Reading Time: < 1 min

Game Changer Movie In OTT
ఓటీటీలో గేమ్ ఛేంజర్ చిత్రం

దిల్ రాజు నిర్మించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై మొదటి రోజే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శంకర్ నుంచి సినిమా వస్తుంది అంటే అందిరికి భారీ అంచనాలు ఉంటాయి. ఈ సినిమా మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. తాజాగా గేమ్ ఛేంజర్ నిర్మాతలు ఓ అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 7 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

రామ్ చరణ్ తో పాటు కియార అద్వానీ, ఎస్ జే సూర్య నటించిన ఈ పొలిటికల్ డ్రామా బీ, సీ సెంటర్లో మంచి టాక్ తెచ్చుకుంది. ఒక జిల్లా కలెక్టర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ సినిమాలో చూపించారు. ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్, ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ జే సూర్య నడుమ వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటన మెప్పిస్తుంది. అతడికి ఉండే లోపం కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే పాయింట్ ను చాలా బాగ ప్రజెంట్ చేశారు. థియేటర్లో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించని ఈ చిత్రం ఓటీటీలో మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.