా లవ్ స్టోరీలు ఇష్టపడేవారు ఓ లుక్కేయచ్చు. అయితే సుకుమార్ కథ ఇచ్చాడని ఎక్కువ ఎక్సపెక్ట్ చేస్తే మాత్రం అంత అనిపించదు.

నటీనటులు:

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, సరయు, అజయ్, దినేష్‌ తేజ్, పోసాని కృష్ణమురళి, శత్రు.

సాంకేతికవర్గం :

కూర్పు: నవీన్‌ నూలి;
సంగీతం: గోపీ సుందర్‌;
ఛాయాగ్రహణం: ఎ.వసంత్‌;
కథ: సుకుమార్‌;
దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్‌;
నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌;
రన్ టైమ్ : 137 మినిట్స్
విడుదల తేదీ: 23-12-2022.