Reading Time: 2 mins

Kaalamega Karigindi Press Meet
కాలమేగా కరిగింది ప్రెస్ మీట్

కాలమేగా కరిగింది కలహాలు లేని ప్రేమ కథ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం మార్చి 21 న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. సినిమా పాటలను ఆదిత్య మ్యూజిక్ వేదికగా విడుదల చేసినట్లు మూవీ టీమ్ చెప్పారు. అందమైన ప్రేమ కథను కమర్షియల్ గా కాకుండా చాలా సహజంగా, ఒక ప్రేమ కావ్యంలా చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సినిమా నిర్మాత శివశంకర్ మాట్లాడుతూ.. మొదటగా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ కు ధన్యవాదాలు తెలిపారు. ట్రైలర్ లాంచ్ చేసి సినిమా గురించి ట్వీట్ చేయడంతో తమ టీమ్ కు ఎంతో బలం వచ్చిందని చెప్పారు. అలాగే ఆనంద్ దేవరకొండ ఇచ్చిన సపోర్ట్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. ఈ చిత్రం అచ్చమైన తెలుగులో స్వచ్చమైన ప్రేమకథతో మార్చి 21 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని కచ్చితంగా సినిమాను ఆదరించాలని పేర్కొన్నారు.

సినిమాటోగ్రాఫర్ వినిత్ పాపతి మాట్లాడుతూ.. చిన్న సినిమాను సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా పేరుకే చిన్న సినిమా కానీ కంటెంట్ విషయంలో చాలా పెద్ద సినిమా అని అన్నారు. అందరం ఒక టీంలా కష్టపడి సినిమా చేసినట్లు చెప్పారు.
సినిమాలో హీరోగా నటించిన వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని అన్నారు. ఇలాంటి సినిమాలు తెలుగులో అరుదుగా వస్తాయి, చూసి ఆదరిస్తే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తాయని పేర్కొన్నారు. చిత్రంలో నటించిన అందరికీ థ్యాంక్స్ చెప్పడం కాదు శుభాకంక్షలు చెప్పాలి అని అన్నారు. సినిమా కచ్చితంగా ఆదరించాలని కోరారు.

యంగ్ లీడ్ క్యారెక్టర్ చేసిన అరవింద్ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చిందని, ఎంతో కష్టపడి సినిమాకోసం పనిచేశామన్నారు. డైరెక్టర్ పేరు చాలా కాలం గుర్తుంటుందని తెలిపారు. మూవీ డైరెక్టర్ శింగర మోహన్ మాట్లాడుతూ.. సినిమా తీసి విడుదల చేయడం అంటే మాములు విషయం కాదని చెప్పారు. సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇది అందరిమనసును దోచే సినిమా అని చెప్పారు. సినిమా పూర్తి అయిన తరువాత పెద్ద బ్యానర్ పై విడుదల చేయాలని ఆఫీస్ ల చుట్టు తిరిగినప్పుడు ప్యాడింగ్ లేదని చాలా మంది రిజెక్ట్ చేశారు. కానీ ప్యాడింగ్ కన్న కంటెంట్ మాత్రమే ముఖ్యమని ఈ చిత్రం ప్రూఫ్ చేస్తుందని చెప్పారు. కచ్చితంగా ఒక హప్పీ ఎండింగ్ ఉండే చిత్రం అని మార్చి 21 విడుదల అవుతుంది అందరూ సినిమాను ఆదరించాలని కోరారు.

Cast : Vinay Kumar, Shravani Majjari & Aravind Mudigonda, Nomina Tara

Crew :

Movie Name : Kaalamega Karigindhi
Writer & Director : Singara Mohan
Producer : Mare Siva Shankar
Banner : Singaara Creative Works
DOP : Vineeth Pabbathi
Editor : Ra Yogesh
Music Director : Gudappan
Sound Design : Sai Maneendhar Reddy (SILENCIO)
Mixing Engineer : Santhosh Kumar Vodnala
DI : Manohar Dev
VFX : Anil Kumar Jooluri