200 Cr+ గ్రాస్ వసూలు చేసిన హనుమాన్ మూవీ

Published On: January 23, 2024   |   Posted By:

200 Cr+ గ్రాస్ వసూలు చేసిన హనుమాన్ మూవీ

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హనుమాన్ అన్ని ప్రాంతాలలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూనే వుంది. ఈ చిత్రం గ్రాండ్ గా సెకండ్ వీకెండ్ రన్ ని పూర్తి చేసుకొని 200 కోట్ల క్లబ్‌లో చేరింది.

ఆడియన్స్ అంచనాలని మించిన ఈ చిత్రం ప్రతిరోజూ మంచి నెంబర్స్ తో బలమైన పట్టును సాధిస్తోంది. ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఈ చిత్రం ఐదో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో హయ్యస్ట్ గ్రాస్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

లిమిటెడ్ రిలీజ్, మినిమమ్ టికెట్ ప్రైస్ అయినప్పటికీ, హనుమాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నార్త్ లో కూడా అద్భుతంగా దూసుకుపోతోంది.

ట్రేడ్ విశ్లేషకులు, ట్రెండ్ ప్రకారం హనుమాన్ జోరు ఇంకా బలంగా వుండబోతుంది.