లాభం మూవీ రివ్యూ

Published On: September 9, 2021   |   Posted By:

లాభం మూవీ రివ్యూ

Vijay Sethupathi Laabam Telugu First Look Poster

చూసినోడికి మాత్రం నష్టమే:’లాభం’ రివ్యూ

Rating:1.5/5

‘మాస్టర్’ డబ్బింగ్ ద్వారా .. ‘ఉప్పెన’ సినిమా ద్వారా తెలుగులో క్రేజ్ పెంచుకున్న విజయ్ సేతుపతికి తెలుగులో సెపరేట్ ప్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దాంతో ఆయన నటించిన సినిమాలకు ఇక్కడ మార్కెట్ క్రియేట్ అయ్యింది. కానీ ఆయన సోలో హీరోగా నటించిన సినిమాలు ఏమీ ఇక్కడ ఆడలేదు. విలన్ గానో, సూపర్ డీలక్స్ లాంటి సినిమాలో చేసినట్లు డిఫరెంట్ పాత్రో చేస్తేనే కలిసొస్తోంది. తాజాగా ఆయన నటించిన తమళ చిత్రాన్ని’లాభం’ టైటిల్ తో థియోటర్ లో రిలీజ్ చేసారు. ఒకేసారి తమిళ .. తెలుగు భాషల్లో విడుదలవుతున్న విజయ్ సేతుపతి ఫస్టుమూవీ ఇదేనని చెప్తున్నాన్నారు దానికి తోడు తెలుగులో పాపులర్ అయిన జగపతిబాబు, శృతిహాసన్, సాయిధన్సిక   ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషించటం కోసం కూడా కలిసొచ్చింది. ఇవన్నీ ఈ సినిమాకు ప్లస్ లు అయ్యాయా…అసలు కథేంటి…విజయ్ సేతుపతి నిర్మాతగా చేసేటంత వైపిధ్యమైన పాయింట్ సినిమాలో ఏముందో చూద్దాం.

స్టోరీ లైన్

 వీరభ‌ద్ర అలియాస్ బద్రి(విజ‌య్ సేతుప‌తి) గత ఆరేళ్లుగా తన సొంతూరు పండూరు ని విడిచిపెట్టాడు. ఇన్నాళ్లకు మళ్లీ ఊళ్లకి రావటంతో జనం ఆశ్చర్యపోతారు. అప్పటికి ఆ ఉరి పరిస్దితి దారుణంగా ఉంటుంది. చాలా మంది వ్యవసాయం చేయలేక ఊరు వదిలి వెళ్పిపోతూంటారు. ఈ సిట్యువేషన్ చూసి బాధపడ్డ బద్రి తనకు  కొత్త మెళకవులు తెలుసని..వాటితో లాభసాటిగా వ్యవసాయాన్ని మార్చవచ్చని చెప్తాడు. నమ్మిన కొందరు బద్రి వెనక నిలబడతారు. ఉమ్మడి వ్యవసాయం మొదలెడతారు. ఇక అదే ఊరిలో రైతు సంఘం  ప్రెసిడెంట్‌ నాగ‌భూష‌ణం(జ‌గ‌ప‌తిబాబు)కు ఇవేమీ గిట్టవు. బద్రిని దెబ్బకొట్టడానికి ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ లో తెలియక ఇరుక్కుంటాడు బద్రి. పోలీస్ లు వెంటబడతాడు. ఇంతకీ నాగభూషణం వేసిన ప్లాన్ ఏమిటి..బద్రి ఆ పన్నాగం నుంచి ఎలా తప్పించుకున్నాడు. బద్రి ఆరేళ్ల పాటు తన ఊరుని వదిలి ఎక్కడికి వెళ్లాడు.ఎందుకు వెళ్లాడు. ఇందులో శృతి హాసన్ పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్…

ఈ సినిమా ప్రధానోద్దేశ్యం పెట్టుబడి దారి వ్యవస్దకి వ్యతిరేకంగా పోరాడం. క్యాప్టిలిజంకు ప్రతీకగా జగపతిబాబు పాత్రను డిజైన్ చేసారు. అయితే ఆ పాత్ర ఓ కేరికేచర్ లా కార్టూన్ లా తేలిపోయింది. అలాగే అతని ప్లాన్స్ అన్ని డైలాగు ఓరియెంటెడ్ గా ఉంటాయి. ఎక్కడ చర్యలకు దిగవు. ఇవన్నీ మనకు క్యారక్టర్ గ్రాఫ్ ని పడేలా చేసాయి. దాంతో వీకైన విలన్ ని ఎదుర్కొనే మరింత వీక్ గా ఉన్న హీరో కథలా సినిమా మారింది. ఇక శృతిహాస‌న్ క్యారక్టర్ అయితే ఎందుకు పెట్టారా అనిపిస్తుంది.  సెకండాఫ్ మ‌ధ్య‌లో ఆమె పాత్ర‌ను అర్దాంతరంగా క‌ట్ చేసేశారు.స్క్రీన్ ప్లే చూస్తే చాలా ప్యాసివ్ గా రన్ అవుతుంది. దాంతో మనకు అడుగు అడుగుకి బోర్ కొడుతుంది.  ఇక డైరక్టర్ దగ్గర చాలా విషయం ఉంది. దాన్ని తెరపై సీన్స్ లా మలచాలనే విశ్వ ప్రయత్నం చేసారు. తప్పించి కథకు ఎంతవరకూ అవసరమో వాటినే ప్రెజెంట్ చేద్దామనే ఆలోచన ఎక్కడా స్క్రిప్టులో కనపడదు.
దానికి తోడు ఇనాం భూముల వెన‌క చ‌రిత్ర‌, రైతులు ఇంకా పేద‌వాళ్లుగా మిగిలిపోవ‌డానికి కార‌ణాల్ని  ఓ ఇన్ఫర్మేషన్ లా చెప్ప‌డం సినిమాకి అంత‌గా కలవలేదు. కథలో స్క్రీన్ ప్లే ఎంత దారుణం ఉంటుందంటే హీరో …చుట్టూ చాలా సమస్యలు ఉంటుంది. ఒక స‌మ‌స్య నుంచి మ‌రో స‌మ‌స్య‌కి ప్రయాణం చేస్తూ ఉంటాడు . పాత్ర‌లు కూడా ఉన్నట్లుంది, ఆది అంతం లేకుండా మాయ‌మ‌వుతుంటాయి. క్లైమాక్స్ సీన్స్ అయితే పూర్తిగా తేలిపోయాయి. డ‌బ్బింగ్‌లో కూడా సరిగ్గా కుదరలేదు. సబ్ టైటిల్స్ తో తమిళ సినిమాని చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఏదైమైనా ఈ సినిమా  లేజీ రైటింగ్ తో విసుగెత్తిస్తుంది.

టెక్నికల్ గా …

విజయ్ సేతపతి ప్రధాన పాత్ర కావటంత  ప్రత్యేక శ్రద్ద పెట్టి టెక్నీషియన్స్ అందరూ పెద్ద వాళ్లను తీసుకున్నారు. దాంతో   కెమెరా కుదిరినట్లుగా మిగతా విభాగాలు కుదరలేదు. ఇమాన్ ఇచ్చిన మ్యూజిక్ కానీ దారుణం అని పిస్తాయి. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే… సినిమాని చాలా మేర ట్రిమ్ చేయచ్చు అని ప్రతీ సారి అనిపిస్తూనే ఉంటుంది.  డైరక్టర్ ఎస్పీ జననాథన్ అయితే తాను ఎంచుకున్న పాయింట్ మంచిదే కానీ ప్రెజెంటేషన్ బాగోలేదు. నటీనటుల్లో   ‘లాభం’ చిత్రం లో ఒక్క సేతుపతిని తప్ప మిగతావారు ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్లు లేరు.

చూడచ్చా
మరీ ఎంత ఖాళీగా ఉన్నా ఇలాంటి సినిమాలకు దూరంగా ఉండటం మేలు.

తెర వెనుక..ముందు
నటీనటులు: విజయ్‌ సేతుపతి, శ్రుతిహాసన్‌, జగపతిబాబు, సాయి ధన్సికా, రమేశ్‌ తిలక్‌, కలైరసన్‌ తదితరులు;
 సంగీతం: డి ఇమాన్‌;
సినిమాటోగ్రఫీ: రామ్‌జీ;
ఎడిటింగ్‌: ఎన్‌.గణేశ్‌ కుమార్‌, ఎస్పీ అహ్మద్‌;
నిర్మాత: పి. ఆర్ముగం కుమార్‌, విజయ్‌ సేతుపతి;
దర్శకత్వం: ఎస్‌.పి.జననాథ్‌;
రన్ టైమ్: 2గం|| 23ని||
 విడుదల: 09-09-2021