కల్కి మూవీ రివ్యూ

Published On: June 28, 2019   |   Posted By:
కల్కి మూవీ రివ్యూ
 
‘అ!’ …అనిపించలేదు (‘కల్కి’ మూవీ రివ్యూ)
 
Rating: 2  
 
 ‘అ!’ సినిమాతో ఒక్కసారిగా  ఓ మంచి టెక్నీషియన్స్, స్క్రీన్ ప్లే ప్రధానంగా సినిమా తీయగల నేర్పరి దొరికాడని దర్శకుడు ప్రశాంత్ వర్మని మెచ్చుకున్నారు. దాంతో ఆయన రెండో చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. దానికి తోడు యంగ్ హీరోతో సినిమా చేస్తాడనుకుంటే సీనియర్ హీరోతో సినిమా మొదలెట్టిన ఆయన్ను చూసి ఆశ్చర్యపోయారు. ట్రైలర్స్, టీజర్స్ వచ్చాక సినిమాపై అంచనాలు ఏర్పడుచుకున్నారు. రాజశేఖర్ సినిమాకు కూడా ట్రేడ్ లో క్రేజ్ ఏర్పడింది. మరి తనపై ప్రేక్షకుల పెట్టుకున్న  ఎక్సపెక్టేషన్స్ ని ప్రశాంత్ వర్మ రీచ్ అయ్యారా. సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన గరుడవేగ చిత్రం రాజశేఖర్ కు మళ్లీ హీరోగా ఆశలు రేకెత్తించింది. వాటిని ఈ సినిమా కంటిన్యూ చేసిందా..అసలు ఈ కల్కి కథేంటి…ఈ కల్కి వచ్చి ఎవరిని,  ఏం చేస్తాడు, పురణాల్లో చెప్పబడ్డ కల్కికి, ఈ రాజశేఖర్ కల్కికి ఏమన్నా సంభందం ఉందా వంటి విషయాలు రివ్యూలో పరిశీలిద్దాం.

స్టోరీలైన్

అది 1983. కల్కి (రాజశేఖర్) ఓ స్ట్రిక్ట్  ఐపీఎస్ ఆఫీసర్.  ఆయన దగ్గరకు కొల్లాపూర్ లో ని ఓ మర్డర్ కేసు వస్తుంది. శేఖర్ బాబు (సిద్దు జొన్నలగడ్డ) అనే అతను చాలా దారుణంగా చెట్టుకి కట్టేసి కాల్చి చంపేయబడతారు. ఆ కేసుని ఇన్విస్టిగేట్ చేస్తున్న కల్కికి చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. అసలు ఈ శేఖర్ బాబు ఎవరు..అతన్ని ఎవరు చంపారనేది తేలుద్దామనుకుంటే కొత్త విషయాలు తెరపైకి వచ్చి షాక్ ఇస్తాయి. అసలు కొల్లాపూర్ లో ఏం జరిగింది. శేఖర్ బాబు ఎవరు…అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది. ఈ కేసు విచారణలో కల్కి ఎదుర్కొన్న  సమస్యలు ఏమిటి..వాటిని ఎలా అధిగమించాడు. చివరకి తేలిందేమిటి వంటి విషయాల సమాహారమే ఈ సినిమా. (సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఇంతకు మించి ప్లాట్ ని రివీల్ చేయలేం)
 
స్క్రీన్ ప్లే ఎలా ఉంది
 
 ‘అ!’ సినిమాకు  విభిన్నమైన స్క్రీన్ ప్లే రాసి అందరినీ తన వైపు కు తిప్పుకున్న దర్శకుడునుంచి వస్తున్న రెండో చిత్రం కావటంతో సినిమా ప్రేమికుల దృష్టి ఈ సినిమాపై ఉంది. దానికి తోడు ఇది ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ అని ప్రచారం చేయటంలో థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారు ఈ సినిమాకు వెళ్లారు. వారిని ఏ మాత్రం తన స్క్రీన్ ప్లే తో మాయ చేసాడు అంటే … ‘అ!’ సినిమానాటి మ్యాజిక్ ని రిపీట్ చేయలకపోయాడనే చెప్పాలి.

కాకపోతే  ‘అ!’ సినిమాలో లాగానే చివరి ఇరవై నిముషాలు పాటు వరస ట్విస్ట్ లతో నింపేసి ఆశ్చర్యపరిచే ప్రయత్నం చేసాడు. అయితే ప్రతీ సారి అదే మ్యాజిక్ జరగటం కష్టం. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలు మొదటి నుంచీ ఎంగేజ్ చేయాలి..అంతేకాని చివర్లో ఎక్కడో ట్విస్ట్ లు ఇస్తాను అంటే అంతసేపు ఎదురుచూడటం కష్టం. అదే జరిగింది ఈ సినిమాకు. రాజశేఖర్ సినిమా అంటే బి,సి సెంటర్లలలో మంచి మార్కెట్ ఉంటుంది. స్క్రీన్ ప్లే తో అదరకొడదాం అని ఆ మార్కెట్ కు అందకుండా ఈ సినిమాని డిజైన్ చేసారు దర్శకుడు. కేవలం మల్టిప్లెక్స్, ఎ సెంటర్లకు ఈ సినిమా పరిమితమయ్యేలా చేసారు. అయితే మళ్లీ ఏమనుకున్నరో ఏమో ఓ ఐటం సాంగ్ ని మధ్యలో ఇరికించారు. అయితే మల్లిఫ్లెక్స్ లు, ఎ సెంటర్లలలో జనం కు,రాజశేఖర్ కు గ్యాప్ వచ్చి చాలా కాలం అయ్యిందని మర్చిపోయారు. ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తీర్చిదిద్దితే ..మంచి రెస్పాన్స్ వచ్చేది.

దర్శకత్వం ఎలా ఉందంటే

దర్శకుడుగా ప్రశాంత్ వర్మ వంద శాతం తనదైన మేకింగ్ స్టైల్ తో మెచ్చుకునేలా చేసారు.  అయితే స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డారు. ఫస్టాఫ్ లో కథ ఏమీ పెట్టుకోకుండా కేవలం సెటప్ సీన్స్ తో నింపేసి ఇంటర్వెల్ దగ్గర చిన్న ట్విస్ట్ ఇచ్చుకుని సెకండాఫ్ కు వెళ్లిపోయారు. అక్కడైనా ఏమన్నా అద్బుతం చేసారా అంటే అక్కడా అదే పరిస్దితి చాలా స్లో నేరేషన్ తో సినిమాని డ్రాగ్ చేసుకుంటూ వెళ్లి క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ లు ట్విస్ట్ లతో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేసారు. దాంతో సినిమా చాలా సేపు కథలో ఏమీ జరగక బోర్ వచ్చేసింది. ఫస్టాఫ్ లో ఏమీ జరగకపోవటంతో సెకండాఫ్ లో కథ మొత్తం చెప్పాల్సి వచ్చి హర్రీ బర్రీగా మారింది.

సాంకేతికంగా

సినిమా నిర్మాత సి కళ్యాణ్ రెగ్యులర్ గా తీసే మూవీస్ లాగ  లేకుండా రిచ్ గా ఉంది. దాశ‌ర‌థి శివేంద్ర కెమెరా వర్క్ బాగుంది. సంగీత ద‌ర్శకుడు శరవణన్‌ భ‌ర‌ద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది.  ఎడిటింగ్ లో సాగతీత తగ్గిస్తే మరింత నీటుగా ఉండేది.  నటీనటుల్లో రాజశేఖర్ ఫెరఫెర్మాన్స్ కు మంచి మార్కులు పడతాయి.

 రాహుల్ రామ‌కృష్ణ  కామెడీ కొన్ని చోట్ల విసుగెత్తించింది. అదాశ‌ర్మ కు సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఉన్న పాత్ర కాదు. నందితా శ్వేత పాత్ర క‌థ‌లో కీల‌కంమే కానీ ఆమెదీ లెంగ్త్ తక్కువే. అశుతోష్ రాణా, శ‌త్రులు కు ఇలాంటి పాత్రలు ఎన్నో చేసి ఉన్నారు. పెద్ద  వేరియేషన్ లేదు. సిద్ధు జొన్నలగడ్డ పాత్ర‌, ఆయ‌న నటన మెప్పిస్తాయి.  
 

చూడచ్చా

థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకి ఈ సినిమా మంచి కంపెనీ ఇస్తుంది



———–
ఎవరెవరు


నటీనటులు: రాజశేఖర్‌, అదా శర్మ, నందితా శ్వేత, నాజర్‌, అశుతోష్‌ రాణా, శత్రు, సిద్ధు జొన్నల‌గ‌డ్డ, రాహుల్ రామ‌కృష్ణ, చరణ్‌ దీప్‌, పూజిత పొన్నాడ తదితరులు

సంగీతం: శరవణన్‌ భరద్వాజ్‌

కూర్పు: గౌతమ్‌ నేరుసు

సినిమాటోగ్రఫీ: దాశ‌ర‌థి శివేంద్ర

సమర్పణ: శివానీ, శివాత్మిక ఫిలింస్‌

నిర్మాత: సి. కల్యాణ్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రశాంత్‌ వర్మ

విడుదల తేదీ: 28-06-2019