2018 సినిమా థాంక్స్ మీట్ 

Published On: June 2, 2023   |   Posted By:

2018 సినిమా థాంక్స్ మీట్ 

2018 సినిమా కి తెలుగులో ఇన్ని కోట్లు కలెక్షన్స్ ఎవరు ఊహించలేదు

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సెన్సేనల్‌  హిట్ కొట్టి సూపర్ కలెక్షన్‌లు సాధిస్తున్న సినిమా 2018. మే 5న మలయాళంలో రిలీజై అక్కడ రూ.150 కోట్ల మార్క్‌ టచ్‌ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఇక గతవారం తెలుగులో విడుదలై ఇక్కడ కూడా భారీ కలెక్షన్‌లు సాధిస్తుంది.  సుమారుగా 6 కోట్ల మార్క్‌ టచ్‌ చేసింది  ఈ సినిమా ప్రస్తుతం లాభాల్లో ఉంది.  2018 లో కేరళ ని ముంచెత్తిన భీకర వరదల్ని, ఆ వరదల్లో బాధితులు ప్రాణాల కోసం వాళ్ళు చేసిన పోరాటాల్నీ ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించాడు.  ఈ సినిమా  సూపర్ హిట్స్ టాక్ తో సునామీలా దూసుకుని పోతుంది కొన్ని సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు అవి వారితో పాటు తీసుకుని వెళ్ళే అనుభూతిని అందిస్థాయి. ఈ 2018 మూవీ కూడా ఆడియన్స్ కి అటువంటి అనుభూతిని అందిస్తుంది.  దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ హృద్యమైన కథని తీసుకున్నారు.  ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో పాటు హార్ట్ టచింగ్ సీన్స్, యాక్టర్స్ పెరఫార్మన్సెస్ ప్రతి ఒక్కరినీ సినిమాని ఆకర్షిస్తుంది. టోవినో థామస్ మరొక్కసారి ఈ సినిమాలో తన పాత్రలో జీవించాడు అని చెప్పొచ్చు.

తెలుగు ఆడియన్స్ కి తెలుగు మీడియా థాంక్స్ చెపుతూ థాంక్స్ మీట్ లో అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ   నేను ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక తుఫాన్ లో ఉన్నట్టు ఉంది ఈ సినిమాలో ఫైట్లు లేవు డాన్సులు లేవు ఓన్లీ ఉద్వేగం ఉంది సినిమా చూడాలి అనుకున్నా వారు థియేటర్లోనే చూడండి లేదు అంటే  ఆ ఫీల్ మిస్ అవుతారు

చందూ మొండేటి మాట్లాడుతూ ఈ సినిమా చూశాక చాలా కాలం తర్వాత తప్పట్లు కొట్టా ఫస్ట్ టైం వర్షం మీద కోపం వచ్చింది ఈ సినిమా అంతా ఒక ఉద్వేగంతో నడుస్తుంది  ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసి ఆడియన్స్ కు థాంక్స్ .

బన్నీ వాసు మాట్లాడుతూ నేను ఇలాంటి విభిన్నమైన సినిమాలు తీసుకురావడానికి కారణం అరవింద్ గారు ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎక్కడలేని గౌరవం పెరిగింది  సినిమాని బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ఆడియో థాంక్స్.

నటీనటులు: టోవినో థామస్, లాల్, నరైన్, అపర్ణ బాలమురళి, కళైరసన్, అజు వర్గీస్, వినీత్ శ్రీనివాసన్, కుంచాకో బోబన్ తదితరులు

దర్శకులు : జూడ్ ఆంథనీ జోసెఫ్

నిర్మాతలు: వేణు కున్నప్పిల్లి, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్

సంగీత దర్శకులు: నోబిన్ పాల్

సినిమాటోగ్రఫీ: అఖిల్ జార్జ్

ఎడిటర్: చమన్ చక్కో