A1 ఎక్స్ ప్రెస్ చిత్రం ప్రీ -రిలీజ్ ఈవెంట్
 
 
A1 ఎక్స్ ప్రెస్ సందీప్ కిషన్ కి బ్లాక్ బస్టర్ అవ్వాలి-ఫ్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ 
 
యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లుపై డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించిన చిత్రం “A1 ఎక్స్ ప్రెస్”. ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి హిప్ అప్ తమిజా సంగీతాన్ని అందించారు.
 
ఈ చిత్రం ఫ్రీ- రిలీజ్ వేడుక ఫిబ్రవరి 28న హైదరాబాద్ జేఆర్సి కన్విక్షన్ సెంటర్ లో  అభిమానుల కోలాహలం మధ్య వైభవంగా జరిగింది.
 
ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ముఖ్యఅతిధిగా విచ్చేయగా ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్, రచయితలు కోన వెంకట్, లక్ష్మీ భూపాల్, ప్రముఖ కెమెరామెన్ ఛోటా కె.నాయుడు, హీరో సందీప్ కిషన్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, దర్శకుడు డెన్నిస్ జీవన్ కానుకొలను, కో-ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల, చిత్ర నిర్మాత టిజి.విశ్వప్రసాద్, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కన్వీనర్ కృతి ప్రసాద్,  స్టోరీ బ్యాంక్ హెడ్ విజయ, ప్రముఖ దర్శకులు వియన్ ఆదిత్య, జి.నాగేశ్వరరెడ్డి,   తదితరులు హాజరయ్యారు.
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాక్డౌన్ టైములో సోషల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించింది.. ఎంతోమంది ఈ కాంటెస్ట్ లో పాల్గొనగా అందులో ముగ్గుర్ని విజేతలుగా ఎంపిక చేశారు. వారికి లక్షరూపాయల ప్రైజ్ మని అందించారు.. ఇదే వేదికపై స్టార్ జిని యాప్ లాంచ్ చేశారు.
 
అనంతరం.. 
 
ముఖ్యఅతిధి ఎనర్జిటిక్ స్టార్ రామ్ మాట్లాడుతూ..’ లాక్డౌన్ టైంలో ఒక దుబాయ్ ప్రొడ్యూసర్ తెలుగు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి.. మేమంతా వెయిట్ చేస్తున్నాం.. అన్నారు. అంటే మన తెలుగు సినిమాకోసం వరల్డ్ మొత్తం ఎదురుచూస్తోంది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా సందీప్ కిషన్ చెన్నైలో పరిచయం అయ్యాడు. గౌతమ్ మీనన్ దెగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి తర్వాత హీరో అయి, రెస్టారెంట్స్ స్టార్ట్ చేసి, ఇప్పుడు సలూన్స్ కూడా మొదలుపెట్టాడు. ఒక మనిషి ఇన్ని బిజినెస్ లలో సక్సెస్ అవడం చాలా కష్టం. సందీప్ సక్సెస్ అయ్యాడు. లావణ్య ఈస్ట్ గోదావరిలో పుట్టింది. తనకి వెటకారం చాలా ఎక్కువ. ఎప్పుడు కాల్ చేసినా నవ్విస్తుంటుంది. A1 ఎక్స్ ప్రెస్ ట్రైలర్ చూస్తుంటే పెద్ద సినిమా రేంజ్ లో కనిపిస్తుంది.  ప్రతి యాక్టర్ కి ఒక పెద్ద హిట్ సినిమా అనేది వస్తుంది.  సందీప్ కేరియర్ లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుంది. హిప్ అప్ తమిళ మ్యూజిక్ చాలా బాగుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, వివేక్ చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఎప్పుడూ క్వాలిటీ మూవీస్ నిర్మిస్తారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
 
యంగ్ హీరో సందీప్ కిష‌న్ మాట్లాడుతూ  –  “మాములుగా రామ్ ఏ ఫంక్ష‌న్‌కి రాడు. అలాంటిది మా ఫంక్ష‌న్‌కి రావ‌డం హ్యాపీ.రామ్ అన్ని సినిమాలు చూశాను. రామ్‌లాగా నేను ఎందుకు డ్యాన్స్‌లు చేయ‌డంలేదు అనిపిస్తుంటుంది. నేను యాక్ట‌ర్ అవ్వ‌క‌ముందు నేను క‌లిసిన మొద‌టి హీరో రామ్‌. మా ప్రొడ్యూస‌ర్స్ కి ఎంత థ్యాంక్స్ చెప్పినా స‌రిపోదు. అలాంటి ప్రొడ్యూస‌ర్స్ మ‌న‌కు ఉండ‌డం ఒక గొప్ప విష‌యం. ఈ మూవీని  కేవ‌లం 40 రోజుల్లోనే తీశాం. దానికి మా నిర్మాత‌లే కార‌ణం. లావ‌ణ్య చాలా హార్డ్ వ‌ర్క్ చేసింది. ఈ సినిమాతో 14 మంది కొత్త‌ టెక్నీషియ‌న్స్ ఇంట్ర‌డ్యూస్ అవుతున్నారు. డెన్నీస్ వైజాగ్ నుండి వ‌చ్చి ఒక షార్ట్ ఫిలిం తీసి త‌న హార్డ్ వ‌ర్క్ చూపించుకుంటే అత‌న్ని న‌మ్మి ఈ సినిమా ఇచ్చాం. చాలా మంచి ఔట్‌పుట్ వ‌చ్చింది. ఈ సినిమాలో దాదాపు 11 మంది ఫేమ‌స్ యాక్ట‌ర్స్ న‌టించారు. హిప్ఆప్ ఈ సినిమాకి హీరో..సినిమా త‌ప్ప‌కుండా అదిరిపోతుంది. మ‌నం ఏ సెల‌బ్రేష‌న్స్ కోరుకుంటామో అవ‌న్ని ఈ సినిమాలో ఉంటాయి. సుమ చివ‌ర‌లో కామెంట‌రీ చెప్పింది. అంద‌రూ థియేట‌ర్‌లోనే  సినిమా చూడండి“ అన్నారు.
 
హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ – “A1ఎక్స్ ప్రెస్ నా మ‌న‌సుకి న‌చ్చిన సినిమా. డెన్నిస్ నాకు ఈ స్టోరీ చెప్ప‌గానే ఓకే చెప్పాను. ఈ సినిమా కోసం హాకీ, బైక్ రైడింగ్ నేర్చుకున్నాను. సందీప్ మంచి స్నేహితుడు. సెట్లో చాలా హెల్ప్ చేశాడు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. అంద‌రూ థియేట‌ర్‌ల‌లో సినిమా చూడండి“ అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు డెన్నిస్ జీవన్ కానుకొలను మాట్లాడుతూ – “ఇంత మంది టాప్ స్టార్స్‌తో క‌ల‌సి ఈ వేదిక మీద నిల‌బ‌డ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నేష‌న‌ల్ స్పోర్ట్స్ మూవీని డైరెక్ట్ చేసే అవ‌కాశం ఇచ్చిన సందీప్ కిష‌న్ అన్న‌కి, మా నిర్మాత‌ల‌కి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.
 
ప్ర‌ముఖ నిర్మాత  కోన వెంక‌ట్ మాట్లాడుతూ  –  “సందీప్ కిష‌న్‌తో ఒక సినిమా చేశాను. ఈ సినిమాకి అన్ని పాజిటీవ్ వైబ్స్ క‌నిపిస్తున్నాయి. సందీప్ మ‌ల్టీ టాస్కింగ్ ప‌ర్స‌న్‌. చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తాడు. ట్రైల‌ర్ చూడ‌గానే హ్యూజ్ స‌క్సెస్ అవుతుంది అనిపించింది. డెన్నిస్ డెబ్యూ మూవీ త‌న‌కి ఆల్ ది బెస్ట్‌. ఈ సినిమా అంద‌రికీ మేజ‌ర్ ఎసెట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
 
ప్ర‌ముఖ నిర్మాత అనిల్ సుంక‌ర మ‌ట్లాడుతూ – “ ఈ చిత్ర నిర్మాత విశ్వ ప్ర‌సాద్‌గారు, హీరో సందీప్ కిష‌న్, అభిషేక్ అగ‌ర్వాల్, ద‌య‌ వీళ్లంద‌రూ  నా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌లాంటి వారు.  ట్రైల‌ర్ చాలా బాగుంది. ఈ సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టిని నుండి అంతా పాజిటీవ్‌గానే జ‌రుగుతుంది. త‌ప్ప‌కుండా 100% స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు. 
 
ప్ర‌ముఖ నిర్మాత ఎంఎల్ కుమార్ చౌద‌రి మాట్లాడుతూ – “ ఈ సినిమ‌లో సాంగ్స్, ట్రైల‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. సందీప్ చాలా బాగా న‌టించాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. నిర్మాత‌ల‌కి ఆల్ ది బెస్ట్ “ అన్నారు.
 
తారాగ‌ణం:
సందీప్ కిష‌న్‌, లావ‌ణ్యా త్రిపాఠి, రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్యా, రాహుల్ రామ‌కృష్ణ‌, మ‌హేష్ విట్టా, ర‌ఘుబాబు, అభిజిత్‌, భూపాల్‌, ఖ‌య్యుమ్‌, సుద‌ర్శ‌న్‌, శ్రీ‌రంజ‌ని, ద‌యా గురుస్వామి
 
సాంకేతిక బృందం:
ద‌ర్శ‌కుడు: డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను
నిర్మాత‌లు: టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం
స‌హ నిర్మాత‌: వివేక్ కూచిభొట్ల‌
మ్యూజిక్‌:  హిప్ హాప్ త‌మిళ‌
సినిమాటోగ్ర‌ఫీ: కెవిన్ రాజ్‌
ఎడిటింగ్‌: చోటా కె. ప్ర‌సాద్‌
సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి, సామ్రాట్‌
ఆర్ట్‌: అలీ