ఉగ్రం మూవీ రివ్యూ

Published On: May 5, 2023   |   Posted By:

ఉగ్రం మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

నాంది లాంటి సూపర్ హిట్ తర్వాత అల్లరి నరేష్‌‌, విజయ్‌‌ కనకమేడల కాంబినేషన్‌‌లో వస్తున్న రెండో చిత్రం ఉగ్రం. మిర్నా మీనన్ హీరోయిన్. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ రోజు రిలీజైన ఈ సినిమా కంటెంట్ పరంగా స్ట్రాంగ్ గా కనిపించినా, ఎమోషనల్ గా కన్వీన్స్ చేయలేకపోయింది. ముఖ్యంగా యాక్షన్ సినిమా కాస్తా థ్రిల్లర్ గా మారటంతెలుగులో రీసెంట్ గా వచ్చిన యశోదను గుర్తు చేయటం కొంచెం ఇప్పందిగా మారింది. ఈ క్రమంలో ఈ చిత్రం అసలు కథేంటి.సినిమా చూడదగ్గదేనా. నరేష్ కు మరో నాంది అవుతుందా వంటి విషయాలు చూద్దాం.

కథాంశం :

శివ (అల్లరి నరేష్) జెన్యూన్ గా ఉండే పోలీస్. ఎంత నిజాయితీగా ఉంటాడంటే. భార్యా పిల్లల కంటే కూడా తన డ్యూటీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. అయితే తను ఎగ్రిసివ్ గా తీసుకునే కొన్ని డెసిషన్స్ ,చేసే కొన్ని యాక్షన్స్ వల్ల కుటుంబానికి ఇబ్బందులు వస్తూంటాయి. ఈ క్రమంలో ఓ రోజు ఫ్యామిలీతో గొడవపడి ఆమె పుట్టింట్లో దింపుదామని బయిలుదేరిన సమయంలో యాక్సిడెంట్ అవుతుంది. స్పృహ కోల్పోయి లేచి చూసే సరికి అతని భార్యఅపర్ణ (మిర్నా)కూతురు మిస్సవుతుంది. వాళ్లు ఏమైయ్యారో ఎవరైనా కిడ్నాప్ చేసారో అర్దం కాదు. ఆ క్రమంలో అతను ఎలా రియాక్ట్ అవుతాడు. తన కుటుంబాన్ని ఎలా సేవ్ చేసుకున్నాడుచివరకు వాళ్లను చేరుకున్నాడుఫైనల్ గా ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్  :

సస్పెన్స్ థ్రిల్లర్లు, సైకో డ్రామాలు ఓ వర్గానికి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే వాటిని నడిపించే విధానం,స్క్రీన్ ప్లే మాత్రం ఒకేలా ఉంటుంది. ముఖ్యంగా థ్రిల్లర్ జానర్‌ల కథలు కొత్తగా ఏమీ ఉండవు. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కథను రాసుకుంటే మాత్రం అందరినీ ఆకట్టుకోవచ్చు. అయితే దాన్ని దాటటానికి ఈ దర్శకుడు ఫస్టాఫ్ మొత్తం వేరే కథతో నింపేసాడు. సెకండాఫ్ లో కథలోకి వచ్చాడు. దాంతో ఫస్టాఫ్ లో ఏమీ జరిగినట్లు అనిపించదు. ఏవో యాక్షన్ ఎపిసోడ్స్ వస్తూంటాయిపోతూంటాయి కానీ కథకు ఏ మాత్రం సంభందం ఉండదు. అయితే సెకండాఫ్ లో కథ చెప్పే ప్రాసెస్ లో ఈ ప్రయత్నంలో కొంతవరకూ మాత్రమే సఫలమయ్యాడు. సాధారణంగా ప్రథమార్థంలో వచ్చే ప్రశ్నలకు ద్వితీయార్థంలో సమాధానం ఇచ్చినట్టుగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అందుకే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మెరుగ్గా ఉంది. అయితే ఇక్కడ ఇంటర్వెల్ లో మిస్సైన భార్యా పిల్లలను వెతికే ప్రాసెస్ ని సెకండాఫ్ లో నింపేసారు. అసలు విలన్ ఎవరో సినిమా చివరకు కానీ తెలియదు. దాంతో చివరకు ముగింపు కాస్త భారంగా అనిపిస్తుంది. ఎమోషనల్ క్లైమాక్స్‌తో ముగించాలని ప్రయత్నించారు కానీ అది రీసెంట్ గా వచ్చిన సమంత యశోదను గుర్తు చేయటం ఇబ్బంది పెట్టింది. అలాగే మళయాళ సినిమా జోసెఫ్ ని కూడా ఈ సినిమా చాలా వరకూ తీసుకుంది.

టెక్నికల్ గా :

ఇది చాలా చిన్న స్టోరీ లైన్. దాన్ని డవలప్ మెంట్ సరిగ్గా లేకపోవటంతో డైరక్టర్ ప్రయత్నం చాలా వరకూ వృధా అయ్యింది. కథకు కావాల్సిన ఇంటెన్సిటీ, ఎమోషన్ వర్కవుట్ కాలేదు. డైరక్టర్ విజయ్ తన బలాలని సెకండాఫ్ ఫైట్స్ డిజైన్ లో, ఎమోషన్స్ లో ప్రదర్శించారు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల బాగానే వర్కవుట అయ్యింది. అయితే కథలోని ఇన్వెస్టిగేటివ్‌ పార్ట్‌ తేలిపోయింది. అయితే ఫైట్స్ మాత్రం చాలా చక్కగా తీర్చిదిద్దారు. శ్రీచరణ్‌ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సిద్ధార్థ్‌ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

నటీనటుల్లో :

సీరియస్‌ పోలీస్‌ శివ గా నరేష్‌ అదరకొట్టారు. ఆ కామెడీలు చేసే హీరోయేనా ఇతను అనిపించేలా లీనమయ్యారు. ఫైట్స్ లో కొత్తగా ఉన్నాడు. క్లైమాక్స్ లో నరేష్ లోని నటుడు పూర్తిగా బయిటకు వచ్చి ఉగ్ర రూపాన్ని ప్రదర్శించాడు. అపర్ణ పాత్రలో మిర్నా జస్ట్ ఓకే. శత్రు, ఇంద్రజ, శరత్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.

ప్లస్ లు :

నరేష్ ఫెరఫార్మెన్స్
సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ బ్లాక్ లు
క్లైమాక్స్ సీన్స్

మైనస్ లు :

సినిమాలో రిలీఫ్ ఎక్కడా లేదు
బోర్ కొట్టించే లవ్‌ ట్రాక్‌
విసుగెత్తించే స్క్రీన్‌ప్లే

చూడచ్చా :

యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారుకి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది.

నటీనటులు :

అల్లరి నరేష్, మిర్నా మీనన్, ఇంద్రజ, శత్రు తదితరులు

సాంకేతికవర్గం :

కథ : తూము వెంకట్
మాటలు : అబ్బూరి రవి
ఛాయాగ్రహణం : జె. సిద్ధార్థ్
సంగీతం : శ్రీచరణ్ పాకాల
రన్ టైమ్ : 148 నిమిషాలు
నిర్మాతలు : సాహూ గార్లపాటి, సురేష్ పెద్ది
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : విజయ్ కనకమేడల
విడుదల తేదీ: 5 మే 2023