Reading Time: 2 mins

Hari Hara Veera Mallu Movie Review

హరి హర వీర మల్లు మూవీ రివ్యూ

 

Emotional Engagement Emoji

 

స్టోరీ లైన్ :

16వ శతాబ్దంలో భారతదేశ సహజ సంపదను తెల్ల దొరలు ఓ వైపు దోచుకుంటుంటే మరో వైపు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హిందువులను మతం మారాలని చిత్ర హింసలు పెడుతుంటాడు, జిజియా పన్ను కూడా వసూలు చేస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో అగ్రహారంలో పెరిగిన వీరమల్లు డెక్కన్ చక్రవర్తి తానీషా కోరిక మేరకు ఔరంగజేబు ఎర్రకోట నేలమాళిగలో దాచిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని తీసుకొస్తానని మాటిస్తాడు.

 

ప్రమాదాలకు, ప్రత్యర్థులకు భయపడని వీరమల్లు తానీషా చక్రవర్తి‌కి దగ్గరకి చేరుకోవటానికి వేసిన ఎత్తులు ఏంటి? అతని అంతిమ లక్ష్యం కోహినూర్ వజ్రం మాత్రమేనా? హీరోయిన్ పంచమి వీరమల్లుని ఎందుకు మోసం చేసింది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే వీరమల్లు చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే!

 

ఆర్టిస్ట్ ఫెరఫార్మెన్స్ :

హరిహరవీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ తన విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను , అభిమానులను మరోసారి ఉర్రూతలూగించాడు. నిధి అగర్వాల్ పంచమి పాత్రలో ఒదిగిపోయింది. నాజర్, సునీల్, బాబీ డియోల్ తదితర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ ఓ పాటలో తళుక్కున మెరిశారు.

 

టెక్నికల్ గా :

సీనియర్ కెమెరామన్ జ్ఞాన వెల్ మరియు మనోజ్ పరమహంస విజువల్స్ బాగున్నాయి. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసింది, ఎడిటింగ్ పర్లేదు & ప్రొడక్షన్ డిజైనింగ్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, కీరవాణి నేపథ్య సంగీతం, యాక్షన్ సీక్వెన్సెస్  

మైనస్ పాయింట్స్ :

కామెడీ, ఎడిటింగ్

తీర్పు : సూపర్ హిట్  

 

నటీనటులు: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్  తదితరులు

సాంకేతికవర్గం :

కెమెరా: జ్ఞాన్ వేల్ , మనోజ్ పరమహంస

బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్   

విడుదల తేదీ: 24 -07-2025

సెన్సార్ రేటింగ్: “U/A

దర్శకత్వం: క్రిష్ – జ్యోతికృష్ణ   

సంగీతం: ఎం ఎం కీరవాణి  

ఆర్ట్ డైరెక్టర్: సాహిల్ కుమార్  

సినిమాటోగ్రఫీ: జ్ఞాన్ వేల్ & మనోజ్ పరమహంస

ఎడిటింగ్: ప్రవీణ్ కె ఎల్

నిర్మాత: ఏ. దయాకర్ రావు

రన్ టైమ్ : 152 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్