ARM మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Published On: January 22, 2024   |   Posted By:

ARM మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

సంచలనం సృష్టిస్తున్న టోవినో థామస్ ARM ఫస్ట్ లుక్

వరుస హిట్‌లతో దూసుకుపోతున్న టోవినో థామస్ తన తాజా పాన్ఇండియా ఫాంటసీ చిత్రం ARMతో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, డాక్టర్ జకారియా థామస్ నిర్మిస్తున్నారు. పూర్తిగా 3డిలో రూపొందిన ARM మలయాళ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటి. టోవినో థామస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది.

మూడు యుగాల కథ, ARM టోవినో థామస్‌ను 3 విభిన్న పాత్రలు  మణియన్, అజయన్, కుంజికేలుగా ప్రజెంట్ చేస్తోంది. భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం ఖగోళ రహస్యం బ్యాక్ డ్రాప్ లో వుండటంతో విజువల్ వండర్ గా ఉండబోతుందని హామీ ఇచ్చింది. ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం మలయాళం, హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ 6 భాషల్లో విడుదల కానుంది.

ARM చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి వంటి భారీ తారాగణం ఉంది, ప్రముఖ నటులు బాసిల్ జోసెఫ్, జగదీష్, హరీష్ ఉత్తమన్, హరీష్ పేరడి, ప్రమోద్ శెట్టి, రోహిణి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సుజిత్ నంబియార్ స్క్రిప్ట్ రాశారు. దిబు నైనన్ థామస్ సంగీతం అందించారు.

తారాగణం :

టోవినో థామస్, కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ మరియు సురభి లక్ష్మి, బాసిల్ జోసెఫ్, జగదీష్, హరీష్ ఉత్తమన్, హరీష్ పెరడి, ప్రమోద్ శెట్టి, రోహిణి.

సాంకేతిక వర్గం :

బ్యానర్లు: మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జితిన్ లాల్
నిర్మాతలు: లిస్టిన్ స్టీఫెన్, డా. జకారియా థామస్
సంగీతం: దిబు నైనాన్ థామస్
ఎడిటర్: షమీర్ ముహమ్మద్