పరేషాన్ మూవీ రివ్యూ

Published On: June 2, 2023   |   Posted By:

పరేషాన్ మూవీ రివ్యూ

Image

తిరువీర్  పరేషాన్ రివ్యూ
Emotional Engagement Emoji

తెలంగాణ నేఫద్యంలో లో ఈరోజు విడుదలైన చిత్రం పరేషాన్. టక్ జగదీష్ మరియు మాసూద ఫేమ్ తిరువూర్ హీరో గా నటించిన ఈ సినిమాకి రోనాల్డ్ రూపక్ సన్ దర్శకత్వం వహించగా , ప్రముఖ హీరో రానా నిర్మాతగా వ్యవహరించటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది. టీజర్ మరియు ట్రైలర్ తో ఆకట్టుకోవటంతో థియోటర్స్ దగ్గర జనం ఓ మోస్తరుగా ఎండలను తట్టుకుని మరీ పోగయ్యారు. అందులోనూ ఈ మధ్యంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఫిదా, జాతిరత్నాలు, బలగం, దసరా మరియు మేము ఫేమస్ వంటి చిత్రాలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా పూర్తి తెలంగాణా సినిమానే. మరి ఈ సినిమా కూడా అదే స్దాయిలో సూపర్ హిట్ అవుతుందా లేక ఓటిటి సినిమాగా ముందుకు వెళ్తుందా చూద్దాం.

కథేందిరా భయ్ అంటే :

క్రైస్తవ మతానికి చెందిన సింగరేణి ఉద్యోగి సమర్పణ్ (మురళీధర్ గౌడ్). ఆయన కొడుకు ఐజాక్ (తిరువీర్) ఓ మాదిరి ఏంటి కాస్త ఎక్కవే బేవార్స్ ఎప్పుడు దోస్తులతో ఏదో వంకపెట్టి దావత్ అంటూ తిరుగుతూ ఐటిఐ కూడా ఫెయిల్ అవుతాడు. వీడు వాలకం చూస్తూంటే మిగిలిపోయేటట్లు ఉన్నాడని, ఎట్లైనా సెట్ చేయాలని తల్లి,తండ్రి ఫిక్స్ అవుతారు. అందులోభాగంగా మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిది ఏర్పాటు చేస్తారు. తన ఉద్యోగం కొడుక్కి ఉద్యోగం రావాలంటే డబ్బులు కట్టాలని (లంచం ఇవ్వాలని) పెళ్ళాం చేతి బంగారు గాజులు అమ్ముతాడు. అవి పట్టుకెళ్లి కొడుకు చేతిలో పెడతాడు సమర్పణ్. కొడుకు తక్కువవాడా దోస్తులకు అవసరం వచ్చిందని ఆ డబ్బంతా వాళ్ళకు సమర్పిస్తాడు. ఇక్కడితో అయ్యేనా ఈ మధ్యలో శిరీష (పావని కరణం) అనే పోరితో ప్రేమ మాటలు, నైట్ సయ్యాటలుఆఖరకు ఆమెకు వాంతులు. నానా రచ్చ. పోనీ పట్నం పోయి దాని సంగతి చూద్దామంటే ఐజాక్ కాడ పైసల్లేవ్. దోస్తులను అడిగితే మొండి చెయ్యి చూపెడతారు. స్నేహితులకు ఇచ్చిన డబ్బులు రాక, అదే సమయంలో ప్రేయసి ప్రెగ్నెన్సీ టెన్షన్‌ వీటిని ఐజాక్‌ ఎలా డీల్‌ చేశాడు? ఆ తర్వాత ఐజాక్ ఏం చేసిండు ఆని తండ్రి సమర్పణ్ కొడుకును ఏం చేశాడు? ఫైనల్ గా ఈన కథ ఎట్లా ముగిసింది? అనేది కథ.

విశ్లేషణ :

సినిమా అంటే ఇలాగే ఉండాలాదాన్ని బ్రేక్ చేయలేమా అని కొబ్బరి మట్ట దర్శకుడు రూపక్ రోనాల్డ్సన్ అనిపించినట్లుంది. తను చూసిన లేదా విన్న కొన్ని సంఘటనలను కాగితంపై రాసుకుని తెర కెక్కించాడు. దీనివల్ల జరిగింది ఏమిటి అంటే సినిమాటెక్ గా కాకుండా కొన్ని జెన్యూన్ నవ్వులు తెరకెక్కాయి. అక్కడ దాకా హ్యాపీ. అయితే ఈ కథకు ఓ బిగిల్,మిడిల్, ఎండ్ అని ఆశించకపోతే ఇంకా హ్యాపీ. అలాగే సినిమాలో ఎక్కువ శాతం తాగుడు గోలే. ఎందుకు తెలంగాణా యూత్ అంతా తాగుతూ ఉంటారనే ప్రచారాలని ఈ సినిమాలు పని గట్టుకుని చేస్తున్నాయో అర్దం కాదు. తెలంగాణా నేటివిటి పాత్రలను మాత్రం బాగా పట్టుకున్నారు. తెలంగాణాలో ఓ పల్లెలో ఉన్న ఫీలింగ్ కాసేపు కలగచేసారు. అయితే అది కొంత సేపే. తెరపై ఏమీ జరగకపోతే, అదే కథ ముందుకు వెళ్లకపోతే ఏమి చూడగలంఎంతసేపు అని భరించగలం. అయితే ఆ ప్రాంత మూలాలు ఉన్నవారు కనెక్ట్ అవుతారు అని రాసుకున్నట్లు అయితే అదే జరగచ్చు. అంతకు మించి అయితే ఏమీ లేదు. ఈ సినిమా మరి ప్రేక్షకులను మెప్పించిందా అంటే పూర్తిగా లేదనే చెప్పాలి. మస్త్ గా నవ్వుకుందామని వెళ్తే యావరేజ్ గా ఉందిరా అయ్యా అని అంటున్నారు. కథ పూర్తిగానలుగురు దోస్త్ గాళ్లు నాలుగు పైసలునడిమిట్ల ఓ పిల్ల.అన్నట్లు నడిచింది. తిరువీర్ , పావని యాక్టింగ్ బాగుంది కానీమధ్యలో రూపక్ ఇచ్చిన కథే సరిగ్గా లేదని వాపోయే పరిస్దితి. డైరక్టర్ తాగుడు సీన్స్ మీద పెట్టిన దృష్టి సినిమా మీద పెట్టలేదనేది నిజం. ఫస్టాఫ్ సోసోగా, కథ సింపుల్‌గా, ఎలాంటి ట్విస్టులు లేకుండా సాగుతుంది. డైలాగులు బాగున్నాయి.

నటీనటుల్లో :

తిరువీర్మసూదకు ముందు పెద్దగా జనాలకు తెలవదు. కానీ ఆ సినిమాలో అమాయికుడా సహజమైన నటన చేస్తూ ప్రేక్షకులను భయపెట్టడమే కాదు, భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడీ పరేషాన్ (Pareshan Movie) లో కూడా చాలా బాగా చేసాడు. తనలోని నటుడుని పూర్తిగా ఆవిష్కరించారు. ఐజాక్ ఇట్లానే ఉంటాడురా అనిపించాడు.ఇందులో తిరువీర్ జోడీగా పావని కరణం నటించారు. ఇంతకు ముందు హిట్ 2 సినిమాతో పాటు ఆహా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ ద బేకర్ అండ్ ద బ్యూటీ, ది సిన్లో నటించారు. ఆమె కూడా బాగా చేసింది. ఆగమ్‌ సత్తిగా అర్జున్‌ కృష్ణ కూడా చాలా కాలం గుర్తుంటారు.

టెక్నికల్ గా :

పరేషాన్ చిత్రానికి రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించారు. డైరక్షన్ అంతంత మాత్రమే. బాధ వచ్చినా , అనందం వచ్చినా, కష్టాలు వచ్చినా ఇలా జీవితం లో ఒక మనిషికి ఏమొచ్చిన మా తెలంగాణ ప్రజలు మందు తాగుతారు అన్నట్టుగా డైరెక్టర్ ఈ చిత్రం లో చూపించాడు, అక్కడక్కడా నవ్వించాడు. కానీ కథే తెలంగాణాలో మొదలై కోనసీమలో ముగిసిందన్నట్లు నడిచింది. మిగతా విభాగాలు సినిమాకు తగినట్లే ఉన్నాయి. చాలా తక్కువలో చుట్టేసిన సినిమా ఇది అని చెప్పాలి.

Positives :

తిరువీర్ నటన
కొన్ని జెన్యూన్ నవ్వులు

Negatives :

కథ,స్క్రీన్ ప్లే
షార్ట్ ఫిలిం లా మేకింగ్

చూడచ్చా :

పూర్తి తెలంగాణ నెటివిటీ, యాస కారణంగా తెలంగాణేతర ప్రేక్షకులను ఈ సినిమా అందరినీ అంతగా అలరించకపోవచ్చు.

నటీనటులు :

తిరువీర్‌, పావని కరణం, బన్నీ అభిరన్‌, సాయి ప్రసన్న, అర్జున్‌ కృష్ణ, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు

సాంకేతికవర్గం :

నిర్మాత : సిద్ధార్థ్‌ రాళ్లపల్లి
సమర్పణ: రానా దగ్గుబాటి
దర్శకత్వం : రూపక్ రోనాల్డ్సన్
సంగీతం: యశ్వంత్‌ నాగ్‌
సినిమాటోగ్రఫీ: వాసు పెండమ్‌
రన్ టైమ్ : 131 మినిట్స్
ఎడిటర్‌ : హరిశంకర్‌
విడుదల తేది : జూన్‌ 2, 2023