Junior Movie Review
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
కోదండపాణి (రవిచంద్రన్) – శ్యామల అనే దంపతులు పెద్ద వయసులో తల్లిదండ్రులు కాబోతున్నారని తెలుసుకుంటారు. దాంతో ఊళ్ళో వాళ్ళంతా వారిని హేళన చేస్తారు. అవమానాన్ని తట్టుకోలేక కోదండపాణి గర్భవతి అయిన తన భార్యతో సొంత ఊరైన విజయనగరం విడిచి వెళ్లిపోతాడు. అయితే, ప్రయాణంలోనే ఆమెకు ప్రసవ వేదన వచ్చి బస్సులోనే బిడ్డను కని మరణిస్తుంది. కోదండపాణి తన భార్యను కోల్పోయినా, బిడ్డను జాగ్రత్తగా పెంచుతాడు. అతనే అభినవ్ (కిరీటి రెడ్డి). కాలేజీలో ఏంటో హుషారుగా ఉండే అభినవ్ తనతో పాటు చదువుకుంటున్నశృతి (శ్రీలీల)ను ప్రేమిస్తాడు. ఉద్యోగ కోసం “RISE” కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళిన అభి అక్కడ కాబోయే సి ఈ ఓ విజయ సౌజన్య (జెనీలియా)తో గొడవ పెట్టుకుని ఆమె ఈగో హర్ట్ చేస్తాడు. విజయ తండ్రి, కంపెనీ చైర్మన్ అయిన గోపాల్ (రావు రమేష్) ఆదేశాలతో అభినవ్ మరియు విజయ సౌజన్య తమ టీంతో కలిసి విజయనగరం వెళ్ళాల్సిన సిట్యువేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి కథ మలుపులు తిరుగుతుంది. దర్శకుడు చివరి అరగంట ఆసక్తికరంగా మలిచాడని చెప్పచ్చు.
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
హీరోగా కిరీటి రెడ్డి తొలి చిత్రమైనా ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా ఈజ్ తో అభినవ్ పాత్రను పోషించాడు. ప్రధానంగా డ్యాన్స్ లో అతని ఎనర్జీ వేరే లెవెల్ అని చెప్పచ్చు! హీరోయిన్ శ్రీలీల సన్నివేశాలు తక్కువైనా “వైరల్ వయ్యారి” పాటతో మరో సారి ఆకట్టుకుంది. సీనియర్ కన్నడ హీరో రవిచంద్రన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు, అలానే రావు రమేష్ గారు ఎప్పటిలానే తన సహజ శైలిలో గోపాల్ పాత్రకు న్యాయం చేసారు. సత్య కామెడీ పరవా లేదు. ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేసారు. వైరల్ వయ్యారి పాటలో హాస్యనటుడు బ్రహ్మానందం గారు తళుక్కున మెరుస్తారు.
టెక్నికల్ గా :
సీనియర్ కెమెరామన్ సెంథిల్ విజువల్స్ బాగున్నాయి. డి ఎస్ పి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ & ప్రొడక్షన్ డిజైనింగ్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
కిరీటి రెడ్డి పెర్ఫార్మెన్స్, వైరల్ వయ్యారి సాంగ్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ
శ్రీమంతుడు చిత్రాన్ని గుర్తుకు తెచ్చే సెకండ్ హాఫ్
తీర్పు : యావరేజ్
నటీనటులు: కిరీటి రెడ్డి, శ్రీలీల, రవిచంద్రన్, రావు రమేష్, సత్య తదితరులు
సాంకేతికవర్గం :
కెమెరా: సెంథిల్
బ్యానర్: వారాహి ఆర్ట్స్
విడుదల తేదీ: 18-07-2025
సెన్సార్ రేటింగ్: “U“
దర్శకత్వం: రాధాకృష్ణ రెడ్డి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: సాహిల్ కుమార్
సినిమాటోగ్రఫీ: సెంథిల్
ఎడిటింగ్: నిరంజన్
నిర్మాత: రజనీ కొర్రపాటి
రన్టైమ్: 150 నిమిషాలు
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్