Coolie movie review
కూలీ చిత్ర సమీక్ష
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
వైజాగ్ పోర్టులో ఓ మాఫియా ఖరీదైన చేతి వాచీల స్మగ్లింగ్ చేస్తూ ఉంటుంది. ఆ మాఫియాకి లీడర్ సైమన్ (అక్కినేని నాగార్జున), వాచీలతో పాటు హ్యూమన్ ఆర్గాన్ ట్రాఫికింగ్ చేస్తుంటాడు. అతని కుడి భుజమైన దయాళ్ (సౌబిన్ షాహీర్) పోర్టులో కూలీల చేత పని చేయిస్తుంటాడు. పర్యావరణానికి తక్కువ హాని చేసే యంత్రాన్ని (crematorium) కనిపెట్టిన రాజశేఖర్ (సత్యరాజ్), అతని కూతురు ప్రీతి (శృతి హాసన్) అనుకోని పరిస్థితుల్లో సైమన్ దగ్గర పని చేయాల్సి వస్తుంది. తన స్నేహితుడైన రాజశేఖర్ మరణానికి కారకులైన వారిని పట్టుకోవటానికి దేవా (రజినీకాంత్) ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.
అసలు సైమన్ ఎవరు? అతనికి, దేవాకి ఉన్న సంబంధం ఏంటి? శృతి హాసన్ తండ్రి ఎవరు? దయాళ్ నేపథ్యం ఏంటి? ఇత్యాది అంశాలను వెండితెర పై చూడాల్సిందే!
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
దేవా పాత్రలో రజినీకాంత్ తన స్టైల్ నటనతో మరో సారి అభిమానులను అలరించారు. కొన్ని సన్నివేశాలలో వింటేజ్ రజిని కనిపించారు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. రజిని స్నేహితుడిగా నటించిన సత్యరాజ్ మరోసారి ప్రాముఖ్యత గల పాత్రను చక్కగా పోషించారు. ఆయన కూతురిగా నటించిన శృతి నటనలో పరిణితి కనిపించింది. “సైమన్” పాత్రలో అక్కినేని నాగార్జున కొత్త లుక్ తో ఆకట్టుకున్నారు. ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. సౌబిన్ షాహీర్ పోషించిన దయాళ్ పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే సినిమా కథ మొత్తం అతని చుట్టూనే తిరుగుతుంది. రచితా రామ్ పరవా లేదు.
టెక్నికల్ గా :
కెమెరామెన్ గిరీష్ గంగాధరన్ విజువల్స్ బాగున్నాయి. అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి వెన్నెముక అని చెప్పచ్చు. ఎడిటర్ మొహమాట పడకుండా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్లేదు.
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
రజినీకాంత్ & నాగార్జున పెర్ఫార్మెన్స్, అనిరుధ్ నేపథ్య సంగీతం, యాక్షన్ సీక్వెన్సెస్, మోనికా సాంగ్
మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ కాస్తా డిసప్పాయింట్ చేస్తుంది
బ్యానర్: సన్ పిక్చర్స్
నిర్మాతలు: కళానిధి మారన్
విడుదల తేదీ: 14 –08-2025
సెన్సార్ రేటింగ్: “A“
సాంకేతికవర్గం :
రచన – దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
కెమెరా: గిరీష్ గంగాధరన్
సంగీతం: అనిరుధ్
ఆర్ట్ డైరెక్టర్: సతీష్ కుమార్
ఎడిటింగ్: ఫీలోమీన్ రాజ్
రన్ టైమ్ : 2 hrs 50 mins
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్